సోయాబీన్

సోయాబీన్ కాండం తొలుచు పురుగు

Melanagromyza sojae

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • మృదువైన, ఎర్రటి-గోధుమ రంగు కుళ్ళిన కాండం కణజాలాల స్వరూపం.
  • ఇవి తినడం వలన ఏర్పడిన అతి చిన్న చిల్లులు.
  • కుచించుకుపోయిన వృద్ధి.
  • చిన్న నల్లని ఈగలు సంభవించడం.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

కాండం యొక్క కుళ్ళిన కణజాలం ద్వారా నష్టం వర్గీకరించబడుతుంది. అవి మృదువుగా మరియు ఎర్రటి-గోధుమ రంగులో మారుతాయి. ఆకు లామినా యొక్క మొదలు వద్ద అతి చిన్నటి ఓవిపోసిషన్ మరియు తినడం వలన సంభవించే చిల్లుల ద్వారా మాత్రమే బాహ్య లక్షణాలు గమనించబడతాయి. 5-8 సెం.మీ ఎత్తు గల మొక్కలకు ఈ తెగులు సంక్రమిస్తుంది. కాండం వ్యాసం అలాగే మొక్క యొక్క ఎత్తు (మరుగుజ్జు) తగ్గిపోవచ్చు. ఉత్పాదక దశలో సోకినప్పుడు, కాయలు తగ్గుతాయి, ఫలితంగా పండ్ల దిగుబడులు పడిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఎం. సోజేకు పెద్ద సంఖ్యలో భక్షకులు మరియు ఇతర సహజ శత్రువులు ఉన్నందున , ఇవి దాని వ్యాప్తిని నియంత్రించడానికి తరచుగా సరిపోతుంది. సినిపోయిడా ఎస్పి., స్పిగిగాస్టర్ ఎస్పి., యూరిటోమా మెలనాగ్రోమైజా, సింటోమోపస్ కారినాటస్, మరియు అనూరోప్రియా కైరాలి వంటి పరాన్నభక్షక కందిరీగలు స్ఫెగిగాస్టర్ ఎస్పిలో 3% పెస్ట్‌ను నియంత్రిస్తాయి. ఈ. మెలనాగ్రోమైజాలో 20% వరకు నియంత్రిస్తాయి. సైనీపోయిడియా ఎస్ పి. మరియు ఈ. మెలనాగ్రోమిజాను ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పద్ధతుల్లో ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. లాంబ్డా-సైహలోత్రిన్ 4.9% సిఎస్, థియామెతోక్సామ్ 12.6% జెడ్‌సి మరియు లాంబ్డా-సైహలోత్రిన్ 9.5% జెడ్‌సి లేదా ఇండోక్సాకార్బ్ 15.8% ఇసిలతో పిచికారీ చేయడం ద్వారా నేల చికిత్సగా లేదా మొలకెత్తిన వెంటనే చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం.

దీనికి కారణమేమిటి?

సోయాబీన్ స్టెమ్ మైనర్, మెలనాగ్రోమిజా సోజే యొక్క లార్వా వల్ల ఈ లక్షణాలు ఎక్కువగా వస్తాయి. ఎదిగినవి చిన్నని నల్ల ఈగలుగా వర్గీకరించబడతాయి. ఆడ కాండం తొలుచు పురుగులు మొక్కల కణజాలాల దగ్గర నేలలో గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తరువాత, అది కాండంలోనే ఉంటుంది మరియు వేర్లకు పైకి లేదా క్రిందికి తింటుంది. ఈ కదలిక పైభాగం వాడిపోవడానికి దారితీయవచ్చు. తరువాతి దశలో, పెరిగిన లార్వా కాండంలో ఉండి, రంధ్రం శిధిలాలతో నింపుతుంది మరియు అది సృష్టించిన రంధ్రం దగ్గర ప్యూప ఉంటుంది. కాండం తెరిచినప్పుడు, దాణా సొరంగాలు కనిపిస్తాయి. 2 వ మరియు 3 వ తరం ఎక్కువ నష్టాన్ని సృష్టిస్తుందని గమనించవచ్చు. M. సోజే చాలా అరుదుగా అతిధేయ మొక్కలను చంపుటుంది కాని ఆర్థిక దిగుబడి నష్టాలు కలిగిస్తుంది. ముట్టడి ఎంత ఆలస్యం అయితే, దిగుబడి నష్టం అంత తక్కువగా ఉంటుంది. ఓఫియోమియా ఫేసోలి M. సోజేకు ముందుగానే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని నివేదించబడింది, అందువలన నష్టాన్ని 100% M. సోజేతో అనుసంధానించలేమని సూచిస్తుంది. సోయాబీన్ కాండం బోరర్ విభిన్న పర్యావరణ-వాతావరణ మండలాల్లో కనుగొనబడింది మరియు వివిధ చిక్కుళ్ళు / పప్పు జాతులపై దాడి చేస్తోంది.


నివారణా చర్యలు

  • తెగులును తట్టుకునే రకాలను వాడండి, ఉదాహరణకు, తమిళనాడులో సిఓ-1, లేదా మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలలో ఎన్ ఆర్ సి 7, ఎన్ ఆర్ సి 37.
  • ఎం సోజా యొక్క చిన్న మరియు నలుపు ఎదిగిన నమూనా కోసం మీ పొలాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • తినడం వలన సంభవించిన సొరంగాల కోసం కాండాన్ని తనిఖీ చేయండి.
  • పంట మార్పిడి సిఫార్సు చేయబడింది.
  • పంటకోత తర్వాత, తరువాత సీజన్ కోసం తగినంతగా మట్టిని సిద్ధం చేయండి మరియు ఆలస్యంగా నాటడం మానుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి