Megachile sp.
కీటకం
లక్షణాలు ఆకులపై మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఆకు అంచులలో వృత్తాకార నుండి కోలాకారపు రంధ్రాలను గమనించవచ్చు.
ఎటువంటి చికిత్స అవసరం లేదు.
ఈ తేనెటీగలు మీ పంటకు గొప్ప పరాగ సంపర్కాలు కాబట్టి, తీవ్రమైన లేదా కఠినమైన నిర్వహణ నియంత్రణలను అమలు చేయడం సిఫార్స్ చేయబడలేదు.
మెగాచైల్ కుటుంబానికి చెందిన ఒంటరి తేనెటీగలు ఈ లక్షణాలను కలిగిస్తాయి. ఈ తేనెటీగలు ఆకులను ముక్కలుగా చేసి వాటి గూళ్ళకు రవాణా చేరవేస్తాయి. పెద్ద ఆడ తేనెటీగలు కత్తిరించిన ఆకులను ఉపయోగించి గూళ్ళు నిర్మిస్తాయి. ఇవి సెల్స్ గా తయారుచేయడమే కాక ప్రతి సెల్ లో ఒక గుడ్డు పొదగబడుతుంది. కొన్ని సార్లు పైపొర వదిలిన తర్వాత లార్వా ఒక గూడును అల్లి అందులో ప్యూపా దశకు చేరుతుంది. ఇది గూడు నుండి పెద్ద తేనెటీగగా బైటకు వస్తుంది. సంభోగం చేసిన కొద్దిసేపటికే మగ తేనెటీగలు చనిపోతాయి, కాని ఆడ తేనెటీగ మరికొన్ని వారాల పాటు జీవించి ఉంటుంది. ఈ సమయంలో ఇవి కొత్త గూళ్ళు నిర్మిస్తాయి. ఇవి ఎటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగించవు.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose ఆకు కత్తెర వేసే తేనెటీగలు with Demand Creation, part of Plantix Intelligence.