Crocidolomia binotalis
కీటకం
ప్రారంభ లక్షణాలు ఆకుల చుట్టూ చుట్టబడినట్టు వున్న పట్టు లాంటి గూళ్ళ ద్వారా వర్గీకరించబడతాయి. ఇవి తిన్న నష్టాన్ని ఆకులపై చూడవచ్చు. ఈ పురుగులు ఆకులను అస్థిపంజరం వలే చేస్తాయి. తరచుగా క్యాబేజీ లోపలి ఆకులు దెబ్బతింటాయి. ఇవి పూమొగ్గలను తింటాయి మరియు వాటికి రంధ్రాలు చేస్తాయి. క్యాబేజీల ఆకులు మరియు మధ్యభాగంలో గొంగళి పురుగులు విసర్జిస్తాయి. ఆకుల దిగువ భాగంలో గుడ్లు కనిపిస్తాయి. ఆకులు దెబ్బతినడం వల్ల ప్రభావిత మొక్కల ఆరోగ్యం క్షీణిస్తుంది.
నష్టం కనిపించిన వెంటనే బాసిల్లస్ తురింజెన్సిస్‌ను వాడండి (సాయంత్రం సమయాల్లో వాడాలి) గొంగళి పురుగులు పురుగుమందులను తినేలా చేయడం ద్వారా వాటిని చంపే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా చల్లడం ద్వారా మొక్కలను పూర్తిగా కప్పండి. గుడ్లపై బిటి పనిచేయదు, కానీ పూర్తిగా పెరిగిన వాటి కంటే చిన్న లార్వా పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 15 లీటర్ల నీటికి ఒక లీటర్ చొప్పున తాజా వేప, నిమ్మ గడ్డి, అల్లం లేదా ఇతర బొటానికల్ పురుగుమందులను వాడండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విస్తృత శ్రేణి పురుగుమందులను (పెరిథ్రాయిడ్లు మరియు ఆర్గానోఫాస్ఫేట్లు వంటివి) వాడటం మానుకోండి ఎందుకంటే అవి వీటి సహజ శత్రువులను చంపుతాయి. ఫోసలోన్, ఫెన్వాలరేట్, సైపర్‌మెత్రిన్ లేదా డెల్టామెత్రిన్ వంటి పురుగుమందులను పిచికారీ చేయండి. ఇలాంటి చర్యతో పురుగుమందులను మరలా వాడకండి.
క్రోసిడోలోమియా బైనోటాలిస్ యొక్క లార్వా వలన నష్టం జరుగుతుంది. ఈ లార్వా చాలా అరుదుగా మొలకలపై దాడి చేస్తుంది కాని మొక్క అన్ని దశలలోనూ తింటుంది. ఇవి బైట ఆకుల దిగువ భాగంలో 40 నుండి 100 సమూహాలలో గుడ్లు పెడతాయి. ఇవి మొదట పాలిపోయిన ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. తరువాత పొదగడానికి ముందు ప్రకాశవంతమైన పసుపు మరియు గోధుమరంగులోకి మారతాయి. కొత్తగా పొదిగిన గొంగళి పురుగు లార్వా సుమారు 2 మి.మీ పొడవు ఉంటుంది మరియు ఇవి పరిపక్వత చెందినప్పుడు పొడవాటి వెంట్రుకలతో 20 మి.మీ వరకు పెరుగుతాయి. తరువాతి దశలలో, ఇవి ఆకులపై మందపాటి గూళ్ళను తయారు చేస్తాయి మరియు గొంగళి పురుగులు వాటి క్రింద భాగంలో తింటాయి. సాధారణంగా ఇవి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి మరియు ప్రారంభ దశల నుండి పంటకోత కాలం వరకు పంటలకు సంక్రమిస్తాయి. ఇది ముల్లంగి, ఆవాలు, ఎర్ర ముల్లంగి మరియు ఇతర క్రూసిఫర్‌లకు కూడా సంక్రమిస్తుంది. క్యాబేజీ పైన ఉండే వీటి విసర్జన పదార్ధాలు, ఈ కూరగాయలను తినడానికి పనికిరాకుండా చేస్తాయి.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose క్యాబేజీ లీఫ్ వెబ్బర్ with Demand Creation, part of Plantix Intelligence.