నిమ్మజాతి

సిట్రస్ ట్రిస్టెజా వైరస్

CTV

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • కాండం మరియు కొమ్మలపైన గుంతలు ఏర్పడతాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారి చెట్టు బలహీనపడుతుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఈ CTV తెగులు లక్షణాలు రకరకాలుగా ఉండి ఆవాసాలు, సంబంధిత వైరస్ యొక్క తీవ్రత మరియు పర్యావరణ పరిస్థితుల వంటి అనేక కారణాలపైన ఆధారపడి వుంటుంది. దీని మూడు ముఖ్యమైన లక్షణాలు: చెట్టు క్షీణించడం (ట్రిస్టెజా), కాండం మరియు కొమ్మలపైన గుంతలు ఏర్పడడం మరియు ఆకులు పసుపు రంగులోకి మారడం. ఆకులు పాలిపోయి రంగు కోల్పోవడం మరియు సాధారణంగా చెట్టు డై బ్యాక్ చెందడం జరుగుతుంది. లక్షణాలు గుర్తించిన తర్వాత కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాలు ఇది మెల్లగా జరగవచ్చు. ఈ క్షీణత త్వరితంగా కూడా జరగవచ్చు. ఫలితంగా లక్షణాలను గుర్తించిన కొన్ని రోజులలోనే చెట్టు చనిపోవచ్చు. ఈ తెగులు సంక్రమించే అవకాశం వున్న మొక్కల కాండం మరియు కొమ్మలపైన అనేక గుంతలు ఏర్పడతాయి. కొన్ని రకాలలో రిండ్ ఆయిల్ మచ్చలు లేదా జిగురుతో కూడిన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. .

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నిమ్మ జాతి తోటల్లో కొన్ని రకాల పేను బంకను సహజంగా నియంత్రించే అవకాశం వున్న పరాన్నజీవి కందిరీగలు లేదా ఉల్లికోడులను వుపయోగించి ఈ వైరస్ ను నియంత్రించడానికి పొలాల్లో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. వాణిజ్య పరంగా లభ్యమయ్యే(నేచురల్ పైరేత్రుమ్, ఫ్యాటీ యాసిడ్లు), కీటక నాశక సబ్బులు లేదా ఉద్యానవన నూనెలు( మొక్కలు లేదా చేప నూనె) వీటి జనాభాను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. నీరు మరియు కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకులపైన పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ పేను బంకను తుడిచిపెట్టవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. రసాయనాలను వుపయోగించి నేరుగా వైరస్ ను నియంత్రించడం వీలుపడదు. పేను బంకను రసాయనిక పద్దతిలో నియంత్రించడానికి డేటా బేస్ ను చూడండి.

దీనికి కారణమేమిటి?

ట్రిస్టెజా వైరస్ ఈ లక్షణాలు ఏర్పడడానికి కారణం. నిమ్మ జాతి తోటలలో ఇది చాలా తీవ్రమైన తెగులు. టోక్సోప్తేరా సిట్రిసీడ అని పిలవబడే నల్ల నిమ్మ పేను బంక పురుగుల వలన సిట్రస్ వైరస్ సంక్రమిస్తుంది. ఈ పెనుబంక పురుగు తెగులు సోకిన మొక్కలపై 5-60 నిముషాలు ఆహరం తింటే ఈ వైరస్ దీనికి సంక్రమిస్తుంది. కానీ 24 గంటల తర్వాత ఇది ఈ వైరస్ ను సంక్రమింపచేసే సామర్ధ్యాన్ని కోల్పోతుంది. ఇదే కుటుంబానికి చెందిన ఇతర పురుగులు కూడా ఈ వైరస్ విస్తరించడంతో దోహదపడతాయి.(ఉదాహరణకు ప్రత్తి పేను బంక, ఆఫిస్ గోసుపి). కలుషితమైన మొక్కలతో అంటు కట్టడం వలన కూడా ఈ వైరస్ ఇతర తోటలకు విస్తరించడానికి దోహద పడుతుంది. ఈ తెగులు తీవ్రత వైరస్ యొక్క తీవ్రత పైన ఆధారపడి వుంటుంది. కొన్ని రకాలు గుర్తించదగ్గ లక్షణాలను కనపరచవు. కొన్ని రకాలు చెట్లలో చాలా తీవ్రమైన క్షీణతను కలిగించి చెట్టు చనిపోవడానికి లేదా కాండం మరియు కొమ్మలపైన బాగా లోతైన గుంతలు ఏర్పడేటట్టు చేయడానికి కారణమవుతాయి. వీటి సంక్రమణకు మరియు ఇవి వృద్ధిచెందడానికి 20-25°C.అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఈ తెగులు విస్తరణను నివారించడానికి మీ ప్రాంతంలో వున్న క్వారంటైన్ నిబంధనలను పరిశీలించండి.
  • ధ్రువీకరించిన డీలర్లవద్ద నుండి మొక్కల మెటీరియల్ ను ఉపయోగించండి.
  • తెగులు నిరోధక రకాలను వినియోగించండి.( కొన్ని హైబ్రీడ్ జాతులు ఈ వైరస్ ను తట్టుకోగలవు) నర్సరీలను మరియు గ్రీన్ హౌస్లను ఈ తెగులు యొక్క కీటక వాహకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • సందేహాస్పదంగా వున్న మొక్కల మెటీరియల్ ను ఇతర తోటలకు రవాణా చేయకండి.
  • నిమ్మ తోటలను ఈ తెగులు లక్షణాలకు క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • ఈ తెగులును వ్యాపింపచేసే కీటకాల గురించి మరియు ఈ తెగులు లక్షణాలను తెలుసుకోండి తెగులు సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయండి.
  • చెట్లకు తోడుగా ముందుగానే మొక్కలను నాటి పేను బంకను తోటలకు దూరంగా ఉంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి