మొక్కజొన్న

మొక్కజొన్నలో లేట్ విల్ట్ తెగులు

Magnaporthiopsis maydis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పుష్పించే దశలో లేదా పుష్పించే దశ తర్వాత ఈ తెగులు మొక్కజొన్నకు సంక్రమిస్తుంది.
  • మొక్క క్రిందనుండి పైకి ఎండిపోయి వాలిపోతుంది.
  • ముందుగా ఆకులు నిస్తేజమైన పచ్చరంగులోకి మారి ఆ తర్వాత వాలిపోతాయి.
  • క్రిందిభాగంలోని కణుపులు రంగుమారిపోయి ఎర్రని గోధుమరంగులోకి మారతాయి.
  • ఇవి మెత్తగా అయ్యి మెల్లగా గుల్లగా మారి ఎండిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

పుష్పించే దశలో లేదా పుష్పించే దశ తర్వాత ఈ తెగులు మొక్కలజొన్నకు సంక్రమిస్తుంది. దీని తీవ్రత మొక్కజొన్న విత్తన రకం మరియు వాతావరణం పైనా ఆధారపడి వుంటుంది. మొక్క క్రింది భాగంలో వున్న ఆకులు ఎండిపోవడం మొదలుపెట్టి నిస్తేజమైన పచ్చ రంగులోకి మారతాయి. అవి ఎండిపోయి లోపలకు ముడుచుకుపోతాయి అదే సమయంలో ఈ తెగులు మొక్క పైభాగానికి ఎగబాకడం మొదలు పెడుతుంది. తెగులు సోకిన మొక్కలు సరిగా ఎదగవు. గింజల ఎదుగుదల తగ్గిపోతుంది . కొన్ని సందర్భాలలో పసుపు నుండి ఊదారంగు లేదా ముదురు గోధుమ రంగు చారలు కాండం వద్ద కనిపిస్తాయి. నాళాల కణజాలంలో కొంత భాగం మరియు కణుపులు ఎర్రని గోధుమ రంగులోకి మారిపోతాయి. కాండాన్ని అడ్డంగా కోసినప్పుడు ఇది కనిపిస్తుంది. తరువాత అవి ఎండిపోయి ముడుచుకుపోయి గుల్లబారిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

విత్తనాలను శుద్ధి చేయడానికి చాలా రకాల సూక్ష్మ జీవులతో కూడిన పరిష్కారాలను ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నారు: త్రిచూరుస్ స్పిరలిస్, స్ట్రెప్టోమైసిన్, గ్రామినోఫేసియన్స్, S. గోబిసోనీ, S. లైడికస్, S. నాగలాటర్, S. రోచెయి, S. అన్నులటూస్ మరియు కాండిడా మాల్టోస ఈస్ట్, C. గ్లాబ్రాట్ట, C. స్లూఫీ, రోడోటోరుల రుబ్రా మరియు ట్రైకోస్పోరోన్ కూటానియం.బ్యాక్తీరియమ్ విత్తనాలను నాటే ముందు మట్టిలో బాసిల్లస్ సుబ్టిలిస్ ను వేయడం వలన కూడా ఈ తెగులును నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ నివారణా చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ ఫంగస్ మట్టి మరియు విత్తనాల ద్వారా సంక్రమిస్తుంది కనుక విధానాలను ధృవీకృత డీలర్ల వద్ద నుండి మాత్రమే కొనండి. శిలీంద్ర నాశినులు కలిపిన నీటితో విత్తన చికిత్సను చేయడం ద్వారా ఈ ఫంగస్ ను నివారించవచ్చు. అజోక్సిస్ట్రోబిన్, బెనోమిల్ లేదా కప్తాన్ మరియు వీటి కాంబినేషన్లు ఈ ఫంగస్ పైన బాగా ప్రభావం చూపిస్తాయి.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు మాగ్నాపోర్తియాప్సిస్ మేడీస్ అనే ఫంగస్ వలన కలుగుతాయి. ఈ ఫంగస్ మట్టిలోను మరియు విత్తనాల పైనా జీవిస్తుంది. మట్టిలో లేదా విత్తనాలపైన వుండే ఫంగస్ మొలకల వేర్లను వాటికి వున్న గాయాల ద్వారా ఆశిస్తుంది. మెల్లగా ఇవి అక్కడ స్థావరాలు ఏర్పరుచుకుంటాయి. ఈ ఫంగస్ వేర్ల నుండి కాండంపైకి అక్కడ నుండి పొత్తులపైకి మరియు గింజలపైకి విస్తరిస్తాయి. 24°C ఒకేవిధమైన ఉష్ణోగ్రత మరియు 20 నుండి 32°C ఉష్ణోగ్రతల వద్ద ఇవి బాగా విస్తరిస్తాయి. 36°C అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఫంగస్ ఎదుగుదల ఆగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఈ తెగులు దిగుబడి నష్టాలు కలిగిస్తుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక విత్తన రకాలను ఎంచుకోండి.
  • ధృవీకృత డీలర్ల నుండి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయండి.
  • విత్తనాలను నాటేముందు వాటికి ఏదైనా ఫంగస్ ఉందేమో పరీక్షించండి.
  • మంచి నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పరచుకుని మట్టిలో తేమ అధిక మోతాదులో ఉండకుండా చూడండి.
  • తెగులు సోకిన ప్రాంతాలనుండి సేకరించిన విత్తనాలను వాడకండి.
  • సీజన్లో సమతుల పద్దతిలో ఎరువులను ( ముఖ్యంగా పోటాష్ ఎరువులు) వాడండి.
  • వరి లేదా ఈ తెగులు సోకని ఇతర రకాల పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి