Alternaria alternata
శీలీంధ్రం
మొట్టమొదట, అంచుల దగ్గర పసుపురంగు వలయాలుగా అభివృద్ధి అయ్యే గోధుమ రంగు నుండి నలుపు రంగు మచ్చలుగా లేత ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమరహిత లేదా వృత్తాకార నిర్జీవ ప్రాంతాలుగా ఆకులో పెద్ద ప్రాంతాలను కప్పివేసి విస్తరిస్తాయి. నెక్రోసిస్ మరియు క్లోరిసిస్ ఈనెల వెంబడి వ్యాప్తి చెందవచ్చు. ఈ మచ్చలు చదునుగా ఉండి ఆకుల రెండు వైపులా కనిపిస్తాయి. పాత మచ్చలు వాటి మధ్యలో ఒక పెళుసైన కాగితం వంటి ఆకృతిని కలిగి ఉంటాయి.అపరిపక్వ పండ్ల మీద పసుపు రంగు వలయాలు గల కొద్దిగా ముడుచుకుపోయిన ముదురు రంగు మచ్చలు కనబడతాయి. మరింత పరిపక్వతను వచ్చిన పండ్లలో చిన్న చిన్న మచ్చలు నుండి పెద్ద గుంటల ప్రమాణం వరకు ఏర్పడతాయి. పండు చర్మం ఉపరితలం నుండి పైకి వాచినట్టు కనపడే కార్క్ వంటి కణజాలం అవరోధాన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్కి కణజాలం రాలిపడిపోతే క్రేటర్స్ లేదా గుంతలు కనిపిస్తాయి. సహజంగా ఎదగని పండ్లు రాలిపోతాయి.
కాపర్ ఆక్సిక్లోరైడ్ ఆధారిత సేంద్రీయ శిలీంధ్రాలు ఆల్టర్నేరియా గోధుమ రంగు మచ్చకు వ్యతిరేకంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి కాకుండా, ఈ తెగులుతో పోరాడటానికి సహాయపడే మరి ఏదైనా విధానం మీకు తెలిసి వుంటే దయచేసి మాకు తెలియచెయ్యండి. మీ నుండి వినడం కోసం మేము ఎదురుచూస్తున్నాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్రోడియోన్, క్లోరోతలోనిల్ మరియు అజాక్సిస్ట్రోబిన్ ఆధారిత ఫంగైసైడ్స్ ఆల్టర్నేరియా బ్రౌన్ స్పాట్ ను బాగా నియంత్రిస్తాయి. ప్రొపికోనజోల్ మరియు థియోఫనేట్ మిథైల్ ఆధారిత ఉత్పత్తులు కూడా అత్యంత సమర్థవంతమైనవిగా నిరూపించబడ్డాయి. సరైన మోతాదులను మరియు సాంద్రతలను అనుసరించడం వలన ఈ మందులకు తెగులు నిరోధకతను పెంచుకోకుండా చూడవచ్చు
లక్షణాలు ఆల్టర్నేరియా ఆల్ట్రనటా అనే ఫంగస్ వలన కలుగుతాయి. ఇది గాలి ద్వారా లేదా నీటి తుంపరలవలన వ్యాపిస్తుంది. కొమ్మలు, ఆకు లేదా పండ్ల మచ్చల మీద ఉన్న శిలీంద్రం వర్షం, లేదా సాపేక్ష ఆర్ద్రతలో ఆకస్మిక మార్పులు ఈ క్రిముల ఉత్పత్తికి మరియు విడుదలకు అనుకూలంగా వుంటాయి. ఆల్టర్నేరియా గోధుమ రంగు మచ్చలు తరచూ మనుషులు రవాణా చేసే నర్సరీ మొక్కల నుండి తరచుగా వ్యాపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన మొదటి 36 నుండి 48 గంటల తర్వాత లేత ఆకులపైన ఈ లక్షణాలు కనిపిస్తాయి. పూరెక్కలు రాలిన తర్వాత 4 నెలల వరకు కూడా పండ్లకు ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

This page is powered by millions of live Plantix diagnoses. Build plant-disease detection like this into your own products with the API Toolkit, part of Plantix Intelligence.