ఆపిల్

ఆపిల్‌లో మార్సోనినా బ్లాచ్

Diplocarpon mali

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులకు సోకడమే కాక అరుదుగా పండ్లుకు సోకుతుంది.
  • ఆకులపై చిన్నపాటి మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ఆపిల్

లక్షణాలు

వేసవి చివరిలో ముదురు ఆకుల పైభాగంలో ముదురు మచ్చలు(5-10 మిమీ) కనిపించడం ప్రారంభిస్తాయి. వసంత ఋతువులో మరియు వేసవి ప్రారంభంలో వర్షాల తర్వాత లక్షణాలు స్థిరంగా కనిపిస్తాయి. ముదురు ఆపిల్ మొక్కల ఆకులు లేత వాటి కంటే ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతాయి. సాధారణంగా ఈ మచ్చలు బూడిద, గోధుమ రంగుతో, కొనల వద్ద కొద్దిపాటి ఊదా రంగుతో ఉంటాయి. వ్యాధి లక్షణాలు ఆకు యొక్క పైభాగంలో ముదురు ఆకుపచ్చ వృత్తాకార అతుకుల రూపంలో కనిపిస్తాయి, ఇవి కొంత కాలానికి 5-10 మిమీ పరిమాణంలో ముదురు గోధుమ రంగు ఆకు మచ్చలుగా మారుతాయి. పరిపక్వతకు వచ్చినప్పుడు ఇది ఆకుల దిగువ భాగంపై కూడా వృద్ధి చెందుతుంది. వాణిజ్య సాగు రకాలలో, వివిధ పరిమాణాలలో (3-5 మిమీ వ్యాసం) వృత్తాకార ముదురు గోధుమ రంగు మచ్చలను ఏర్పరచడం ద్వారా పండుపై కూడా ఈ ఫంగస్ దాడి చేస్తుంది. ఉపరితలంపై తరచూ చిన్న అలైంగిక ఫలాలు కనిపిస్తాయి. అధిక సంఖ్యలో గాయాలు ఏర్పడినప్పుడు అవి ఒకదానితో మరొకటి కలిసిపోయి, చుట్టు పక్కల భాగాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇలాంటి తీవ్రమైన ముట్టడి ఆకులు రాలుటకు దారితీస్తుంది. తరచుగా కానప్పటికీ ఈ ఫంగస్ పండ్లకు కూడా సంక్రమించగలదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

యాసిడ్-క్లే మైకో-సిన్, ఫంగూరాన్ (కాఫర్ హైడ్రాక్సైడ్), క్యూరాషియో ( లైమ్ సల్ఫర్) లేదా సల్ఫర్ ప్రతి ఉత్పత్తిని సంవత్సరానికి 10-12 సార్లు పిచికారీ చేయండి. అదేవిధంగా, ఓవర్ వింటర్ ఆకులపై యూరియాను చల్లడం వల్ల ప్రాధమిక ఇన్నోకులం స్థాయిని తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణా చర్యలతో కూడిన సమగ్ర సస్య రక్షణ విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. తెగులు సోకిన తర్వాత నివారణకు ఉపక్రమించడానికంటే సోకకుండా ముందు శిలీంద్ర నాశినులను వాడడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మాంకోజెబ్, డోడిన్ మరియు ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ వంటి క్రియాశీల పదార్ధాలు కలిగిన శిలీంద్ర నాశినులను వాడండి. ఇవి తెగులు సంక్రమణను గణనీయంగా తగ్గిస్తాయి. పంట కోసిన తర్వాత కాపర్-ఆక్సిక్లోరైడ్ ను వాడండి. సమర్థవంతమైన నియంత్రణ మరియు తెగుళ్ల నిరోధకతను పెంచుకునే అవకాశాలను తగ్గించడానికి డోడిన్ + హెక్సాకొనజోల్, జినెబ్ + హెక్సాకొనజోల్, మాంకోజెబ్ + పైరాక్లోస్ట్రోబిన్ కలయికలో శిలీంద్ర నాశినులను వాడండి. మాంకోజెబ్ (0.3%), కాపర్ ఆక్సిక్లోరైడ్ (0.3%), జినెబ్ (0.3%), మరియు హెచ్ ఎం 34.25 ఎస్ ఎల్ (0.25%), డోడిన్ (0.075%) మరియు డితియానాన్ (0.05%) రక్షణాత్మకమైన స్ప్రేలు ఈ రంగంలో పూర్తి వ్యాధి నియంత్రణను అందించాయి.

దీనికి కారణమేమిటి?

డిప్లోకార్పాన్ మాలి యొక్క శిలీంద్రం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. స్పష్టంగా కనిపించే లక్షణాలను ప్రదర్శించడానికి శిలీంద్రానికి దాదాపు 40 రోజులు పడుతుంది. సాధారణంగా అస్కోస్పోర్స్ ద్వారా ప్రారంభమవుతాయి, ఇవి ఓవర్‌వింటర్డ్ ఆకులపై ఉత్పత్తి చేయబడతాయి. సాధారణంగా బీజాంశం విడుదలకు వర్షం అవసరం. 23.5°C మరియు 20 మిమీ వర్షపాతం దీనికి అనుకూలంగా ఉంటుంది. ఇది వృద్ధి చెందడానికి 25°C రోజువారీ ఉష్ణోగ్రత మరియు 20 మిమీ వర్షపాతం అవసరం. ఆపిల్ పండు యొక్క వృద్ధి దశల్లో అధిక వర్షపాతం మరియు 20-22°C ల మితమైన ఉష్ణోగ్రత ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఆపిల్ సాగులో ఏ రకమూ మార్సోనినా బ్లాచ్‌ వ్యాధికి నిరోధకతను కలిగి లేదు.
  • అయినప్పటికీ, గ్రానీ స్మిత్ మరియు గిబ్సన్ గోల్డెన్ ఒక మోస్తరు నిరోధకతను కలిగి ఉంటాయి.
  • రాయల్ డెలీషియస్, గోల్డెన్ డెలీషియస్ మరియు స్కార్లెట్ స్పర్ రకాలకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది కనుక వీటిని సాగు చేయవద్దు.
  • శరదృతువులో రాలిన ఆకులను నాశనం చేయడం ద్వారా డిప్లోకార్పాన్ మాలి యొక్క బీజాంశాలను నాశనం చేయండి.
  • రాలిన ఆకులను తగలబెట్టడం మరియు పాతిపెట్టడం ద్వారా తోటలో సరైన పారిశుద్ధ్యాన్ని పాటించండి.
  • తోటను శుభ్రంగా ఉంచడం మరియు కత్తిరింపు ద్వారా వ్యాధి సంభవాన్ని నియంత్రించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి