Eublemma olivacea
కీటకం
లార్వాలు మాత్రమే ఆకులకు నష్టమును కలిగిస్తాయి. ఈ లార్వాలు తినడం వలన పొడవుగా చుట్టబడిన ఆకులు, అందులో లార్వాలు కనిపిస్తాయి. ఇవి అక్కడనుండి ఆకుల అంతర్గత ఆకుపచ్చని కణజాలాన్ని నమిలి తింటాయి. చాలా సమయాలలో మొక్కల పైభాగములలో నష్టం కనబడుతుంది. చుట్టుకొని వున్న ఆకులు గోధుమ రంగులో వుండి వాడిపోయి మరియు ఎండిపోయి వుంటాయి. నష్టం అధికంగా వున్నప్పుడు ఈ గోధుమరంగు మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాపించి తరువాత ఆకులు రాలిపోతాయి. కీటకాల జనాభాను నియంత్రించకపోతే గుర్తించతగిన స్థాయిలో పంట దిగుబడి నష్టానికి దారితీస్తుంది. కాని ఈ చీడ మొక్కల పెరుగుదలకు మరియు దిగుబడికి ఒక పెద్ద ప్రమాదకారి కాదు.
కోటేశియా spp. వంటి పరాన్న కందరీగ జాతికి చెందిన కీటకాలతో జీవనియంత్రణ చేసి ఈ పురుగుల జనాభాను నియంత్రించవచ్చు. మాంటిస్ లేదా ప్రయోజనకారి అయిన లేడీ బర్డ్ బీటిల్ రకాలయిన కీటకాలు కూడా ఈ పురుగులను నియంత్రించడంలో సహాయపడవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు వాడకం అవసరమైతే కార్బరిల్ లేదా మాలథీయాన్ కలిగిన ఉత్పత్తులుతో వున్న ఆకులపై పిచికారీను వాడితే ఎగ్ ప్లాంట్ లీఫ్ రోలర్ యొక్క జనాభాను ప్రభావవంతంగా తగ్గించవచ్చు.
ఎదిగిన కీటకాలు మధ్య సైజులో వుండి, లేత గోధుమ నుండి ఆలివ్ ఆకుపచ్చ రంగు చీడలు, వీటి ముందు రెక్కల పై భాగమున ఒక పెద్ద ముదురురంగు మచ్చను కలిగి వుంటాయి. వెనుక రెక్కలు పారదర్శకమైన తెల్లటి రంగులో వుంటాయి. ఆడ కీటకాలు గుడ్లను 8-22 గుంపులుగా ఆకుల పైభాగాన పెడతాయి. ఇవి సాధారణంగా లేత ఆకులపైన గుడ్లు పెడతాయి. 3-5 రోజుల తరువాత ఈ లార్వాలు పొదుగుతాయి. ఇవి ఊదా-గోధుమ రంగులో ఉండి పసుపు పచ్చ లేదా క్రీం రంగు బోలు గడ్డలతో వుండి, వెనుక భాగమున పొడవైన వెంట్రుకలు కలిగి వుంటాయి. లార్వాల పెరుగుదల కాలము 4 వారములు. ఆ తరువాత అవి చుట్టబడిన ఆకులలో చేరుతాయి. తరువాత ఒక అదనపు 7-10 రోజుల కాలములో మరొక తరం ఎదిగిన క్రిములు పొడగబడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి సంవత్సరమునకు 3-4 తరాల వరకు ఇవి ఉండవచ్చు.

This page is powered by millions of live Plantix diagnoses. See where ఎగ్ ప్లాంట్ లీఫ్ రోలర్ is spreading — district by district — with Crop Insights, part of Plantix Intelligence.