దానిమ్మ

పిండి నల్లి

Pseudococcidae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • తెల్లటి పత్తి వంటి ద్రవ్యరాశులు ఆకులు, కాండాలు, పువ్వులు మరియు పండ్లపై కనిపిస్తాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారటం లేదా ముడుచుకుపోవటం జరుగుతుంది.
  • మొక్కలు బాక్టీరియా మరియు ఫంగల్ తెగుళ్లకు గురయ్యే అవకాశం ఉంటుంది.
  • మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

33 పంటలు

దానిమ్మ

లక్షణాలు

తెల్లటి పత్తి లాంటి పిండి నల్లి మంద ఆకుల క్రింద, కాడలు, పువ్వులు మరియు పండ్లపై కనిపిస్తాయి. ఈ తెగులు వలన లేత ఆకులు పసుపు రంగులోకి మారటం లేదా ముడుచుకుపోవటం, మొక్కల ఎదుగుదల తగ్గటం మరియు పండ్లు త్వరగా రాలిపోవడం జరుగుతుంది. కణ ద్రవ్యాన్ని పీల్చుకునేటప్పుడు ఇవి తేనే బంక లాంటి పదార్ధాన్ని విసర్జిస్తాయి. దీనివలన కణజాలం జిగటగా మారి అవకాశవాద బాక్టీరియా మరియు ఫంగస్ ఆవాసం ఏర్పరుచుకోవడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా పండ్లు దాడికి గురయే అవకాశం అధికంగా ఉంటుంది మరియు పండు వైకల్యం చెందడం లేదా మైనపు స్రావాలతో పూర్తిగా కప్పబడవచ్చు. ఈ తేనె బంకకు చీమలు ఆకర్షింపబడి ఈ తెగులును ఇతర మొక్కలకు వ్యాపింప చేసే అవకాశం ఉంటుంది. ముదురు ఆకులు రూపం కోల్పోవడం లేదా వక్రీకరింపబడే అవకాశం తక్కువ.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు కనిపించిన వెంటనే వీటిని నూనె లేదా స్పిరిట్లో ముంచిన పత్తితో పూత వేయాలి. మీరు మొక్కలపై క్రిమి సంహారక సబ్బు పిచికారీ చేయవచ్చు. వీటి జనాభా వ్యాప్తి చెందకుండా ఉండడానికి సమీపంలో వున్న మొక్కలపై వేప నూనె లేదా పెరిత్రిన్ పిచికారీ చేయాలి. గ్రీన్ లేస్ వింగ్, పరాన్న జీవి కందిరీగలు, హోవర్ ఫ్లైస్, హోవర్ ఈగలు, లేడీ బర్డ్ బీటిల్స్, పిండి నల్లి నాశిని మరియు ప్రెడేటర్ సీతాకోక చిలుక స్పాల్గియస్ ఏపీఎస్ ఈ పిండి నల్లికి సహజ శత్రువులు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పైన వున్న మైనపు పొరల వలన ఇవి సహజంగా వాతావరణం మరియు కొన్ని రకాల రసాయనాల వల్ల ప్రభావితం అవ్వవు. అసిఫేట్, బిఫెత్రిన్, క్లోర్ఫెరిఫోస్ , డెల్టామెత్రిన్ మరియు పెరిథ్రోయిడ్లు ఈ పిండి నల్లి మీద మంచి ప్రభావం చూపుతాయి. వంటి మిశ్రమాలు వీటిపైన మంచి ప్రభావం చూపుతాయి.

దీనికి కారణమేమిటి?

పిండ నల్లులు కోలగా ఉండి, రెక్కలు లేని పురుగులు. ఇవి అధికంగా వేడి ప్రదేశాల్లోనే కనిపిస్తాయి. వీటి శరీరం పల్చని మైనపు పదార్థంతో కప్పబడి ఉండటం వల్ల ఇది పత్తి లాగ కనిపిస్తుంది. ఇవి వాటి పొడవాటి కొమ్ములను వుపయోగించి మొక్కల కణజాలాన్ని జుర్రుకుంటాయి. ఇవి వదిలిన విషపూరిత పదార్ధాల ప్రతి స్పందన వలన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఇవి మట్టిలో గుడ్లను పెడతాయి. ఇవి పొదిగిన తర్వాత పురుగులు దగ్గరలోఉన్న మొక్కలపైకి పాకుతాయి. ఇవి గాలి, వర్షం, చీమలు మరియు పక్షులు వంటి వాటి వలన లేదా కొమ్మలు కత్తిరించడం మరియు పంట కోతలు వంటి పొలం పనులు చేస్తున్నప్పుడు పని వలన వ్యాపిస్తాయి. ఈ తెగులుకు వంగ, చిలకడ దుంపలు, మరియు చాలా రకాల కలుపు మొక్కలు ఏ తెగులుకు ఆవాసాలుగా ఉంటాయి. వేడి ఉష్ణోగ్రతలు మరియు పొడి వాతావరణం వీటి జీవిత చక్రానికి సహకరిస్తాయి.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన మూలాల నుండి ఆరోగ్యవంతమైన మొక్కల విత్తనాలను వాడండి.
  • ఈ తెగులు లక్షణాలకోసం పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను, వాటి భాగాలను తొలగించి నాశనం చేయండి.
  • పొలంలో కలుపు మొక్కలను తొలగించండి.
  • ఈ తెగులు సంక్రమించని మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • ఈ తెగులు సోకే అవకాశం వున్న పంటలను ఈ ప్రాంతంలో పెంచకండి.
  • పొలంలో పని చేస్తున్నప్పుడు పిండి నల్లి వ్యాప్తి చెందకుండా బాగా జాగ్రత్తలు తీసుకోండి.
  • వీటి సహజ శత్రువులు పొలంలో వృద్ధి చెందడానికి వీలుగా మంచి పొలం యాజమాన్య పద్దతులను పాటించండి, ఉదాహరణకు పిండి నల్లి కి ప్రత్యేకమైన పురుగు మందు.
  • సీజన్లో అధిక మొత్తంలో నీరు పెట్టడాన్ని నివారించండి.
  • సమతుల్యమైన మరియు సరైన సమయంలో ఎరువులు వేసే ప్రణాళికను అనుసరించండి.
  • కాండం లేదా కొమ్మల చుట్టూ జిగురు పట్టీలు అమర్చి చీమలను నియంత్రించవచ్చు.
  • పరికరాలు మరియు పనిముట్లు శుద్ధి చేయడాన్ని అత్యధికంగా సిఫారసు చేయబడింది.
  • ఈ తెగులు సోకని పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి