Rhizoctonia solani
శీలీంధ్రం
మట్టికి దగ్గరగా ఉండే ఆకుల ఉపరితలంపై చిన్న 2-3 మిమీ తెలుపు లేదా లేత గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ బయటికి వ్యాపిస్తుంది. ప్రాథమిక గాయాల చుట్టూ నిర్జీవ కణజాల రింగులు సృష్టించబడతాయి. పొలంలో, మొదట బాగా క్రిందిగావున్న, ముదురు ఆకులపై టార్గెట్ స్పాట్ ఏర్పడుతుంది, తరువాత కాలక్రమేణా పై భాగంలోని ఆకులకు విస్తరిస్తుంది.
ట్రైకోడెర్మా ఎస్పి.. టి. హార్జియానం యొక్క ఐసోలేట్‌లు ఆర్. సోలని యొక్క పెరుగుదలను తగ్గించి, పొగాకు మొక్కలలో వ్యాధి నియంత్రణను పెంచుతాయి.
అందుబాటులో ఉన్నట్లయితే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. శిలీంధ్ర ఆకు మచ్చలను నియంత్రించడానికి మాంకోజెబ్ మరియు అజోక్సిస్ట్రోబిన్ లను ఆకులపై పిచికారీ చేయవచ్చు.
మట్టి ద్వారా సంక్రమించే ఆర్. సోలాని అనే వ్యాధికారకం వల్ల నష్టం జరుగుతుంది. ఫంగస్ ప్రధానంగా మట్టిలో హైఫే లేదా స్క్లెరోటియాగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు ఉన్న గ్రీన్‌హౌస్ మొలకలతో ఈ వ్యాధి సంక్రమించవచ్చు లేదా పొలాల్లో మరియు చుట్టుపక్కల సహజంగా ఉండే టార్గెట్ స్పాట్ ఫంగస్ ద్వారా సంక్రమించవచ్చు. మితమైన ఉష్ణోగ్రతలు, అధిక తేమ మరియు ఎక్కువ కాలం ఆకులు తడిగా ఉండటం ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటుంది. వ్యాధిని సరిగా నియంత్రించకపోతే దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.

This page is powered by millions of live Plantix diagnoses. Build plant-disease detection like this into your own products with the API Toolkit, part of Plantix Intelligence.