Gibberella fujikuroi
శీలీంధ్రం
బకనే నారు తెగులు అనిపిస్తుంది కానీ మొక్కల పెరుగుదల ప్రతి దశలోను ఈ తెగులును చూడొచ్చు. మొక్కలకు ఫంగస్ వేర్లనుండి వ్యాపిస్తుంది మరియు ఒక పద్ధతి ప్రకారం కాండం ద్వారా మొక్క అంతా వ్యాపిస్తుంది. ఒక వేళ ఈ తెగులు మొదటి దశను దాటితే మొలకలు అసాధారంగా పొడుగైన మొక్కలుగా, పాలిపోయిన, సన్నటి మరియు ఎండిన ఆకులు మరియు తక్కువ పిలకలు లాంటి లక్షణాలతో ఉంటాయి. కాండం లోపలిభాగం కుళ్లిపోయి పై కణుపులనుండి కొత్తగా చిగుర్లు వేస్తాయి. తెగులు సోకిన మొక్కల కాండంపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్క పెద్దది అయ్యేవరకు బ్రతికివుంటే కంకులలో తాలుగింజలు ఏర్పడతాయి. ఈ మొక్కలు నిటారుగా నిలబడి వుంటాయి. వీటిలో ఫ్లాగ్ లీఫ్ తెగులు కూడా మనం గమనించవచ్చు.
ఇంత వరకు ఈ తెగులుకు జీవ చికిత్స విధానం లేదు. విత్తనాలను ఉప్పునీటిలో నానబెట్టి తేలికగావున్న విత్తనాలను ఆరోగ్యంగా వున్న విత్తనాలనుండి వేరుచేయవచు.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ట్రైఫుమిజోల్, ప్రొపికనజోల్, ప్రోక్లోరాజ్ వంటి సీలింద్రనాశినిలలో విత్తనాలను (ఒకటే కానీ లేదా తీరం(thiram) తో కలిపికాని) 5 గంటల వరకు నానబెట్టి వాడడం వలన మంచి ఫలితం వుంటుంది. సోడియం హైపోక్లోరైడ్( బ్లీచ్) తో విత్తనాలను శుద్ధిచేయడంవలన కూడా ఈ తెగులును నియంత్రించవచ్చు. పైరు ఎదుగుతున్నదశలో పైన చెప్పిన వాటిని వారంలో 2 సార్లు పిచికారీ చేయడం వలన ఈ తెగులును నివారించవచ్చు.
బకనే తెగులు విత్తనాలకు సోకే ఫంగల్ వ్యాధి. తరచుగా వ్యాధి సోకిన విత్తనాలు వాడటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది(ఫంగల్ స్పోర్స్ ఉన్నటువంటి) ఇంకా మొక్క భాగాలు లేదా భూమిలో రోగకారక సూక్ష్మక్రిములు వున్నప్పుడు కానీ ఈ వ్యాధి సోకుతుంది. ఇది గాలి లేదా నీటి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. పంట కోత వంటి పొలం పనుల ద్వారా కూడా ఈ వ్యాధి ఆరోగయకరమైన మొక్కలకు కూడా సోకుతుంది. సాగు సమయంలో ఆరోగ్యాంగా ఉన్న విత్తనాలకీ ఫంగల్ స్పార్స్ సోకడం వల్ల కూడా బకనే తెగులు వ్యాపించవచ్చు. 30 నుండి 35 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు వ్యాధి పెరగటానికి సహకరిస్తాయి.

This page is powered by millions of live Plantix diagnoses. Reach farmers at the exact moment they diagnose బకనే మరియు మొదలు కుళ్ళు with Demand Creation, part of Plantix Intelligence.