Herbicides Cell Membrane Disruptors
ఇతర
ఉపయోగించిన కలుపు నాశిని, అప్లికేషన్ సమయం మరియు మోతాదుపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఆకులు నీటితో నానబెట్టినట్టు వున్న గాయాలు కలిగి ఉంటాయి. తరువాత అవి ఎండిపోతాయి. మొలకలు వచ్చే ముందు ఈ మందులను వాడడం వలన కణజాలం కాలడం లేదా మొలకలు ఆవిర్భవించకపోవడం అనేవి ఈ కలుపు సంహారకాల యొక్క లక్షణం. ఆవిర్భవించిన తర్వాత ఈ మందులను వాడినప్పుడు అవి మచ్చల మాదిరిగా కాల్చడానికి కారణమవుతాయి. ఇది పారాక్వాట్ గాయాన్ని పోలి ఉండి గందరగోళం కలిగిస్తుంది. కానీ ఇది కాంస్య రంగులో ఉండదు.
దీనికి జీవ చికిత్స అందుబాటులో లేదు. హాని మొదట జరగకుండా నివారించడానికి నివారణ మరియు మంచి వ్యవసాయ పద్ధతులు కీలకం. అధిక మోతాదు వాడినట్టు అనుమానం ఉన్నట్లయితే, మొక్కలను బాగా శుభ్రపరచడం లేదా కడగడం చేయడం వలన సహాయకారిగా ఉంటుంది.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒక కలుపు నాశిని పిచికారీని ప్లాన్ చేయడానికి ముందు, మీరు నిర్మూలించవలసిన కలుపు రకం మీకు తెలుసు అని (ప్రాథమికంగా బ్రాడ్ లీఫ్ కలుపు మొక్కలు vs గడ్డి) మరియు ఈ ప్రయోజనం కోసం ఇతర పద్ధతులు బాగా సరిపోవు అని నిర్ధారించుకోండి . కలుపు నివారిణులను జాగ్రత్తగా ఎంచుకోండి, లేబుల్ ను జాగ్రత్తగా చదవండి మరియు సూచించినట్లు సూచనలు, మోతాదులను అనుసరించండి.
ఫ్లూమియోక్సాజిన్, ఫోమెసాఫెన్, లాక్టోఫెన్, కార్ఫెంట్రాజోన్, అసిఫ్లోర్ఫెన్, డిఫెనిలేథర్స్ కుటుంబానికి చెందిన పిపిఓ ఇన్హిబిటర్స్ యొక్క కలుపు నాశినుల వలన ఈ నష్టం కలుగుతుంది. క్లోరోఫిల్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా ఇవి కణ త్వచానికి అంతరాయం కలిగిస్తాయి. భంగపరుస్తాయి. కాంతి మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 1 నుండి 3 రోజులలో ఆకు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు వృద్ధి చెందడానికి కాంతి అవసరం, మరియు ప్రకాశవంతమైన, వెచ్చని రోజులలో బాగా వృద్ధి చెందుతుంది.

This page is powered by millions of live Plantix diagnoses. Explore the live agronomic intelligence behind this page with Plantix Intelligence.