Rhizopus artocarpi
శీలీంధ్రం
పువ్వులు మరియు లేత పండ్లపై మృదువైన, నీరులాంటి గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. కుళ్లుతున్న ప్రాంతాన్ని బూడిద-గోధుమ రంగు, బొచ్చులాంటి బూజు వేగంగా కప్పేస్తుంది. పండు ఉపరితలంపై ముదురు రంగు గడ్డ ఏర్పడటంతో అది నల్లగా మారుతుంది. పండ్లు ముడుచుకుపోయి, కుళ్ళిపోయి, కోతకు ముందే చెట్టు నుండి రాలిపోవచ్చు.
పూత దశలో నివారణ చర్యగా వాడినప్పుడు, బోర్డో మిశ్రమం వంటి రాగి ఆధారిత ఉత్పత్తులు కొంతమేరకు రక్షణను అందించగలవు. సూడోమోనాస్ జాతుల వంటి రైజోబాక్టీరియా మరియు ట్రైకోడెర్మా ఆధారిత జీవ నియంత్రణ ఉత్పత్తులు ఈ వ్యాధిని అణచివేయడంలో సహాయపడతాయి. పనసలో సాఫ్ట్ రాట్ తెగులు నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిమితంగా ఉన్నాయి; నివారణ మరియు పొలంలో మంచి పరిశుభ్రత మైంటైన్ చేయడం అనేవి మంచి పంటయాజమాన్యానికి పునాది.
రసాయన నియంత్రణ మార్గాలు పరిమితంగా అందుబాటులో ఉన్నాయి; పనసలో సాఫ్ట్ రాట్ వ్యాధిని ఏ ఒక్క ఉత్పత్తి కూడా పూర్తిగా నియంత్రించలేదు.
సాధారణంగా, ఈ శిలీంధ్రం మట్టిలో మరియు చనిపోయిన మొక్కల అవశేషాలపై ఉంటుంది. ఇది గాలి ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. వెచ్చని, తేమతో కూడిన మరియు వర్షపు వాతావరణం ఈ వ్యాధి సోకడానికి, వ్యాప్తి చెందడానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇతర పంటల మాదిరిగా కాకుండా, పనస పండుకు గాయం లేకపోయినా కూడా ఈ వ్యాధి సోకగలదు. పండ్ల కోత తర్వాత పండు యొక్క కాడ భాగంలో వ్యాధి సోకడం ప్రారంభం కావచ్చు. పండ్లు నిల్వ చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రత మరియు గాలి ప్రసరణ సరిగా లేకపోవడం వ్యాధి వృద్ధిని వేగవంతం చేస్తాయి. మరియు వ్యాధి సోకిన పండు కొద్ది రోజుల్లోనే దానికి సమీపంలో ఉన్న పండ్లకు వ్యాధిని వ్యాపింపజేయగలదు. చిలగడదుంప, బ్రెడ్‌ఫ్రూట్, ప్యాషన్‌ఫ్రూట్, వంకాయ మరియు నిమ్మజాతి పండ్లతో సహా అనేక ఇతర మొక్కలు కూడా ఈ వ్యాధికి ఆతిథేయంగా పనిచేయగలవు.