బొప్పాయి

ఫైటోఫ్తోరా క్రౌన్ మరియు వేరు కుళ్ళు వేగులు

Phytophthora spp.

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • మొక్కల ఎదుగుదల తగ్గడం మరియు చిన్న ఆకులు ఏర్పడడం జరుగుతుంది.
  • చెట్టు పైభాగంలో కణజాలంలో లేదా మొత్తం అంతటా గోధుమ రంగును చూడవచ్చు.
  • ఇది వేర్లకు సంక్రమించడం వలన గోధుమ రంగు నుండి నల్ల వేరు కళ్ళు తెగులుకు కారణమవుతుంది.

లో కూడా చూడవచ్చు

8 పంటలు
కాకరకాయ
ద్రాక్ష
పెండలం
పుచ్చకాయ
మరిన్ని

బొప్పాయి

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు చాలా రకాల వేరు వ్యాధుల లక్షణాలను పోలి ఉంటాయి. చిన్న చిన్న మరియు కొద్దిగా రంగు కోల్పోయిన ఆకులు, పండ్లు సరిగా తయారవ్వకపోవడం మరియు అంతర్గత కణజాలం కుళ్ళిపోవడం ఈ క్రౌన్ మరియు వేరు తెగులు యొక్క ప్రధాన సంకేతాలు. తెగులు సోకిన తీగలు లేదా చెట్లు కుంగిపోవచ్చు మరియు చిన్న ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. బెరడు కుళ్లిపోయిన లక్షణాలను బహిర్గతం చేయవచ్చు మరియు కొన్ని సార్లు జిగురు చుక్కలు కనిపిస్తాయి. కాండం మొదలును అడ్డంగా కోసినట్లయితే చెట్టు పైనుండి వేర్ల వరకూ ఎర్రటి గోధుమ రంగు నిర్జీవమైన క్యాంకర్లు కనపడతాయి. ఈ క్యాంకర్లు చివరికి చెట్టు కాండం మొదలుకు పట్టీ లాగ చుట్టుముడతాయి. దీనివలన నీరు మరియు పోషకాలు, పై భాగాలకు రవాణా కావడంలో అవరోధం ఏర్పడుతుంది. చివరికి చిగుర్లనుండి ప్రారంభమై కొమ్మలు చనిపోతాయి. తీగలు లేదా చెట్లు క్రమక్రమంగా చనిపోతాయి మరియు సులభంగా మట్టిలో నుండి బయటకు తీయవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

యాంటీ ఫంగల్ జీవ చికిత్సలు చేయవచ్చు, ఉదాహరణకు బోర్డియక్స్ మిశ్రమంతో గాయాలు మరియు కత్తిరింపుకు గురైన కోతలపైన పూయడం. అదే సమ్మేళనంతో చేసే నివారణ చికిత్స కూడా దాడులను తగ్గిస్తుంది. చెట్లు విస్తృతంగా ప్రభావితమైనప్పుడు, ఈ తెగులును నిర్మూలించడం సాధ్యపడదు మరియు నివారణ చర్యలు మాత్రమే దాని తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నీటిపారుదల ద్వారా శిలీంద్ర నాశినులను ఉపయోగించడం చెట్లు మరియు తీగలకు చికిత్స చేయడానికి ఒక సమర్థవంతమైన మార్గం. ఈ తెగులు లక్షణాలు కనపడిన వెంటనే ఫోసెటైల్ అల్యూమినియం, మెటలాక్సిల్ లేదా మిథైల్ థియోఫనేట్-మిథైల్ ఆధారిత శిలీంద్ర నాశినులతో చెట్ల మొదలు వద్ద బాగా నీరు పెట్టండి. తెగులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి, వ్యవసాయ ఉపకరణాలు ఉపయోగించిన తర్వాత బ్లీచ్‌తో శుభ్రం చేయండి.

దీనికి కారణమేమిటి?

ఫైటోఫ్థోరా జాతికి చెందిన అనేక జాతుల ఫంగస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఒకసారి పొలంలోకి ప్రవేశించిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ ఇవి మట్టిలో జీవించగలవు మరియు వీటిని నిర్మూలించడం అసాధ్యం. ఈ శిలీంధ్రాలు అధిక నేల తేమ స్థాయిలపైన మరియు వాటి వృద్ధికి తేమ, వేడి వాతావరణంపై ఆధారపడతాయి. ఈ తెగులు సోకిన తీగలు లేదా చెట్లు నీటి పారుదల సరిగా లేని ప్రాంతాలు, తరుచూ వరదలు లేదా అధిక నీటిపారుదలతో సంబంధం కలిగి ఉండి తరచుగా ఒకొక్కటిగా లేదా పొలంలో చిన్న సమూహాలుగా కనిపిస్తాయి. బిందు సేద్యపు ద్రాక్షతోటలు లేదా పండ్ల తోటలలో, నేరుగా వాల్వ్ కింద ఉన్న కాండం పైన నీరు నేరుగా పడడం వలన అప్పుడప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్క పదార్ధాలను అంటుకట్టే సమయంలో రవాణా చేసినప్పుడు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే ఫైటోఫ్తోరా నిరోధక రకాలను ఉపయోగించండి.
  • తెగులు సోకిన మొక్కల పదార్థాలను వివిధ పొలాలు మరియు ప్రాంతాల మధ్యన రవాణా చేయవద్దు.
  • వరదలు సంభవించే అవకాశం వున్న ప్రాంతాల్లో నాటవద్దు.
  • కాండం చుట్టూ నీరు చేరకుండా వుండే విధంగా మట్టిని అమర్చి నీటి పారుదల సమస్యను సరిచేయండి.
  • ప్రతిసారీ నీరు పెట్టడం మరియు దీర్ఘకాలం నీరు పెట్టడం నివారించండి.
  • వేరు ప్రాంతంలో సేంద్రీయ రక్షక కవచాన్ని అమర్చండి.
  • పండ్ల తోట లేదా ద్రాక్షతోటను మొక్కల అవశేషాలకు దూరంగా ఉంచండి.
  • సమతుల్య ఫలదీకరణం జరిగేటట్టు ప్లాన్ చేయండి.
  • తెగులు సోకిన మొక్కల భాగాలు లేదా చనిపోయిన చెట్లు లేదా తీగలు తొలగించి వాటిని కాల్చండి.
  • తెగులును వ్యాప్తి చేసే అంతర పంటలను వేయవద్దు.
  • తెగులు సోకిన ప్రదేశాల నుండి పరిశుభ్రమైన ప్రాంతాలకు వెళ్ళే ముందు వ్యవసాయ పరికరాలను పూర్తిగా శుభ్రపరిచేలా చూసుకోండి.
  • నీరు నేరుగా కాండం వద్దకు వెళ్లనివ్వకుండా బిందు సేద్యాన్ని సర్దుబాటు చేయండి.
  • అంటు కట్టినప్పుడు యూనియన్లు బాగా నేల పైకి ఉండేలా చూసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి