Mycosphaerella brassicicola
శీలీంధ్రం
సాధారణంగా ముదురు ఆకులపై లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ లేత ఆకులు ప్రభావితమైతే లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ప్రారంభంలో ఆకు ఉపరితలంపై చుట్టూ పసుపు రంగు వలయంతో, 3-5 మిమీ పరిమాణంలో చిన్న ముదురు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆకుపచ్చ-గోధుమ లేదా బూడిద-నలుపు రంగులో వుండి ఆకు ఈనెల వరకు పరిమితం చేయబడతాయి.చివరికి 2-3 సెం.మీ. పరిమాణానికి చేరతాయి. మచ్చల లోపల చిన్న నల్లటి చుక్కలు కేంద్రీకృత వలయాలుగా ఏర్పడతాయి. ఈ మచ్చలు కలిసిపోయి ఆకు పసుపు రంగులోకి మారవచ్చు. సంక్రమణ తీవ్రంగా వుంటే అది ఆకులు అకాలంగా రాలిపోవడానికి దారితీస్తుంది. ఆకు ఈనెల రింగ్ స్పాట్ ఫంగస్ వల్ల ఏర్పడిన మచ్చలు ఆల్టర్నేరియా జాతుల వల్ల కలిగిన మచ్చలు వలే కనిపిస్తాయి. ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే రింగ్ స్పాట్ గాయాలు బూడిద రంగులో ఉంటాయి మరియు అవి కేంద్రీకృత రింగులలో పిన్ హెడ్ పరిమాణంలో నలుపు రంగు చుక్కలను కలిగి ఉంటాయి. నేలకి పైన వున్న మొక్క అన్ని భాగాలూ లక్షణాలను చూపించవచ్చు. గాయాలు నల్లటి ఫలాల నుండి ముదురు రంగు కేంద్రీకృత వలయాలను, పసుపురంగు జోన్ చుట్టూ ఖచ్చితమైన అంచులను కలిగి ఉంటాయి. తీవ్రమైన సంక్రమణలో ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోతాయి మరియు మొత్తం మొక్క ప్రభావితమై నల్లబడవచ్చు. విత్తన కాడలలో ఈ ఫంగస్, 2,4-డి అనే కలుపు నాశిని వల్ల కలిగే గాయం లాంటి వక్రీకరణకు కారణమవుతుంది. నిల్వ చేసిన క్యాబేజీపై ముదురు రంగు గాయాలు ఏర్పడవచ్చు మరియు లోతుగా చొచ్చుకుపోవచ్చు.
ఇప్పటి వరకూ ఈ వ్యాధికి వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న జీవ నియంత్రణా పద్ధతి గురించి మాకు తెలియదు. లక్షణాల సంభవం లేదా తీవ్రతను తగ్గించడానికి ఏదైనా విజయవంతమైన పద్ధతి మీకు తెలిస్తే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే జీవసంబంధమైన చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. విత్తనాలు నాటడానికి ముందు తీరం లేదా మాంకోజెబ్‌తో చికిత్స చేయండి. చల్లని మరియు తేమతో కూడిన వాతావరణంలో క్లోరోథనోనిల్, మాంకోజెబ్ లేదా రాగిని పిచికారీ చేయాలి. అధిక సంఖ్యలో గాలిలో ఉండే బీజాంశాల కారణంగా కూరగాయల ఉత్పత్తి ఎక్కడ అధికంగా జరుగుతుందో అక్కడ దీన్ని నియంత్రించడం కష్టం. పర్యావరణ పరిస్థితులు చల్లని మరియు తడిగా ఉన్న ప్రదేశం ఈ వ్యాధి వ్యాప్తి మరియు సంక్రమణకు అనుకూలంగా ఉంటుంది.
గాలి ద్వారా వ్యాప్తి చెందే మైకోస్‌ఫారెల్లా బ్రాసిసికోలా అనే వ్యాధికారకం వల్ల నష్టం జరుగుతుంది. బీజాంశాలు నీటి తుంపర్లు, గాలి మరియు వర్షం ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఫంగస్ పునరుత్పత్తి కోసం కనీసం నాలుగు రోజులు ఉండే 100% సాపేక్ష ఆర్ద్రత కాలం అవసరం.16-20°C ఉష్ణోగ్రతలు మరియు పేలవమైన నేల డ్రైనేజి వ్యాధికారకం యొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ వ్యాధి ఎక్కువగా విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సమస్య, మరియు విత్తనాలు వ్యాధికారక కారకాన్ని కలిగి ఉండవచ్చు. ఫంగస్ సోకిన కలుపు మరియు పంట అతిధేయ మొక్కలపై లేదా అవశేషాలలో కూడా శీతాకాలం అంతా జీవించి ఉంటుంది. బీజాంశాలు గాలి ద్వారా వ్యాపిస్థాయి. చల్లని తేమ వాతావరణం వ్యాధి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose రింగ్ స్పాట్ with Demand Creation, part of Plantix Intelligence.