చెర్రీ

షాట్ హోల్ తెగులు

Wilsonomyces carpophilus

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న ఊదా-నల్ల మచ్చలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు పెరిగే కొద్దీ మధ్యలో లేత గోధుమరంగులోకి మారుతాయి.

లో కూడా చూడవచ్చు

4 పంటలు
బాదం
అప్రికోట్
చెర్రీ
పీచ్

చెర్రీ

లక్షణాలు

వసంతకాలంలో ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. కొత్త ఆకులపై మరియు అప్పుడప్పుడు చిగుర్లు మరియు మొగ్గలపై ఊదా లేదా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తరచుగా ఈ మచ్చల చుట్టూ లేత ఆకుపచ్చ లేదా పసుపు అంచులు ఉంటాయి. ఇవి విస్తరిస్తున్నప్పుడు వాటి మధ్యభాగం మొదట గోధుమరంగు లేదా తుప్పు-రంగులోకి మారుతుంది. చివరికి రాలి పడిపోతుంది, అందువలనే ఈ వ్యాధికి 'షాట్ హోల్' అనే పేరు వచ్చింది. ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. కొమ్మలు చనిపోయిన మొగ్గలు గాయాలు లేదా జిగురు లాంటి పదార్ధాన్ని స్రవించే పుండ్లను కలిగివుండవచ్చు. సాధారణంగా పండ్ల పైభాగంలో ఊదారంగు అంచులతో కఠినమైన మరియు బెండు చెక్క లాంటి గాయాలు ఏర్పడతాయి. దీంతో పండు అందవిహీనంగా మారి అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. భూతద్దం ద్వారా గాయాల మధ్యలో చిన్న చిన్న నల్లని మచ్చలను గమనించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చలికాలం ప్రారంభంలో రాగి ఆధారంగా శిలీంద్ర నాశినులను ఉపయోగించడం వ్యాధికి వ్యతిరేకంగా మొదటి రక్షణగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన బోర్డియక్స్ మిశ్రమం లేదా రాగి యొక్క వాణిజ్య సూత్రీకరణలను కొనుగోలు చేయవచ్చు. శరదృతువు చివరిలో కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆకులపై జింక్ సల్ఫేట్‌ను పిచికారీ చేయడం ద్వారా ఆకు రాలడాన్ని వేగవంతం చేసి ఫంగస్ ఉనికిని తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పండ్లను రక్షించడానికి, మొగ్గ దశ ప్రారంభమైనప్పటినుండి రేకుల రాలిపోయే వరకు పుష్పించే కాలానికి ముందు మరియు తరువాత శిలీంద్ర నాశినులను పిచికారీ చేయవచ్చు. పుష్పించే సమయంలో అందుబాటులో వుండే వాతావరణ సమాచారం డేటా పండ్లను రక్షించడానికి పిచికారీ అవసరమా కాదా అని సూచిస్తుంది. ఈ దశలో రాగి వాడకాన్ని సిఫార్సు చేయనందున, థైరామ్, జిరామ్, అజోక్సిస్ట్రోబిన్, క్లోరోథలోనిల్, ఇప్రోడియోన్ ఆధారిత శిలీంద్ర నాశినులు సిఫార్సు చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

విల్సోనోమైసెస్ కార్పోఫిలస్ అనే ఫంగస్ వల్ల లక్షణాలు ఏర్పడతాయి. ఇది అనేక రకాల రాతి పండ్లకు (పీచ్, బాదం, చెర్రీ మరియు ఆప్రికాట్) సోకుతుంది. ఈ తెగులుకి ప్రత్యామ్నాయ మొక్కలు ఇంగ్లీష్ లారెల్ మరియు ఆల్బకరా. శీతాకాలంలో మొగ్గలు మరియు కొమ్మల గాయాల్లో లేదా మమ్మీ లాగ మారిన పండ్లలో శిలీంధ్రం జీవించిఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఇవి వృద్ధిని పునఃప్రారంభించి బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. వర్షపు తుంపర్ల ద్వారా ఈ బీజాంశాలు ఆరోగ్యకరమైన కణజాలాల పైకి చెదరగొట్టబడతాయి. ఆకులు అధిక సమయం తడిగా ఉండే కాలాలు (14-24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ) మరియు 22 °C ఉష్ణోగ్రతలు ఫంగస్ యొక్క జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటాయి మరియు ఆరోగ్యంగా ఉన్న చెట్లకు సంక్రమించే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. వెచ్చని, పొగమంచు లేదా శీతాకాలంలో వర్షం మరియు వసంత ఋతువులో కురిసే భారీ వర్షాలు బీజాంశం ఏర్పడటానికి మరియు విడుదలకు అనుకూలంగా ఉంటాయి. నిజానికి ఈ వ్యాధి వసంతకాలంలో అసాధారణ తడి వాతావరణంలో మాత్రమే రాతి పండ్ల చెట్లపై వృద్ధి చెందుతుంది.


నివారణా చర్యలు

  • మొక్కలకునీరు పెట్టే సమయంలో దిగువ ఆకులపై నీటిని చల్లడం మానుకోండి.
  • వ్యాధి సంకేతాల కోసం తోటలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • ఆకుల మంచి గాలి మరియు వెలుతురు ప్రసరణ కోసం కత్తిరింపు పద్ధతులను ఉపయోగించండి.
  • సంక్రమణను గుర్తించిన వెంటనే సంక్రమణకు గురైన కొమ్మలను ఆరోగ్యంగా ఉన్న కణజాలం నుండి కొన్ని సెంటీమీటర్ల వరకు కత్తిరించండి.
  • పొలం పని పూర్తయిన తర్వాత కొమ్మలను కత్తిరించడానికి ఉపయోగించిన పరికరాలు మరియు ఇతర పాత్రలను క్రిమిసంహారక మందుతో శుభ్రపరచండి.
  • కత్తిరించిన కొమ్మలు మరియు చెక్కను పొలం నుండి తొలగించి నాశనం చేయండి.
  • ఈ శిలీంధ్రాన్ని వికర్షించడానికి చెట్లకి సమీపంలో వెల్లుల్లి లేదా ఉల్లిని పెంచండి.
  • ప్రత్యామ్నాయంగా, కాండం చుట్టూ సేంద్రీయ రక్షక కవచాన్ని పిచికారీ చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి