Coccus viridis
కీటకం
పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు ఆకులు మరియు చిగుర్ల క్రిందిభాగం నుండి రసాన్ని పీలుస్తాయి. ఇవి రసం పీల్చడం మరియు తేనె బంకను విసర్జించడం వలన నల్లని బూజు ఏర్పడుతుంది. ఇది శీలింద్ర పెరుగుదలకు దారితీస్తుంది. నల్ల బూజు కిరణజన్య సంయోగక్రియను నిరోధిస్తుంది, ఇది ఉత్పాదకతను తగ్గిస్తుంది. పెద్ద సంఖ్యలో ఉన్న ఆకుపచ్చ పొలుసు పురుగుల జనాభా మొక్కలను బలహీనపరుస్తుంది మరియు పసుపు రంగులోకి మార్చి ఆకులను కోల్పోయేలా చేస్తుంది. ఈ పురుగులు ఆకులను ఎక్కువగా తినడం వలన తెగులు సోకిన కొమ్మలు వాడిపోతాయి
కోకస్ విరిడిస్‌కు సహజ శత్రువులు, వీటిని వేటాడి తినే కీటకాలు మరియు పరాన్నజీవులు ఉన్నాయి. సహజ శత్రువులలో ఆరుద్ర పురుగు (చిలోకోరస్), గొంగళి పురుగులు (నోక్టుయిడే: యుబ్లెమ్మా) మరియు పరాన్నజీవులు (అఫెలినిడే: కోకోఫాగస్, కొన్ని ఎన్‌సైర్టిడే మరియు యూలోఫిడే) వంటి కీటకాలు పురుగులు వున్నాయి. సెఫాలోస్పోరియం లెకాని అనే పరాన్నజీవి ఫంగస్ ముఖ్యంగా వర్షాకాలంలో ప్రభావవంతంగా ఉంటుంది, ఇది ఆకుపచ్చ కాఫీ పొలుసు పురుగులను పెద్ద సంఖ్యలో త్వరగా చంపగలదు. ప్రధానంగా, తెగులు ముఖ్యమైన ముప్పుగా ఉన్న కాఫీ పొలుసు పురుగులపై జీవ చికిత్సలు ఉపయోగించబడుతున్నాయి. వేప సంబంధిత ఉత్పత్తులతో చేసే చికిత్సలు కూడా పొలుసు పురుగులపై కొంత పరాభావం చూపుతాయి.
జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ఇథియాన్ వంటి ఆర్గానోఫాస్ఫేట్లు పొలుసు పురుగులతో సహా అనేక రకాల తెగుళ్లను నయం చేయగలవు. రసాయన చికిత్సకి సంభందించిన స్థానిక నిబంధనలను పాటించండి. పురుగుమందును ఉపయోగిస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ రక్షిత దుస్తులను ధరించండి మరియు మోతాదు, వాడాల్సిన సమయం మరియు పంటకు ముందు విరామానికి సంబంధించి ఉత్పత్తి లేబుల్‌పై ఇవ్వబడిన సూచనలను అనుసరించండి,
కోకస్ విరిడిస్ వల్ల నష్టం జరుగుతుంది. పంటకోతతో సహా అనేక దశలు ఈ తెగులు ముట్టడికి గురవుతాయి. పునరుత్పత్తి ఫలదీకరణం లేకుండా ప్రత్యేకంగా జరుగుతుంది. వీటి జనాభాలో అన్నీ ఆడ పురుగులే ఉంటాయి. పచ్చ పొలుసు పురుగులు కూరగాయలు, పండ్లు మరియు అలంకార పంటలతో సహా అనేక రకాల మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ముఖ్యంగా ఇది ఆకులు మరియు ఆకుపచ్చ రెమ్మల దిగువ ఉపరితలంపై తింటుంది, కానీ వీటి జనాభా అధికంగా వున్నప్పుడు ఇది ప్రధాన కొమ్మలపైకి కూడా వెళుతుంది. సాధారణంగా పెద్ద పురుగులు మరియు పిల్ల పురుగులను ఆకుల మధ్యభాగం మరియు ఈనెల వద్ద చూడవచ్చు