Mythimna separata
కీటకం
ఆకు కోణాలు లేదా ఆకు అంచుల వెంబడి, కొన్నిసార్లు ఆకు మధ్య ఈనెను ఒక్కదానిని వదిలేసి (ఆకు అస్థిపంజరం)మొత్తం ఆకును ఆహరం తీసుకున్న లక్షణాలు కనబడుతాయి. తెగులు తీవ్రత అధికమైనప్పుడు పెద్ద లార్వా మొత్తం ఆకును, నారు మొత్తం కాండం క్రిందనుండి తొలగిస్తుంది. కంకుల మొదలులో కత్తిరించడం మితిమ్నా సపరేట యొక్క లక్షణాలు. ఇవి కత్తిరించకుండా వదిలేసిన కంకులు ఒక ప్రక్కకు వాలిపోతాయి లేదా పడిపోతాయి. గొంగళి పురుగు లార్వా వీపు పైన చారలతో మొక్క మీద కనిపిస్తుంది. పొలంలో ఒకభాగంలోనే నష్టం పరిమితమై ఉంటుంది. వాటి మధ్యలోకి లార్వా గుంపులుగా వలస రావడం వలన ఒకేసారి పొలాలు ప్రభావితం కావచ్చు.
కొన్ని చురుకైన కొటేసియా రుఫిక్రస్ మరియు యుప్టేరొమలుస్ కందిరీగల వంటి జాతులను పొలంలో విజయవంతంగా వాడారు. గుడ్లు పెట్టే గొంగళి పురుగును అక్కడే వాటి ద్వారా చంపడం. ప్యూపా దశలో వున్న వాటి సంతతిని తగ్గించుటకు పొలంలో నీటి మట్టం ఎక్కువగా ఉండేటట్లు నీరు పెట్టడం చేయవచ్చు. వరదలు కూడా మితిమ్నా సెపరేట యొక్క లార్వాను మొక్క నుండి మొక్కకు చెదరకొడుతుంది. బాతులను వరి పొలాల్లో వదిలితే అవి గొంగళి పురుగు జనాభా నియంత్రణకు సహాయపడుతాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గొంగళి పురుగులు సోకిన పొలం నుండి మరొక పొలంలోనికి వలస పోకుండా నివారించుటకు పొలం సరిహద్దుల చుట్టూ సైపర్ మేత్రిన్ ను చల్లండి. ఒక వేళ ఆర్మీ వార్మ్ తీవ్రత ఎక్కువగా ఉంటే పురుగు మందులు పిచికారీ చేయవలసిన అవసరం ఉంటుంది. సైపర్ మేత్రిన్ @ 1 మిలీ / 1 లీటర్ నీటితో సిఫారస్సు చేయబడింది. సాయంకాలంలో పిచికారీ చేయడం ఉత్తమం.
మొక్కలకు వరిలో కండెను తొలిచే గొంగళి పురుగు, మైథిమ్నా సెపరేట వలన జరుగుతుంది. యుక్తవయస్సులో వున్నపురుగులు ముందు రెక్కలు బూడిద పసుపు పచ్చ రంగుతో ముదురు బూడిద లేదా ఎరుపు-పసుపుపచ్చ రంగు వేసినట్టు మరియు అనేక చిన్న చిన్న నల్లటి మచ్చలతో వుంటాయి. ఆడ పురుగులు ఆకుపచ్చ తెలుపుతో తెల్లని గుడ్లు ఆకుల మీద ఆచ్చాదన లేకుండా నల్లటి లేదా మందపాటి పొరతో కప్పబడి ఆకు పైన గుడ్లు పెడతాయి. ఆకుపచ్చ రంగులో వున్న చిన్న లార్వా వీపుపైన చారలతో ఆకుల పైన కనబడి ఆకులను తినడం మొదలుపెడుతుంది. వర్షాలు లేకపోవడం, ఆ తర్వాత భారీ వర్షాలు పడడం వలన ఈ పెద్ద గొంగళిపురుగులు దీర్ఘ కాలం జీవించడానికి, ఎక్కువ కాలం గ్రుడ్లు పెట్టేటట్టు మరియు వాటిని పొదిగే వ్యవధి పెరగడానికి తోడ్పడుతుంది. నత్రజని ఎరువులు మొక్కను ఏపుగా పెరుగునట్లు చేసి లార్వాకు మరింత ఆహరం అందేటట్లు మరియు అవి జీవించడానికి కారణం అవుతుంది. బార్లి, గోధుమ, మొక్క జొన్న, ఓట్, సొర్గం, చెరకు, వెదురు, పత్తి, చిలగడ దుంప మరియు బ్రాసికా జాతుల వంటి ఇతర జాతి మొక్కలు ఈ గొంగళి పురుగులకు ఇతర ప్రత్యమ్నాయ వాహకాలుగా ఉంటాయి

Put your product in front of farmers the moment they diagnose వరి కంకి కత్తెర గొంగళి పురుగు — right when they need a solution.
Explore
Explore the live agronomic data that powers Plantix disease pages.
Discover