Aproaerema modicella
కీటకం
ఆకు లోపలి భాగం (మెసోఫిల్)ను ఆహారంగా తినడం వలన లోపల తవ్వినట్టు మరియు ఆకుపై చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. లార్వా ఆకులను ఒకదానితో ఒకటి కలుపడమే కాక వాటిని తింటుంది. మిగిలిపొయినది మడతలలో ఉండిపోతుంది. దూరం నుండి చూస్తే, తీవ్రంగా దాడికి గురైన పొలాలు కాలిపోయినట్లు కనిపిస్తాయి. ప్రభావిత ఆకులు ఎండిపోయి మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది.
ఒక హెక్టారుకు 50000 ట్రైకోగ్రామా చిలియోనిస్ ను 7-10 రోజుల మధ్య విరామంలో రెండుసార్లు పొలంలో వేయండి. సాలెపురుగులు, పొడవు కొమ్ముల మిడత, ప్రేయింగ్ మాంటిస్, చీమలు, లేడీబర్డ్ బీటిల్స్, మిడుతలు వంటి సహజ జీవ నియంత్రణ కీటకాల జనాభాను పరిరక్షించండి. వరి గడ్డితో కప్పడం ప్రాక్టీస్ చేయండి, ఇది ఆకు మైనర్ సంభావ్యతను తగ్గిస్తుంది. పరాన్నజీవి గోనియోజస్ ఎస్.పి.పి వృద్ధి చెందేటట్తు పెంచడానికి సజ్జలను అంతర పంటగా వేయండి.
మొలకల దశలో (DAE) మొలకలు వచ్చిన 30 రోజుల తరువాత కనీసం 5 లార్వాలు అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వున్నప్పుడు, లేదా పూత దశలో 10 లార్వాలు (50 DAE), మరియు కాయ నిండే దశలో (70 DAE) ఒక మొక్కకు 15 లార్వాలు ఉండడం గమనించినప్పుడు మాత్రమే రసాయన స్ప్రేలు సిఫార్సు చేయబడతాయి.
లార్వా ఆకు చారల వలన వేరుశనగకు నష్టం కలుగుతుంది.ఆకు చారల గుడ్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి మరియు ఆకుల క్రింది భాగంలో ఒకొక్కటిగా పెట్టబడతాయి. లార్వా లేత ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ముదురు తల మరియు ప్రోథొరాక్స్‌తో ఉంటాయి. పెద్ద ఆకు మైనర్ 6 మి.మీ పొడవు ఉంటుంది. దీని రెక్కలు గోధుమ-బూడిద రంగులో ఉంటాయి. పెద్ద పురుగులు వాటి ముందు రెక్కలపై తెల్లని చుక్కలు ఉంటాయి. లార్వా ఆకుల లోపల తవ్వి ఆకుల లోపల భాగాన్ని తింటుంది. ఇవి 5-6 రోజుల తరువాత గని నుండి బయటకు వచ్చి, తినడానికి మరియు ప్యుపాగా మారడానికి ప్రక్క ఆకులకు వలసపోతాయి. ఆకులోని గని ప్రాంతాలు ఎండిపోతాయి. వర్షాకాలం, ఆ తర్వాత పంటలలో ఆకు మైనర్లు చురుకుగా ఉంటాయి మరియు నష్టాలు 25% నుండి 75% వరకు ఉండొచ్చు.

This page is powered by millions of live Plantix diagnoses. Build plant-disease detection like this into your own products with the API Toolkit, part of Plantix Intelligence.