Phytophthora colocasiae
శీలీంధ్రం
మొదటి సంకేతాలు నీటితో తడిసిన ఆకుల అంచులు మరియు వాటి చుట్టూ లేత పసుపు రంగు వలయాలతో కూడిన చిన్న గోధుమ రంగు మచ్చలు. ఆకులపై నీరు నిలిచిన చోట ఈ మచ్చలు కనిపిస్తాయి. ఇవి మొదట చిన్నవిగా ప్రారంభమై, చాలా వేగంగా పెరిగి, ఆకులో సగానికి పైగా కప్పేసే పెద్ద గుండ్రని గోధుమ రంగు మచ్చలుగా మారతాయి. వ్యాధి సోకిన మచ్చల నుండి ప్రకాశవంతమైన నారింజ లేదా ఎరుపు- గోధుమ రంగు ద్రవం కారడం ఈ వ్యాధి యొక్క ఒక ప్రత్యేక లక్షణం. ఈ ద్రవం ఆకుల అడుగు భాగంలో క్లియర్ గా కనిపిస్తుంది. పగటిపూట, ఈ ద్రవం ఎండిపోయి గట్టిపడి ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. మచ్చలు పెద్దవి అవుతున్న కొద్దీ, అవి మొత్తం ఆకులను నాశనం చేస్తాయి. ఆకులపై తెల్లటి పొడి లాంటి వలయాలతో చుట్టుముట్టబడిన చిన్న రంధ్రాలు కూడా కనిపించవచ్చు. ఆకు కాడలపై (పెటియోల్స్) ఎరుపు-గోధుమ రంగుతో కూడిన ముదురు మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి భూమిలోని దుంపలకు చేరినప్పుడు, అవి గోధుమ రంగులోకి మారి గట్టిపడతాయి, కానీ పంటకోత తర్వాత త్వరగా కుళ్ళిపోతాయి.
ట్రైకోడెర్మా జాతులు అత్యంత ఆశాజనకమైన జీవ నియంత్రణ కారకాలుగా నిరూపించబడ్డాయి. నాటడానికి ముందు దుంపలను ట్రైకోడెర్మా ద్రావణంలో ముంచండి. మొక్కల సారాన్ని 10-20 మిగ్రా/ఎంఎల్ గాఢతలో తయారు చేయండి. వ్యాధి కనిపించక ముందే నివారణ పిచికారీలుగా వాడండి. నాటడానికి ముందు విత్తన దుంపలను జీవ నియంత్రణ కారకాలతో శుద్ధి చేయండి. మెరుగైన ఫలితాల కోసం వివిధ బయోలాజికల్ ఏజెంట్స్ ని కలిపి వాడండి.
చేమ పంటలో ఆకు ఎండు తెగులుకు రసాయన నియంత్రణ తరచుగా ఆచరణ సాధ్యం కాదు. తరచుగా కురిసే వర్షాలు శిలీంధ్రనాశినులను త్వరగా కడిగివేస్తాయి, దీనివల్ల పదేపదే పిచికారీ చేయడం ఖరీదైనదిగా మరియు తక్కువ ప్రభావవంతంగా మారుతుంది. రసాయన పిచికారీల కంటే వ్యాధి నోరీదకత కలిగిన విత్తన రకాలు మరింత నమ్మదగినవి. వ్యాధి లక్షణాలు కనిపించకముందే ప్రాంతీయంగా ఆమోదించబడిన శిలీంధ్రనాశినులను నివారణగా వాడండి. వ్యాధి వృద్ధికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పిచికారీ ప్రారంభించండి. వీలైతే ప్రతి భారీ వర్షం తర్వాత మళ్లీ పిచికారీ చేయండి. పిచికారీ చేసినప్పుడు వ్యాధి ప్రారంభమయ్యే ఆకుల అడుగు భాగాలను కవర్ చేయడంపై దృష్టి పెట్టండి. మంచి కవరేజ్ కోసం అధిక పరిమాణంలో పిచికారీ చేయండి. పెట్టిన ఖర్చు యొక్క సమర్థతను పరిగణలోకి తీసుకోండి - చిన్న పరిమాణపు పొలాలకు ఇది ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.
చేమపంటలో ఆకు ఎండు తెగులు ఫైటోఫ్తోరా కొలొకేసియే అనే నీటి బూజు వలన వస్తుంది, ఇది తడి వాతావరణ పరిస్థితులలో వృద్ధి చెందుతుంది. ఈ వ్యాధికారకం వర్షపు తుంపరలు మరియు గాలి ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తడి వాతావరణ పరిస్థితులలో సూక్ష్మ పరిమాణంలో వుండే ఈ బీజాంశాలు ఆకులు మరియు కాండాలపై పడి త్వరగా మొలకెత్తుతాయి. నీటితో నిండిన చేమపంట పొలాలలో, వరి నీటి ద్వారా బీజాంశాలు ఆరోగ్యంగా వున్న మొక్కలకు చేరడం వల్ల ఈ వ్యాధి మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వర్షపు మరియు వెచ్చని వాతావరాణాన్ని బాగా ఇష్టపడుతుంది. గాలిలో తేమ 90% కంటే ఎక్కువగా ఉండి, ఉష్ణోగ్రతలు 30°C వరకు చేరినప్పుడు ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికారకం మొక్క కణజాలంలో మరియు మట్టిలో కూడా జీవించగలదు, అందువల్ల ఇది ఒకసారి పొలంలోకి ప్రవేశించిన తర్వాత దీనిని వదిలించుకోవడం చాలా కష్టం. ఇది ఆఫ్ సీజన్లో తెగులు సోకిన దుంపలలో కూడా జీవించగలదు మరియు మీరు వాటిని నాటినప్పుడు కొత్తగా ఇన్ఫెక్షన్ ని ప్రారంభింపచేస్తుంది. ఇది చేమతో పాటు దాషీన్ మరియు వ్యాధికి మూలాలుగా పనిచేయగల కొన్ని ఇతర సంబంధిత మొక్కలపై కూడా దాడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చేమపంటలో ఎండు తెగులు అత్యంత వినాశకరమైన వ్యాధి.

This page is powered by millions of live Plantix diagnoses. See where చేమలో ఆకు ఎండు తెగులు is spreading — district by district — with Crop Insights, part of Plantix Intelligence.