Chiloloba acuta
కీటకం
దక్షిణ భారత దేశంలో ఈ పచ్చ లోహపు రంగు పెంకు పురుగు చిలిలోబా అక్యూట ఈశాన్య రుతుపవనాలు అయిన తర్వాత గడ్డిపైన కనిపిస్తుంది. ఇది అప్పుడపుడు సజ్జలు, మొక్కజొన్న మరియు జొన్న మొక్కలను కూడా తింటుంది. ఇది ముఖ్యంగా పుప్పొడి రేణువులకోసం వెతుకుతుంది. ( అందువల్లనే దీనికి పుప్పొడి పెంకు పురుగు అనే ఇంకొక పేరు కూడా వుంది.) ఇవి ఆహరం తీసుకుంటున్న సమయంలో పువ్వులకు నష్టం కలగచేస్తాయి. దీనివలన గింజలు సరిగా ఏర్పడవు. ఇవి పుప్పొడి రేణువులు మరియు పువ్వులను తింటాయి కానీ ఒకొక్కసారి ఇవి మొగ్గలపైన మరియు ఆకులపైన కూడా దాడిచేస్తాయి. కుళ్లుతున్న సేంద్రియ పదార్ధాలపైన వీటి లార్వా కనపడుతుంది. కానీ ఈ లార్వా వలన మొక్కలకు నష్టం కలగదు.
హెటేరో హాబ్ధిటిస్ బ్యాక్తీరియోఫోరా మరియు కొన్ని స్టెయిన్ర్నెమా జాతుల ( S. సియాంకయ్యి, S. థెర్మోఫీలుమ్ మరియు S. అబ్బాసీ) నెమటోడ్లను మధ్యస్థం నుండి అధిక మోతాదులో వాడితే ఛాఫెర్ పెంకు పురుగు యొక్క పెద్ద లార్వా చాలా సున్నితంగా స్పందిస్తుంది. మెటార్హిజియం అనిసోప్లై వంటి కొన్ని జాతుల ఫంగస్ వీటిని బాగా నియంత్రించగలవు. ఈ నెమటోడ్లు మీ ప్రాంతంలో లభిస్తాయేమో తెలుసుకోండి. మట్టికి వేప కేక్ ను కలపడం వలన ఈ పెంకు పురుగులు ఆహరం తీసుకోవడం మానేస్తాయి మరియు వీటి పరిమాణం తగ్గుతుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులను పెద్ద పెంకు పురుగులపైన ఉపయోగించవచ్చు.
చిలోలోబా అక్యూట అనే ఛాఫెర్ పెంకు పురుగులవలన ఈ నష్టం కలుగుతుంది. ఇది భారత ఉప ఖండంలో చాలా విరివిగా విస్తరించి ఉంటుంది. పెద్ద పెంకు పురుగులు మెరిసే లోహపు పచ్చ రంగులో ఉంటాయి. కానీ కొని రకాల పురుగులు ఎరుపు లేదా ముదురు నీలం రంగులో కూడా ఉంటాయి. వీటికి ఒక ప్రక్కన మరియు క్రింది భాగంలో సక్రమంగా లేని జుట్టు కుచ్చు లాగ ఉంటుంది. ఆడ పురుగులు క్రీమ్ రంగు తెల్లని గుడ్లను ఒకొక్కటిగా మట్టి పైపొరలలో, ఆకులపైన లేదా కుళ్ళును చెక్కపైన పెడుతుంది. వీటి లార్వా C ఆకారంలో ఉంటుంది. ఇవి సేంద్రియ మట్టిలో వున్న ( కొమ్మలు, రెమ్మలు మరియు కాండం) పదార్ధాన్ని ఆహారంగా తింటాయి. సాధారణంగా దక్షిణ భారత దేశంలో వుండే పెద్ద పెంకు పురుగులు ఈశాన్య రుతుపవనాల తర్వాత గడ్డిపైన కనిపిస్తాయి. ఇవి అప్పుడపుడు సజ్జలు, మొక్కజొన్న మరియు జోనమొక్కలను కూడా ఆహారంగా తింటాయి. దీనివలన పువ్వులు మరియు గింజలు దెబ్బతింటాయి.