Otiorhynchus cribricollis
కీటకం
పెద్ద కర్కులియో ముక్కు పురుగులు ఆకులపై దాడి చేస్తాయి, రంపం పండ్లవంటి వంటి ఆకారంలో ఆకు అంచులను నమలుతాయి. ఇవి లేత చిగుర్లను కూడా తింటాయి. అప్పుడప్పుడు వాటి చుట్టూ బెరడు వలయాలను కూడా తింటాయి. ఇది నీరు మరియు పోషక రవాణాను బలహీనపరుస్తుంది తద్వారా కొమ్మల క్షీణతకు దారితీస్తుంది. కొన్ని పంటలలో, ఇవి వాటి ముక్కుతో పువ్వులలోకి ప్రవేశించి పునరుత్పత్తి నిర్మాణాలను నాశనం చేస్తాయి. వీటి జనాభా పెరిగితే ముఖ్యంగా చిన్న చెట్లకు, గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. గతంలో పచ్చిక బయళ్ళగా ఉన్న ప్రాంతం నుండి వచ్చిన పెద్ద పురుగులు కొత్తగా నాటిన ద్రాక్షతోటలు లేదా పండ్ల తోటలపై కూడా దాడి చేయవచ్చు. సాధారణంగా ద్రాక్ష లేదా పండ్లు దెబ్బతినవు. లార్వా పంటల వేర్లను తింటాయి కాని అవి కలిగించే నష్టం స్వల్పంగా ఉంటుంది.
ఈ రోజు వరకూ ఈ పురుగులకు వ్యతిరేకంగా జీవ నియంత్రణ ఏజెంట్లు కనుగొనబడలేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియజేయండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సింథటిక్ పెరిత్రొయిడ్లతో చికిత్సలు కర్కులియో ముక్కు పురుగులను నియంత్రించడంలో అత్యంత ప్రభావవంతమైనవి. ఆల్ఫా-సైపర్‌మెథ్రిన్ కలిగిన ఉత్పత్తుల యొక్క ఆకు పిచికారీలను పండ్లు లేని లేదా ఇంకా పండ్లు రాని ద్రాక్ష తోటల్లో కూడా ఉపయోగించవచ్చు.
కర్కులియో ముక్కు పురుగుల వలన (ఒటియోరిన్చస్ క్రిబ్రికోల్లిస్) వల్ల నష్టం కలుగుతుంది. పెద్ద పురుగులు రాత్రి వేళల్లో తింటాయి. పగటిపూట, అవి బెరడు క్రింద, కొమ్మల పట్టీలో పండు మరియు ఆకుల మధ్యన లేదా మట్టిలో వున్న బొరియలలో ఆశ్రయం పొందుతాయి. ఇవి చెట్లపై లేదా నేల పైన వదులుగా ఉండే సేంద్రియ పదార్థంలో గుడ్లు పెడతాయి. ఇవి పొదిగిన తరువాత, చిన్న లార్వాలు మట్టిలోకి తవ్వి మొక్కల వేర్లను తింటాయి. శరదృతువులో ఇవి ప్యూపా దశకు చేరతాయి. ప్యూపా దశ యొక్క పొడవు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, అయితే ఇది సాధారణంగా మూడు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. ఒక మోస్తరు ఉష్ణోగ్రత కుర్కులియో ముక్కు పురుగు యొక్క జీవిత చక్రానికి ఉత్తమంగా ఉంటుంది. ఇది ఒక సంవత్సరానికి ఒక తరాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కానీ వేసవి వేడి తర్వాత వాటిని తిరిగి సక్రియం చెందడం వలన రెండవ తరం ఉందనే అభిప్రాయాన్ని కలుగచేస్తుంది. చాలా పెద్ద ముక్కు పురుగులు ఎగరలేవు కాని కొన్ని పురుగులు తక్కువ దూరం వరకూ ఎగరగలవు.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose కర్కులియో ముక్కు పురుగు with Demand Creation, part of Plantix Intelligence.