Colletotrichum truncatum
శీలీంధ్రం
ఎటువంటి లక్షణాలు బైటకు కనపడకుండానే పక్షి కన్ను తెగులు కాండాలను, కాయలను మరియు ఆకులను ఆశిస్తుంది. కేవలం పునరుత్పత్తి దశలోనే ఈ తెగులు లక్షణాలు కనిపించవచ్చు. వాతావరణం అనుకూలంగా వేడిగా మరియు తేమతో ఉన్నపుడు కాండాల పైన మరియు కాయల పైన చిన్న ముదురు మచ్చలు కనిపిస్తాయి. ఇవి చిన్న నల్లటి చుక్కలతో కలిసి ఉంటాయి. ఆకులు మడత పడవచ్చు. ఎక్కువగా ఈ తెగులు సోకినట్లైతే కాయలలో చిన్న పరిమాణంలో గింజలు ఏర్పడతాయి.
పక్షి కన్ను తెగులుకు జీవనియంత్రణ లేదు.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఒక వేళ 5% కంటే ఎక్కువ విత్తనాలకు ఈ తెగులు సోకినట్లైతే శీలింద్ర నాశినులను వాడడం సిఫార్స్ చేయబడినది.. క్లోరోతలోనిల్, మాంకోజెబ్. కాపర్ పిచికారీలు లేదా ప్రొపికోనజోల్ మరియు సింథటిక్ రసాయనం అయిన థియోఫానేట్-మిథైల్ ను వాడవచ్చు.
ఇది పంట అవశేషాల పై ఒక సంవత్సరం వరకు జీవించివుండగలదు. గాలివలన వర్షం వలన బీజాంశాలుఎగిరి పైఆకుల మీదకు చేరతాయి. అధికంగా ఆకుపైన తేమ వున్నా 12 గంటల పైన వర్షం పడినా ఈ తెగులు మొక్కకు సోకుతుంది. దిగుబడి మీద పెద్దగా ప్రభావం లేకపోయినా కాయలు మరియు విత్తనాల నాణ్యత తగ్గుతుంది. వాతావరణం అనుకూలించే ప్రాంతాల్లో (తడి నెలలు, వెచ్చటి మరియు తేమ వాతావరణంలో) దిగుబడి నష్టాలు అధికంగా ఉంటాయి

Put your product in front of farmers the moment they diagnose సోయాబీన్ లో పక్షి కన్ను తెగులు (ఆంత్రక్నోస్ అఫ్ సోయాబీన్) — right when they need a solution.
Explore
Explore the live agronomic data that powers Plantix disease pages.
Discover