వరి

వరి కంకి నల్లి

Steneotarsonemus spinki

పురుగు

5 mins to read

క్లుప్తంగా

  • ఈ కంకి నల్లి ఆకు పొరల లోపలి భాగాన్ని తినడం వలన అవి రంగు కోల్పోతాయి.
  • కంకులను తినడం వలన వంధత్వం ఏర్పడి, గింజలు వైకల్యం చెంది తల నిటారుగా ఉంటుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఆకు వెనక ఈనెలదగ్గర ఈ పురుగులు తినడం మొదలుపెడతాయి. దాల్చినచెక్క రంగు నుండి చాక్లెట్-గోధుమరంగు మచ్చల ఉనికి ద్వారా దీనిని కనిపెట్టవచ్చు. పైపొరను తొలగించినప్పుడు ఈ పురుగులు కనపడతాయి. పురుగులను నేరుగా చూడవచ్చు. ఈ పురుగులు వరి కంకి యొక్క పొట్ట దశ నుండి గింజ పాలు పొసే దశ వరకు కూడా తింటాయి. ఈ అవకాశవాద పురుగులు ఎదుగుతున్న ధాన్యం మరియు ఆకుల పైపొరను ఆశిస్తాయి. అందువలన తెగులు (ఉదాహరణకు షీత్ రాట్) సంక్రమిస్తుంది. అందువలన పిలకలు సరిగా ఫలదీకరణం చెందకపోవడం, మొక్క నిర్జీవంగా అయిపోవడం, మొక్క నిటారుగా అయిపోవడం మరియు ధాన్యం వికృతంగా మారిపోవడం (పేరట్ బీకింగ్) జరుగుతుంది. ఇవి చాల ముఖ్యమైన మరియు ఎక్కువ నష్టం కలిగించే పురుగులు. ఈ తెగులు ప్రపంచవ్యాప్తంగా వుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వరి చేలల్లోక్రిమిసంహారక మందుల అధిక వాడకం ద్వారా ఎస్. స్పింకి యొక్క సహజ శత్రువులను (సాలీడ్లు, పరాన్న కందిరీగలు మొదలగునవి) నశించకుండా చూడండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు తీవ్రత బాగా ఎక్కువగా ఉంటే హెక్జిత్యాజాక్స్ లేదా సల్ఫర్ సమ్మేళనాల క్రిమి సంహారక మందులను పిచికారీ చేయండి. స్ప్రే చేసేముందు పొలంలో బాగా ఎక్కువగా నీరు పెట్టండి. దానివలన పురుగులు మొక్క పైభాగానికి వస్తాయి. దానివలన పురుగుల మందు యొక్క సమర్థయం పెరుగుతుంది.

దీనికి కారణమేమిటి?

వరి కంకి నల్లి, (స్టేనియోటార్సోనెముస్ స్పిన్కి) వరి కంకులను తినడం వలన వీటి లక్షణాలు బైట పడతాయి. అధిక ఉష్ణోగ్రతలు మరియు తక్కువ వర్షపాతం పొలంలో వీటి యొక్క అధిక జనాభా పెరుగుదలకు అనువైనవి. 25.5°C మరియు 27.5°C మధ్య ఉష్ణోగ్రతలు మరియు 80 నుండి 90% మధ్య తేమ ఇది అభివృద్ధిచెందడానికి అనువైన పరిస్థితులు. ఎప్పుడూ వరి పంటనే సాగుచేయడం మరియు తెగులు సోకిన పొలంలో వాడిన సామాగ్రిని ఇతర పొలాల్లో వాడడం వలన, వరి సాగు మరియు పొలాల మధ్య సామగ్రిని పంచుకోవడం అనేది జనాభా పెరుగుదలకు దోహదం చేస్తుంది. వరి మొక్కలు ఏడాది పొడవునా ఈ తెగులు బారిన పడవచ్చు. అయితే, వరి పొట్ట దశలో కీటకాలు అత్యధికంగా వుంటాయి మరియు మొక్క పెరిగే కొద్దీ క్షీణిస్తాయి. ఈ పురుగు సాధారణంగా సరోక్లాడియం ఒరేజే (షీత్ రాట్) మరియు బర్కోల్డేరియా గ్లూమే (బ్యాక్టీరియా కంకి నల్లి) సరోక్లాడియమ్ ఒరేజే వంటి వరి యొక్క ఇతర తెగుళ్లతో సంపర్కం చెందుతుంది. అందువలన నష్టం యొక్క లక్షణాలను వివరించడం చాలా కష్టం


నివారణా చర్యలు

  • తెగులు సోకిన లక్షణాలను తెలుసుకొవడానికి పంటను గమనిస్తూ వుండండి పంట కోత తర్వాత, పొలాన్ని దున్నే ముందు గడ్డిని పొలంలో సమంగా పేర్చి దానిని తగలపెట్టండి.
  • పంట కోత తర్వాత రెండు వారాల పాటు పొలాన్ని బీడుగా వుంచండి.
  • మొలకలను దగ్గర దగ్గరగా వరుసలలో నాటండి.
  • సమతుల్య ఎన్ పి కె నిష్పత్తి గల ఎరువులను వాడండి.
  • పురుగు యొక్క జీవిత చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి వరి బదులు బీన్ లేదా చిక్కుడు మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • వరి సాగులో వాడే అన్ని పరికరాల విషయంలో మంచి పారిశుద్ధ్య పద్ధతులను పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి