టమాటో

టమాటో లో క్యాట్ పేస్

Physiological Disorder

ఇతర

5 mins to read

క్లుప్తంగా

  • మొగ్గ చివరలో కాయ మీద తీవ్రమైన వైకల్యం, చారలు మరియు చీలికలు వుంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

టమాటో

లక్షణాలు

కాట్ ఫేస్ అనేది తరుచుగా మొగ్గ చివరలో వైకల్యం మరియు కాయల మీద మచ్చలకు దారి తీసే ఒక శారీరకమైన రుగ్మత. ప్రభావిత పండ్లు ఖండఖండాలుగా మారి కార్క్ వంటి గోధుమరంగు మచ్చలు గల పొరలుగా ఉన్న ఆకారాన్ని కలిగి కండ లోపలికి లోతుగా విస్తరించి ఉంటాయి. ఈ పరిస్థితిని ఒకే ప్రదేశం రేడియల్ చీలికగా పొరపాటు పడకూడదు. అమ్మడానికి పనికిరానప్పటికీ ఈ రూపం మారిన పండ్లు వాటి రుచిని కోల్పోవు మరియు వాటిని సురక్షితంగా తినొచ్చు. పుష్పించే సమయంలో 12°C కంటే తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలతో చల్లటి వాతావరణం, అధిక నత్రజని స్థాయిలు మరియు కలుపు సంహారకాల వలన కలిగే గాయం వలన టమోటాలు ఇలా రూపు మార్చుకుంటాయి.పెద్ద పరిమాణంలో పండ్లు వచ్చే టమాటో రకాలు ఈ వ్యాధికి అధికంగా గురవుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ సమస్యను నివారణా చర్యలతో మాత్రమే నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సులభంగా అమలు చేయగల నివారణా చర్యలతో మాత్రమే ఈ వైకల్యాన్నినివారించవచ్చు. అయితే,కొన్ని మొక్కల రకాలలో కలుపు సంహారకాల వాన ఈ సమస్య వచ్చే అవకాశం వుంది కావున అటువంటి వాటిని వినియోగించకండి.

దీనికి కారణమేమిటి?

టమోటాలలో కాట్ ఫేసింగ్ ఎందుకు వస్తుంది అనేది చెప్పడానికి ఖచ్చితమైన కారణాలు అస్పష్టంగా వుంటాయి, కానీ సాధారణంగా పెద్ద పండ్లు దిగుబడి ఇచ్చే మొక్కల రకాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. మొగ్గ అభివృద్ధి చెందే సమయంలో వరుసగా రోజుల తరబడి తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు (12 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా తక్కువ), పువ్వు యొక్క అసంపూర్ణ ఫలదీకరణం కారణంగా ఏర్పడే ఈ శారీరక రుగ్మత ఏర్పడవచ్చు. కొన్ని మొక్కల రకాలు ఈ ఉష్ణోగ్రత మార్పులకు ఎక్కువగా ఆకర్షితం అవుతాయి. మొగ్గ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎదురయ్యే ఇతర ఇబ్బందులు కూడా కాట్ ఫేసింగ్ కు దారితీయవచ్చు. మొగ్గకు నష్టం జరిగినప్పుడు అధికంగా కత్తిరించడం లేదా కొన్ని కలుపు సంహారకాలకు (2, 4-D) కు గురికావడం కూడా రూపు మారిన పండ్లు తయారవడానికి కారణం కావచ్చు. అసమతుల్య నత్రజని సరఫరా కారణంగా అధిక పండు పెరుగుదల కూడా ఒక కారణం కావచ్చు. చివరగా, త్రిప్స్ నష్టం లేదా టమాటో లిటిల్ లీఫ్ అనే ఒక పరిస్థితి కూడా కాట్ ఫేసింగ్ కు దారితీయగలవు.


నివారణా చర్యలు

  • ఉష్ణోగ్రతలలో మార్పులను బాగా తట్టుకునే రకాలను ఉపయోగించండి.
  • ఈ పరిస్థితికి దారితీసే కలుపు సంహారకాల వినియోగాన్ని నివారించండి.
  • మొగ్గలు పెరిగే సమయంలో ఉష్ణోగ్రతను తరుచుగా పర్యవేక్షించండి.
  • పొలం పనుల సమయంలో మొక్కలకు గాయం అవకుండా చూసుకోండి.
  • ఎరువులు వేసే ముందు మట్టిలోని నత్రజని స్థాయిలను గమనిస్తూ వుండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి