Citripestis eutraphera
కీటకం
బటాణీ లేదా నిమ్మ కాయ పరిమాణంలో పండ్లు వున్నప్పుడు నల్లని రంద్రాలను ఈ పండ్లపై చూడవచ్చు. ఈ రంద్రాల చుట్టూ పాలిపోయిన అతుకులు ఉంటాయి. ఏ రంద్రాల నుండి పురుగులు చప్పరించి వదిలేసిన పండు గుజ్జు మరియు కణద్రవ్యం బైటకి కారుతూ ఉంటుంది. ఈ పురుగులు బాగా అధికంగా రంద్రాలు చేయడం వలన పండ్లు పగిలిపోవచ్చు. ఆ తర్వాత ఈ లార్వా ఇంకొక పండు దగ్గరకు వెళ్ళిపోతుంది. బైటకు వచ్చిన లార్వా పాలిపోయిన గులాబీ రంగులో ఉండి ముదురు గోధుమ రంగు తలను కలిగి ఉంటాయి. తరువాత ఇవి ఎర్రటి గోధుమ రంగులోకి మారతాయి. ఒకొక్క గొంగళి పురుగు, ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం కలుగజేయును. సాధారణముగా ఒక్కొక్క మామిడి కాయనందు 4-6 గొంగళి పురుగులు ఉండును. ఏ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు కొన్ని వందల పురుగులు చెట్లపై చూడవచ్చు. ఈ తెగులు సోకిన పండ్లు ముందుగానే రాలి పడిపోతాయి.
మామిడి పూత వచ్చే దశ నుండి రెండు నెలల వరకు వేపగింజల కాషాయం 5% లేదా వేపనూనె 1% (లీటరు నీటికి 10 మి.లీ.) పిచికారీ చేసి ఈ పురుగులను అదుపు చేయవచ్చు. ఈ పురుగుల సహజ శత్రు కీటకాల జనాభాను సంరక్షించండి( ఉదాహరణకు రిచియం అట్రిసిమమ్ కందిరీగలు). ఇవి లార్వాను తింటాయి. మరియు ట్రైకొగ్రామా చిల్లినోస్ మరియు ట్రైకొగ్రామా చిలోత్రియ ఈ పురుగుల గుడ్లను ఆశిస్తాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థియక్లోప్రిడ్ కలిగిన ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన ఈ మామిడి పండు తొలుచు పురుగు తెగులును నియంత్రించవచ్చు. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ద్రావణాన్ని కూడా వీటిని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.
పెద్ద పురుగులు ముదురు గోధుమ రంగు ముందటి రెక్కలు కలిగి మరియు లేత తెలుపు బూడిద రంగు వెనకటి రెక్కలు కలిగి ఉంటాయి. వీటి రెక్కల విస్తారం 20 ఎం. ఎం. కలిగి ఉంటుంది. పెద్ద పురుగులు దాదాపుగా ఒక వారం రోజుల పాటు జీవించి 125-450 వరకు గుడ్లను పెడతాయి. లార్వా పండ్లలోకి వెళ్లి గుజ్జును తింటాయి. మొత్తం పెరిగిన గొంగళి పురుగు 20 ఎం. ఎం. పొడవు కలిగి ఉంటుంది. పండు పడిపోయిన ప్రాంతం ప్రక్కన ఇవి పట్టు లాంటి గూడులో ప్యుపాగా మారుతుంది. ఇది పెరగటానికి 30 రోజుల సమయం పడుతుంది. పండ్ల రవాణా ద్వారా ఇది ఇతరప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇవి ఒక తోటలోనుండి ఇంకొక తోటలోకి ఎగురుకుంటా కూడా వెళ్లగలవు.

This page is powered by millions of live Plantix diagnoses. Build plant-disease detection like this into your own products with the API Toolkit, part of Plantix Intelligence.