వరి

ఎర్ర చార తెగులు

Gonatophragmium sp.

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ప్రాధమికంగా ఒక పిన్ పరిమాణంలో చిన్న పసుపు పచ్చ నుండి ఆకుపచ్చరంగులో లేత నారింజ మచ్చలు ఆకు కాండం దగ్గర ఏర్పడతాయి.
  • ఆకులు పెరిగే కొద్ది ఈ మచ్చల నుండి ఎర్ర చారలు లేదా గీతలు ఆకు కొన వైపు ఏర్పడుతాయి.
  • ఒక ఆకుపై సాధారణంగా ఒకటి లేదా రెండు చారలు మాత్రమే వుంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

సాధారణంగా ఈ తెగులు కంకులు వేసే సమయం నుండి పునరుత్పత్తి దశకు మొక్కలు చేరే సమయం మధ్యలో మొక్కలకు సంక్రమిస్తుంది. ప్రారంభంలో ఆకు ఈనెల మధ్యభాగంలో బేస్ వద్ద లేత పసుపుపచ్చ ఆకుపచ్చ నుండి లేత ఆరంజ్ రంగు మచ్చలు పిన్ సైజ్ లో కనబడుతాయి. ఈ తెగులు ముదిరే కొద్ది గాయాలు తొడుగుతో పాటు ఎర్ర చారలు లేదా గీతలను ఏర్పరుస్తూ ఆకు కొనవైపునకు వ్యాపిస్తాయి. ఈ మచ్చలు ఒక ప్రాంతంలో కలసిపోయి నిర్జీవ కణాలుగా మారతాయి. ఇది చూడడానికి ఎండిపోయినట్లు కనపడుతుంది. దీని లక్షణాలు నారింజ ఆకు ఎండు తెగులు లక్షణాల వలే వుండి తికమక పెడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా వున్నప్పుడు నారింజ ఆకు ఎండు తెగులును వేరు వేరుగా చేసి చూడడం దాదాపు అసాధ్యం. ఏమైనప్పటికీ, ఎరుపు రంగు చారలో, ఆకుకు ఒకటి లేదా రెండు మచ్చలు వుంటాయి మరియు ఇది ఆకు యొక్క కొన వైపు సాగిన చారతో ఒక నారింజ మచ్చ లక్షణంతో కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు ఇప్పటికి జీవరసాయన నియంత్రణ అందుబాటులో లేదు. మీకు ఏదైనా తెలిసి వుంటే దయచేసి మాకు తెలుపండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థియోఫనేట్ మీథైల్ గల పిచికారీలు ఈ తెగులును సమర్థవంతంగా నియంత్రిస్తాయి.

దీనికి కారణమేమిటి?

గోనటోఫ్రాగ్మియం జన్యువు యొక్క ఫంగస్ వలన వచ్చిన లక్షణాలుగా చెప్పవచ్చు. విత్తనాల ప్రారంభ దశ నుండి ఇది మొక్క మీద ఉన్నప్పటికి, మొక్కలు సాధారణంగా పునరుత్పాదక దశకు చేరుకున్నప్పుడు లక్షణాలు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అధిక ఉష్ణోగ్రత, అనుకూలమైన గాలిలో తేమ, ఆకులపై అధికంగా తేమ ఉండడం మరియు అధిక మోతాదులో నత్రజని వాడడం అనేవి తెగులు వ్యాప్తికి అనుకూలమైన అంశాలు. ఇది రోగకారక కణజాలం లోకి ప్రవేశించి ఈనెల ద్వారా ఆకు యొక్క కొన వైపుకి తీసుకెళ్తున్న విషాన్ని ఉత్పత్తి చేస్తుంది, తద్వారా కొత్త రకం చారల నిర్మాణం జరుగుతుంది. ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశాలలో ఎర్ర చార తెగులు వరి ఉత్పత్తికి అత్యంత ముప్పు కలిగించేది.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో దొరికే తెగులు నిరోధక రకాలను పెంచండి.
  • మొక్కల మధ్య సరైనటువంటి దూరం ఉండునట్లు మరియు సరైన విత్తన సాంద్రతను పాటించండి.
  • లక్షణాల కోసం పొలాలను నిత్యం పర్యవేక్షించండి.
  • నత్రజని కలిగిన ఎరువులను అధిక మోతాదులో వాడవద్దు.
  • కంకులు వేయు సమయంలో అప్పుడప్పుడు మొక్కలకు నీరు పెట్టడం వలన ఈ తెగులు వృద్ధిని నివారిస్తుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి