వరి

వోర్ల్ క్రిములు

Hydrellia philippina

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల మీద పసుపుపచ్చ చుక్కలు, తెలుపు లేదా పారదర్శక మచ్చలు లేదా చారలు మరియు రంధ్రాలు కనబడుతాయి.
  • ఆకులు వంకరపోతాయి మరియు మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది.
  • కొన్నిసార్లు ధాన్యం పాక్షికంగా నిండుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

హెచ్. ఫిలిప్పినా యొక్క లార్వా విచ్చుకుంటున్న ఆకుల యొక్క లోపలి అంచులను తింటాయి. అవి పూర్తిగా విచ్చుకుని సమయంలో లార్వా తినడం వలన ఆకుల లోపలభాగంలో పసుపు రంగు మచ్చలు లేదా చారలు, తెలుపు లేదా పారదర్శక మచ్చలు మరియు సూదిమొన లాంటి రంధ్రాలు కనిపిస్తాయి. దెబ్బతిన్న ఆకులు వక్రీకరించబడి, గాలి వేస్తే విరిగిపోవచ్చు. లార్వా ఆకుకు కూడా నష్టం కలిగించవచ్చు, దీని వలన అంచు మీద చిన్న రంధ్రాలు మరియు పాలిపోయిన అంచులు కనబడతాయి. ఒకవేళ అవి అభివృద్ధి చెందుతున్న వరి కంకులవరకు చేరుకుంటే, గింజలు పాక్షికంగా నిండడం గమనించవచ్చు. సాధారణంగా, వరి మొక్క వోర్ల్ మాగెట్ వలన కలిగే నష్టం నుండి తేరుకోగలదు మరియు లక్షణాలు పంట బాగా పిలకలు వేసే సమయంలో కనపడకుండా పోతాయి..

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఓపియస్, టెట్రాస్టికస్ మరియు ట్రైకోగ్రామా ప్రజాతికి చెందిన చిన్న కందిరీగలు గుడ్లు మరియు మాగట్లను పరాన్న జీవులుగా మారుస్తాయి. గుడ్ల మీద ఆధారపడే వేటాడే జీవులలో డోలిచోపస్, మెడీటెర మరియు సైంటోర్మోన్ జాతుల ఈగలు వుంటాయి. ఓచ్తేరా బ్రెవిటిబియాలిస్ జాతుల ఎఫిడ్రిడ్ ఈగలు మరియు ఆక్సిపెస్ జావెనస్, లైకోసా సూడోజనులత మరియు నియోస్కోన తైసి జాతుల సాలెపురుగులు పెద్దకీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాధారణంగా H. ఫిలిప్పీనా యొక్క లక్షణాలు పంట బాగా పిలకలు వేసేసి సమయంలో అదృశ్యమవుతాయి మరియు క్రిమిసంహారకాల మందులు అవసరం ఉండదు. తీవ్రమైన తెగులు ఉంటే బొగ్గు తారు లేదా వేప నూనెతో గాని కలిపిన పురుగుమందులను మొక్క వేరు ప్రాంతంలో వుంచడం వలన అది తెగులును సమర్థవంతమైన నియంత్రిస్తుంది. ముఖ్యంగా రబి సీజన్లో లేట్ గా నాట్లు వేసినట్లతే ఇలా చేయడం చాలా ఉపయోగకరం

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు హైడ్రిలియా ఫిలిప్పీనా అనే పాక్షిక-జలవర్గపు వోర్ల్ మాగట్ యొక్క లార్వాల వల్ల సంభవిస్తాయి. ఇది లీఫ్ మైనర్ల కుటుంబంలోని భాగం. తేడా ఏమిటంటే ఆకు విప్పారడానికి ముందే ఇది ఆకుని తొలుస్తుంది, తద్వారా అంచుల మీద నిర్జీవ గాయం లాగా కనబడే ఒక ప్రత్యేక నమూనాను సృష్టిస్తుంది. సాధారణంగా ఇది సాగునీటి భూములలోను, సమృద్ధిగావుండే నిర్మలమైన నీరు మరియు పెరిగిన అధిక పచ్చదనం చెరువులు, ప్రవాహాలు మరియు సరస్సులలో జీవిస్తుంది. ఏడాది పొడవునా వరి సాగుచేసే పొలాలు మరియు నాట్లు వేసేసమయంలో లేత వరినారు దాని అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఇది నేరుగా విత్తనాలను నాటే పొలాలు, నారుమడి లేదా నీరు తీసేసిన పొలాల్లో వృద్ధి చెందదు. పూర్తిగా పెరిగిన మాగట్లు తినే కొమ్మ వెలుపల ప్యూపా లాగా మారుతాయి.ఇది ప్రాధమికంగా వరి మొక్కలను ఆశిస్తుంది కానీ ఇది బ్రోచరియా బ్రాచీఆరియా sp, సైనోడన్ sp, ఎకినోచ్లా sp, లీర్సియా sp, పానికం sp, మరియు అడవి వరి వంటి గడ్డి యొక్క జాతుల మీద కూడా పెరగవచ్చు.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే తెగుళ్లను తట్టుకునే రకాలను నాటండి.
  • నేరుగా పొలంలో నాటండి లేదా లేదా నారుమడిని వినియోగించండి.
  • ఎందుకంటే అవి కీటకాలకు ఆకర్షణీయంగా వుండవు.
  • నత్రజని ఎరువులను అధిక మోతాదులో వాడవద్దు.
  • నీటి ఉపరితలాన్ని వేగంగా కప్పేలా మొక్కలకు వీలు కల్పించే పంట పద్ధతులను వాడండి.
  • ఇలా చేయడం వలన వరి తెగులుకు గురయ్యే అవకాశం తక్కువగా వుంటుంది.
  • తెగులు సంక్రమించకుండా ఉండడానికి అజోల్లా మరియు సల్వినియా మొలేస్టా తో నీటి ఉపరితలాన్ని కప్పండి.
  • నాట్లు వేసిన తర్వాత ముందు ౩౦ రోజులలో నీటిని క్రమపద్ధతిలో సరైన విరామంతో పొలంనుండి బైటకి పంపండి.
  • విస్తృత కీటక నాశినులను దుర్వినియోగం చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి