Golovinomyces cichoracearum
శీలీంధ్రం
మొదటగా, కింది భాగంలో ఉన్న ముదురు ఆకుల పైభాగంలో తెల్లటి పౌడర్ వంటి మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు క్రమంగా విస్తరించి ఆకు ఉపరితలం మొత్తాన్ని కప్పివేస్తాయి. ఈ వ్యాధి తీవ్రమైన సందర్భాలలో ఈ పౌడర్ లాంటి పూత కాండాలపై మరియు ఆకుల కింది భాగాలలో కూడా వృద్ధిచెందవచ్చు. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగులోకి, ఆ తర్వాత గోధుమ రంగులోకి మారి, ఎండిపోవచ్చు. తీవ్రంగా వ్యాధి సోకిన మొక్కలు సత్తువను కోల్పోయి త్వరగా ముదిరిపోవచ్చు. వ్యాధి ముదిరిన దశలలో, ఈ తెల్లటి మచ్చల లోపల చిన్న, ముదురు రంగు, గుండ్రని నిర్మాణాలు కనిపించవచ్చు.
ట్రైకోడెర్మా జాతులు మరియు బాసిల్లస్ సబ్టిలిస్ వంటి జీవ నియంత్రణ కారకాలు, గంధకం ఆధారిత ఉత్పత్తులు, పొటాషియం బైకార్బోనేట్ ద్రావణాలు లేదా వేప నూనె పిచికారీలను ముందుగానే ఉపయోగిస్తే అవి వ్యాధి నియంత్రణలో సహాయపడవచ్చు.
జీవ లేదా పర్యావరణ అనుకూల చికిత్సలతో పాటు నివారణ చర్యలను ఉపయోగించే సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. శిలీంధ్రనాశినులను నివారణకు లేదా వ్యాధి యొక్క మొదటి లక్షణం కనిపించినప్పుడు ఉపయోగించినప్పుడు మాత్రమే అవి అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. పిచికారీ చేసేటప్పుడు మొక్క పైభాగమంతా బాగా పడేలా చూసుకోండి, ఎందుకంటే వ్యాధికారకం మొక్క అంతటా వేగంగా వ్యాపిస్తుంది. వ్యాధి నిరోధకత వృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి శిలీంధ్రనాశక మందులను మార్చి మార్చి ఉపయోగించండి.
చాలా శిలీంధ్ర వ్యాధుల వలె కాకుండా, ఇది తక్కువ తేమతో కూడిన వెచ్చని, పొడి వాతావరణ పరిస్థితులలో వృద్ధి చెందుతుంది. పగటిపూట వేడి వాతావరణం మరియు రాత్రి పూత చల్లని వాతావరణం దీని వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. ఇది గాలి ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రం సోకడానికి ఆకుల ఉపరితలంపై నీరు అవసరం లేదు. ఆఫ్-సీజన్‌లో ఇది వ్యాధి సోకిన మొక్కల శిథిలాలపై మరియు అడవి పొద్దుతిరుగుడు వంటి అడవి ఆతిథ్య మొక్కలపై జీవిస్తుంది. గాలి ప్రసరణ సరిగా లేని దట్టమైన మొక్క పందిళ్ళు వ్యాధి సోకే ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.