మొక్కజొన్న

యూరోపియన్ మొక్కజొన్న తొలుచు పురుగు

Ostrinia nubilalis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ లార్వాలు మొక్కల అన్ని పైభాగాలపై దాడి చేస్తాయి.
  • ఇవి గుచ్చాలు, మధ్య ఈనెలు, కొమ్మలు, పట్టు మరియు పొత్తులపై దాడి చేసి తింటాయి.
  • ఇది ఎదుగుదల, ఆకులు, మరియు దిగుబడి తగ్గిపోవడానికి దారితీస్తుంది.
  • రెమ్మలకు రంధ్రాలు చేయడం వలన వాటిని పట్టివుంచే సామర్ధ్యం తగ్గి రాలిపోతాయి.
  • కంకులు నాశనం అయిన రాలి పోతాయి.
  • రంధ్రాలలో ఇతర ఫంగస్ చేరి నివాసం ఏర్పరుచుకుని ఆ భాగాలు కుళ్లిపోయేటట్టు చేస్తాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

లార్వాలు మొక్కల అన్ని పై భాగాల పై దాడి చేస్తాయి. ఇవి గుచ్చాలపై లేదా ఈనెలపై ముందుగా దాడి చేసి మొక్కల మొదళ్ళలో, కాడలలో రంధ్రాలు చేస్తాయి. తరువాత పట్టు కుచ్చు పైనా పొత్తులపైనా దాడి చేస్తాయి. నీటిని, పోషకాలను మొక్కలకు సరప్గారా చేసే మొక్కల అంతర్గత కణజాలాన్నిఇవి నాశనం చేస్తాయి. దీని వలన మొక్కల ఎదుగుదల తగ్గడం, ఆకులు తక్కువ అవ్వడం మరియు ఉత్పాదకత తగ్గిపోవడం జరుగుతుంది. కాండం మరియు కాడలలో ఇవి రంధ్రాలు చేస్తాయి. దీనివలన ఇవి బలం కోల్పోయి మొక్కల బరువును భరించలేక మొక్కలు పడిపోతాయి. తడిగా వున్న మలపదార్ధంతో వున్న గుండ్రటి రంద్రాలు పొత్తులలో కనపడతాయి. గింజలు పాడై రాలిపోతాయి. ఈ రంద్రాలలో ఇతర క్రిములు చేరడం వలన పొత్తులు కుళ్లిపోతాయి. ఈ ఫంగస్ విడుదల చేసే విష పదార్ధాల వలన పంట నాణ్యత పడిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ పురుగుల్ని నియంత్రించడానికి ప్రెడేటర్స్, పారాసైటోయిడ్స్ మరియు జీవ సంబంధిత క్రిమినాశినీలతో నియంత్రించవచ్చు. ఫ్లవర్ బగ్స్, ( ఓరియస్ ఇన్సిడియస్) గ్రీన్ లేస్ వింగ్స్, ఇంకా అనేక లేడీ బర్డ్స్ వీటి సహజ శత్రువులు. పక్షులు కూడా 20 నుండి 30% వరకు వీటి లార్వాలను నాశనం చేస్తాయి. టేక్నిడ్ ఫ్లై లీడెల్ల థామ్ప్పోనీ ఇంకా ఎరీబోర్ఉస్ తెరెబ్రాన్స్, సింప్ఐసిస్ విరిదుల మరియు మాక్రోసెంట్ట్రిస్ గ్రాండి లాంటి కీటకాలు ఈ లార్వాలకు పారాసైటోయిడ్స్ లాగ ఉంటాయి. స్పైనోసాద్ లేదా బాసిల్లస్ తురింగియాన్సిస్ కూడా వీటి పైన పనిచేస్తాయి.

రసాయన నియంత్రణ

అనేక రకాల కీటక నాశినులను వాడి వీటి జనాభాను నియంత్రించవచ్చు. ఈ మందులను సమయానుసారం వాడాలి. సైఫ్లూత్రిన్, ఎస్ఫెంవలేరాట్ లను ఎదుగుతున్న పొత్తులపై పిచికారీ చేయవచ్చు. ఈ తెగులును నివారించడానికి కృత్రిమ పేర్మత్రిన్ ను కూడా ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లార్వాలు పంట అవశేషాల్లో జీవిస్తూ వసంత కాలంలో బయటకు వస్తాయి. ఎదిగిన పురుగులు రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటాయి. మగ పురుగులు గోధుమరంగు ఛాయలతో సన్నటి శరీరం కలిగి మరియు గోధుమ రంగు రెక్కలు పసుపు రంగు నమూనాలు కలిగి ఉంటాయి. ఆడ పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో ఉండి రెక్కలపై అనేక ముదురు అంచులు కలిగి ఉంటాయి. ఇవి ఆకుల కింది భాగాల్లో తెల్లటి గుడ్లు పెడతాయి. ఇవి కలుపు మొక్కలను తింటూ జీవిస్తాయి. తక్కువ ఆర్ద్రత, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు మరియు అధిక వర్షపాతం ఇవి గుడ్లు పెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.


నివారణా చర్యలు

  • వ్యాధిని తట్టుకునే మొక్కల రకాలు ఉపయోగించండి.
  • వీటి అధిక జనాభా భారిన పంట పడకుండా ఉండడానికి మొక్కలు త్వరగా నాటాలి.
  • పొలాన్ని క్రమంతప్పకుండా పరీక్షించాలి మరియు వలలు వాడి వీటిని నియంత్రించాలి.
  • కలుపు మొక్కలు తొలగించాలి.
  • చలికాలంలో నేలలో గడిపే లార్వాలు మరియు మొక్కల వ్యర్థాలు బయట పడుటకు పొలాన్ని లోతుగా దున్నండి.
  • ఈ తెగులుకు ఆతిధ్యం ఇవ్వని ఇతర జాతి పంటతో పంట మార్పిడి చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి