Pseudocercospora abelmoschi
శీలీంధ్రం
ప్రారంభంలో, ముఖ్యంగా ముదురు ఆకుల క్రింది భాగంలో అసృష్టమైన ఆలివ్-రంగు మచ్చలను గమనించవచ్చు. భూమికి దగ్గరగా వున్న ఆకులు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయి. లేత గోధుమరంగు నుండి బూడిద రంగు బూజు లాంటి శిలీంధ్ర పెరుగుదల ప్రభావిత ఆకు ఉపరితలాలపై వృద్ధి చెందుతుంది. వ్యాధి పెరిగేకొద్దీ, ఈ మచ్చలు నిర్జీవంగా మారతాయి అలాగే ఆకు పైభాగంలో కూడా కనిపించవచ్చు. తెగులు సోకిన ఆకులు చివరికి ఎండిపోయి వాలిపోతాయి. కాండం, పండ్లు కూడా ఇటువంటి లక్షణాలతో ప్రభావితమవుతాయి. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మొక్క ఆకులు పూర్తిగా రాలిపోతాయి. దీని లక్షణాలు సి. మలేయెన్సిస్ లక్షణాలవలె వుండి గందరగోళానికి గురి చేయవచ్చు.
ఈ రోజు వరకు, ఈ వ్యాధికి వ్యతిరేకంగా జీవ నియంత్రణ విధానం గురించి మాకు తెలియదు. సంభవం లేదా లక్షణాల తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మధ్యాహ్నం సమయంలో ఆకుల దిగువ భాగంలో.శిలీంద్ర నాశినులను పిచికారీ చేయాలి. రాగి ఆక్సిక్లోరైడ్ @ 0.3%, మాన్‌కోజెబ్ @ 0.25% లేదా జినెబ్ @ 0.2% వంటి రక్షిత శిలీంద్ర నాశినులను విత్తిన తర్వాత ఒక నెలకు వాడండి మరియు తీవ్రతను బట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి వీటిని మళ్ళీ వాడండి. 15 రోజుల విరామంతో కార్బెండజిమ్ 50 డిఎఫ్ @ 0.1% ను వాడడం వలన కూడా వ్యాధిని నియంత్రించడంలో మంచి ఫలితాలను చూపించింది.
సూడోసెర్కోస్పోరా అబెల్మోస్చి అనే ఫంగస్ వలన ఈ ఆకు మచ్చలు ఏర్పడతాయి. ఇది మట్టిలో తెగులు సోకిన మొక్కల అవశేషాలపై మనుగడ సాస్తూ బెండ మొక్కల వేర్లు మరియు క్రింది భాగంలోని ఆకులకు సంక్రమిస్తుంది. గాలి, వర్షం, నీటిపారుదల మరియు యాంత్రిక సాధనాల ద్వారా బీజాంశం ద్వితీయ వ్యాప్తి చెందుతుంది. ఆర్ధ్రతతో కూడిన సీజన్లో (పూత దశ) ఆకు మచ్చలు చాలా సాధారణం, ఎందుకంటే శిలీంధ్రాలు వెచ్చని మరియు తడి వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose బెండలో ఆకు మచ్చ తెగులు with Demand Creation, part of Plantix Intelligence.