Cicadellidae
కీటకం
ఈ తెగులు లక్షణాలు, మొక్కలకు కరువు సోకినప్పుడు లేదా పోషకాల లేమి కలిగి విన్నప్పుడు వుండే లక్షణాలతో పోలి ఉంటాయి. పచ్చ పురుగులు ఆకుల యొక్క క్రింది భాగాలను తింటాయి. ఇవి తిన్న ఆకుల ప్రాంతాలు రంగు కోల్పోయి ఆకులు కొద్దిగా చుట్టుకు పోతాయి. ఈ లక్షణాలను హాప్పర్ బర్న్ అని అంటారు. తరువాత ఈ పాలిపోయిన ప్రాంతాలు ఆకు ఇతర భాగాలకు కూడా విస్తరిస్తాయి. ఆకులు చుట్టుకుపోయి తరువాత రాలిపోతాయి. దీనివలన మొక్కల ఎదుగుదల తగ్గిపోయి పండ్ల దిగుబడి తగిపోతుంది.
మేటార్హిజియం అనిసోప్లియ, బెయువేరియా బస్సియానా, పెసిలోమైసెస్ ఫుమోసోరోసిస్ మరియు వెర్టిసిల్లీయం లేకన్నీ లాంటి పరాన్నజీవి శిలీంధ్రాల జాతులు వున్నజీవ క్రిమిసంహారకాలను ఈ తెగులు తీవ్రంగా వున్నప్పుడు వీటిని నియంత్రించేందుకు వాడండి. పరాన్న జీవి కీటకముల రకాలయిన ఆనార్గస్ ఆటోమస్ లాంటి వాటిని జీవ సంబంధ నియంత్రణకొరకు వాడండి. మొక్కలకు ప్రయోజనం కలిగించే కీటకాలైన లేడీ బగ్స్ మరియు లేస్ వింగ్, ఈ పచ్చ పురుగుల గుడ్డు మరియు లార్వా లను తింటాయి. పురుగుల మందు సబ్బులు కూడా పనిచేస్తాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఫిప్రోనిల్ లేదా ఫ్లోనికామిడ్ పురుగుమందులతో శుద్ధి చేసిన విత్తనాలు ఈ కీటకాల జనాభాను నియంత్రించడంలో అనుకూల ఫలితాలను ఇస్తాయి. వీటిని మట్టిలో వాడడం వలన అక్కడ నివసించే కీటకాలను కూడా నాశనం చేస్తాయి. పురుగులు వేర్లకు నష్టం కలగకుండా రక్షిస్తాయి. మొక్కలు వేసిన 30, 40, మరియు 60 రోజులకు ఒకసారి వీటిని ముందు జాగ్రత్త చర్యగా వాడవచ్చు.
ఈ నష్టం ఆమ్రస్క పచ్చ పురుగు వలన కలుగుతాయి. సాధారణంగా ఇవి గ్రీన్ హౌస్ లో పండించే పంటలకు సోకుతాయి. వీటి సంఖ్యా తక్కువగా వున్నా ఇవి పంటకు చాల అధికంగా నష్టం కలిగించగలవు. పెద్ద పచ్చ పురుగులు పచ్చ రంగులో ఉండి మూడు నుండి నాలుగు మిల్లీమీటర్ల పొడవు ఉండి పచ్చని పంటలపై జీవిస్తాయి. ఆడ పురుగులు సాధారణంగా ఆకుల క్రింది భాగాలలో ఆకుల ఈనెల పైన గుడ్లు పెడతాయి. వీటి లార్వా ఒకటినుండి నాలుగు వారాలలో పొడగబడతాయి. చిన్న పురుగులు మరియు పెద్ద పురుగులు మొక్కల ద్రవ్యాన్ని పేల్చి మొక్కలకు నష్టం కలగచేస్తాయి. ఇవి మొక్కల కణద్రవ్యాన్ని పీలుస్తునప్పుడు ఇవి విషపూరిత పదార్ధాలను మొక్కలలోకి వదులుతాయి. దీనివలన మొక్కల కణాలలో అవరోధం ఏర్పడుతుంది. దీనివల్లనే నీరు మరియు పోషకాల లోపం లక్షణాలు మొక్కలలో కనపడతాయి.