APMV
వైరస్
ప్రారంభంలో, ఆకులు ఒకే రెమ్మలో వున్న కొత్త ఆకులపై ప్రధాన ఈనెల వెంబడి ప్రకాశవంతమైన పసుపు మచ్చలు లేదా పట్టీలను ప్రదర్శించడం ప్రారంభిస్తాయి. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు, ఈ లక్షణాలు అన్ని రెమ్మల ఆకులపై కనిపిస్తాయి. ఈ తెగులు బారిన పడిన ఆకులు అకాలంగా పడిపోవచ్చు. చెట్ల ఎదుగుదల తగ్గుతుంది.
ఈ వైరస్ నయం కాదు. ఇతర చెట్లకు వ్యాపించకుండా ఉండటానికి తెగులు సోకిన చెట్టును తొలగించాలి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వైరల్ వ్యాధికి రసాయన చికిత్స లేదు.
ఆపిల్ మొజాయిక్ వైరస్ వల్ల లక్షణాలు సంభవిస్తాయి. ఈ వైరస్ కు చెక్క మరియు గుల్మకాండ మొక్కలతో సహా విస్తృత అతిధి మొక్కల పరిధి ఉంటుంది. వైరస్ కు సహజ వాహకం లేదు. అంటు కట్టడం కోసం స్లిప్‌లుగా ఉపయోగించినప్పుడు తెగులు సోకిన కొమ్మలు వైరస్‌ను వ్యాప్తిచేస్తాయి. వేర్ల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఒక మోస్తరు వసంతకాలపు ఉష్ణోగ్రతలు వున్న సంవత్సరాలలో ఈ వైరస్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

This page is powered by millions of live Plantix diagnoses. See where ఆపిల్ మొజాయిక్ వైరస్ is spreading — district by district — with Crop Insights, part of Plantix Intelligence.