చెరుకు

కణుపుల మధ్య తొలుచు పురుగు

Chilo sacchariphagus indicus

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల్లో రంధ్రాలు.
  • చిన్నగా మారిన కణుపుల మధ్యన ప్రాంతం.
  • పురుగులు కాండం మరియు కాడ లోపలి భాగంలో తింటాయి.
  • లార్వా తెల్లగా ఉండి, పొడవాటి చారలు, వెనక వైపు ముదురు రంగు మచ్చలు మరియు గోధుమ రంగు తల కలిగి ఉంటుంది.

లో కూడా చూడవచ్చు


చెరుకు

లక్షణాలు

గొంగళి పురుగులు మొదట చుట్టబడిన లేత ఆకులను తిని ఇవి షాట్ రంధ్రాలను ఏర్పరుస్తాయి. మొక్కల పెరుగుదల ప్రారంభ దశలో ఇవి ఎదుగుతున్న మొక్క భాగాలను తిని డెడ్ హార్ట్స్ ను ఉత్పత్తి చేస్తాయి. కణుపుల మధ్యన ప్రాంతం కుంచించుకుపోయి అనేక రంధ్రాలు ఏర్పడతాయి. కాండంలోకి ప్రవేశించి లోపల తినేటప్పుడు ఇవి ప్రవేశ రంధ్రాలను వాటి విసర్జక పదార్ధాలతో మూసివేస్తాయి. లార్వా కాండం కణజాలాలలో నుండి పైకి ఎగబాకుతూ ఎరుపు రంగుకు కారణమవుతుంది మరియు కణుపులకు నష్టం కలగచేస్తుంది. మొక్కల కాండాలు బలహీనపడతాయి మరియు గాలి వలన సులభంగా విరిగిపోతాయి. పెరుగుదల తగ్గడం ఇతర లక్షణాలుగా చెప్పుకోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు జీవసంబంధమైన పురుగుమందులు తెలియవు, కాని పరాన్నజీవులు దీని సంభావ్యతను తగ్గించగలవు. వారానికి ఒక హెక్టారుకు 50,000 ట్రైకొగ్రామా పరాన్నజీవులు తోటలో వదలండి. నాల్గవ నెలనుండి, గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామా చిలియోనిస్‌ను ఒక హెక్టారుకు 2.5 మిల్లీ లీటర్ల చొప్పున 4 వ నెల నుండి 6 రోజుల నుండి 15 రోజుల వ్యవధిలో విడుదల చేయండి. స్టెనోక్రాకాన్ డీసీ మరియు అపాంటెలెస్ ఫ్లేవైప్స్ లార్వా పరాన్నజీవులు. ప్యూపా దశ కోసం పరాన్నజీవి టెట్రాస్టిచస్ అయ్యారి మరియు ట్రైకోస్పైలస్ డయాట్రేలను వాడవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎదిగే సీజన్లో సీజన్లలో పక్షం రోజుల పాటు మోనోక్రోటోఫాస్ అనే సంపర్క పురుగుమందును పిచికారీ చేయండి. నష్టం తీవ్రంగా ఉంటే మట్టిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను హెక్టారుకు 30 కిలోల చొప్పున వేయండి.

దీనికి కారణమేమిటి?

చిలో సాచరిఫాగస్ ఇండికస్ యొక్క లార్వా వల్ల మొక్కకు నష్టం జరుగుతుంది. పెద్ద చిమ్మటలు చిన్నగా ఉండి, గడ్డి రంగులో ఉంటాయి, తెల్లటి వెనుక రెక్కలు మరియు ముందరి రెక్కలపై ఒక ముదురు రంగు గీత ఉంటాయి. ఇవి ఏడాది పొడవునా చురుకుగా ఉండి ఒక సంవత్సరంలో 5-6 తరాలు పూర్తి చేస్తాయి. సాధారణంగా, మొక్కలు, ప్రారంభ దశ నుండి పంట కోత వరకు ఈ తెగులుకు ప్రభావితమవుతాయి. లార్వా మొక్క యొక్క కణుపుల ప్రాంతంలో రంధ్రాలు చేసి కాండం లోకి ప్రవేశించి సొరంగాలు చేస్తూ పైకి వెళ్తుంది. చెరుకు రెమ్మల చుట్టూ నీటితో నిండిన పరిస్థితులు ఇంటర్నోడ్ బోరర్ కు అనుకూలంగా ఉంటాయి. అలాగే అధిక నత్రజని మోతాదులతో పాటు తక్కువ ఉష్ణోగ్రతలు మరియు అధిక తేమ దీనికి అనుకూలంగా ఉంటాయి. మొక్కజొన్న మరియు జొన్న దీనికి ఇతర అతిథేయ మొక్కలు.


నివారణా చర్యలు

  • CO 975, COJ 46 మరియు CO 7304 వంటి నిరోధక రకాలను ఉపయోగించండి.
  • నాటడానికి చీడలు లేని సెట్లను ఎంచుకోండి.
  • పంటలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • క్రమానుగతంగా గుడ్లను సేకరించి నాశనం చేయండి.
  • చెరుకు తోటలో మరియు చుట్టుపక్కల కలుపు మొక్కలను తొలగించి నాశనం చేయడం ద్వారా మంచి పరిశుభ్రతను పాటించండి.
  • అలాగే మీ పంటను జాగ్రత్తగా పండించండి.
  • నాటిన 150 మరియు 210 వ రోజు ఎండిన ఆకులను తొలగించి మీ పొలాన్ని శుభ్రం చేయండి.
  • పర్యవేక్షణ కోసం, ఒక హెక్టారుకు 10 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టండి మరియు 45 రోజులకు ఒకసారి వాటిని మార్చండి.
  • ఎక్కువ పురుగుమందులను వాడకుండా ఉండటం ద్వారా ప్రయోజనకరమైన కీటకాలు మరియు వీటి సహజ శత్రువులకు మంచి పరిస్థితులను కల్పించండి.
  • పంట కోత తర్వాత చివర్లో వచ్చిన చిగుర్లను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి