చిక్కుడు

బీన్ మొక్కలలో బూడిద రంగు కాండం ఎండు తెగులు (యాషి స్టెమ్ బ్లెయిట్ అఫ్ బీన్)

Macrophomina phaseolina

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు వాడిపోయి వేలాడుతూ ఉంటాయి.
  • ఆకు కణజాలం రంగు కోల్పోయి పాలిపోతుంది( క్లోరోసిస్) కాండం ఎండిపోయిన గడ్డి లాగ మారిపోతుంది.
  • ప్రధాన వేరు కుళ్ళిపోవడం, నలుపు రంగులోకి మారడం, బెరడు చీలిపోవడం మరియు బాగా చిన్న పరిమాణంలో వున్న ముదురు రంగు శిలీంద్రాలను బయట మరియు లోపల కూడా చూడవచ్చు.


చిక్కుడు

లక్షణాలు

పూత దశ తరవాత ఈ తెగులు లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి తొలుత మొక్కల పైభాగానికి పరిమితమై ఉంటాయి మరియు ఆకులు, ఈనెలు వాలిపోవడం మరియు కాడలు, ఆకు కణజాలాల రంగు మారి పాలిపోవడం జరుగుతుంది. క్రింది భాగంలో వున్న ఆకులు ఇంకా ఈ తెగులు సోకిన మొక్కల కాండం సాధారణంగా గడ్డి రంగులో లేదా కొన్ని సందర్భాల్లో గోధుమ రంగులో ఉంటాయి. ప్రధాన వేరు కుళ్ళిన లక్షణాలతో నల్లగా మారుతుంది. ప్రధాన వేరు కుళ్లిపోయి నశించి పోతుంది. ఇతర ప్రక్క వేర్లు కనపడకుండా పోతాయి. చనిపోయిన కణజాలం వేర్లను పూర్తిగా పగిలేటట్టు చేసి బెరడు కృంగిపోయేటట్టు చేస్తుంది. మొక్కలను పీకడానికి ప్రయత్నించినప్పుడు ఇవి చాల సులభంగా చేతిలోకి వచ్చేస్తాయి. అయితే ప్రధాన వేరు క్రింది భాగం మాత్రం మట్టిలో ఉండిపోతుంది. కాలర్ ప్రాంతంలో మరియు అంతర్గత కణజాలంపై బాగా చిన్న పరిమాణంలో ముదురు రంగులో ఫంగస్ కనపడుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా విరిడే, స్యుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ మరియు బాసిల్లస్ సబ్తిలిస్ ఈ తెగులును నియంత్రించడంలో కొంచెం మంచి ఫలితాలను చూపించాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థియోఫనేట్ మిథైల్ మరియు విటవాక్స్ శిలీంధ్ర నాశినులతోవిత్తన శుద్ధి చేయడం వలన ఈ తెగులు ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కప్తాన్, థీరం లేదా బెన్లేట్ తో విత్తనాలకు చికిత్స చేయడం కూడా ఈ తెగులును నియంత్రించడంలో సహాయపడతాయి (సాధారణంగా 3 గ్రా/ కేజీ విత్తనాలకు).

దీనికి కారణమేమిటి?

ఇది నేల వలన కలిగే ఫంగల్ త్రెడ్స్ లేదా ఫంగస్ మాక్రోఫొమిన ఫసోలినా యొక్క బీజాంశాల ద్వారా కలిగే తెగులు. ఉష్ణోగ్రతలు 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ వున్నప్పుడు ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. అప్పటికె ఫంగస్ మొక్క కణజాలంలో వుండి క్రమంగా వాటిని దెబ్బతీస్తాయి. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు మరియు మరింత తరచుగా తేమ ఒత్తిడి ఉన్నప్పుడు, R. బటాటోకోలా ఫంగస్ సాధారణంగా ఉష్ణమండల మరియు తేమ వున్న ప్రాంతాల్లో మరింత తీవ్రంగా మారుతోంది. పూత మరియు కాయ దశల్లో 30 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు పొడి నేలల పరిస్థితులలో ఈ తెగులు చాలా వేగంగా విస్తరిస్తుంది. కొన్ని సందర్భాల్లో చలికాలంలో స్క్లేరోటియా అని పిలువబడే శిలీంధ్ర నిర్మాణాలు 6 సంవత్సరాల వరకు మట్టిలోనే జీవించి ఉంటాయి.


నివారణా చర్యలు

  • పరిపక్వత చెందే సమయంలో అధిక ఉష్ణోగ్రతను నివారించడానికి త్వరగా పక్వానికి వచ్చే రకాలను నాటితే, తద్వారా సంక్రమణను తగ్గుతుంది.
  • ఈ తెగులు లక్షణాల కోసం పొలాన్ని తరుచూ గమనిస్తూ వుండండి.
  • 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేసినట్లయితే పంట కోతల తర్వాత కూడా మట్టిలో క్రిములు జీవించి ఉండడాన్ని బాగా తగ్గిస్తుంది.
  • పంట కోతల తర్వాత పొలాన్ని లోతుగా దున్నండి మరియు పొలంలోని మొక్కల అవశేషాలను తొలగించి నాశనం చేయండి.
  • బీన్స్ కాయలు పూర్తిగా నిండడానికి పొలంలో సరిపడినంత నీరు పెట్టి మట్టిలో సరైన మోతాదులో తేమ వుండేటట్టు చూడండి.
  • కానీ అధిక మొత్తంలో నీరు పెట్టకండి.
  • ఈ తెగులు వ్యాపించకుండా ఉండడానికి అధిక మొత్తంలో ఎరువుల వాడకాన్ని నివారించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి