దానిమ్మ

ఇనుప ధాతువు లోపం

Iron Deficiency

లోపం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకు అంచులనుండి పసుపు రంగు లోకి మారతాయి.
  • ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి.
  • తర్వాత, ఆకులు గోధుమ రంగు మచ్చలతో తెల్లని పసుపు రంగులోకి మారతాయి.
  • మొక్క ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

57 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
అరటి
మరిన్ని

దానిమ్మ

లక్షణాలు

ఈ లక్షణాలు మొదటిగా లేత ఆకులలో కనిపిస్తాయి. లేత ఆకులు మొత్తం రంగు కోల్పోయి (క్లోరోసిస్), ఈనెలు మాత్రం ఆకుపచ్చగా( ఇన్తెర్వినెల్ క్లోరోసిస్) ఉంటాయి. ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, తరువాతి దశలలో ఆకు మొత్తం తెలుపు-పసుపు రంగులోకి మారిపోయి, ఆకు ఈనెల మధ్యన ముదురు గోధుమ రంగు నిర్జీవ మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఏర్పడిన భాగాలను దూరం నుండి చూసి కూడా కనిపెట్టవచ్చు. ఇనుము లోపం వున్న మొక్కలలో ఎదుగుదల తగ్గిపోయి పంట దిగుబడిని తగ్గిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

చిన్న కమతాలలో సాగు చేసే రైతులు, నాచు మరియు దురదగొండి ఆకుల ఎరువును ఉపయోగించవచ్చు. పశువుల పెంట, పీట్ మరియు కంపోస్ట్ వాడడం వలన మట్టిలో ఇనుము లభ్యత పెరుగుతుంది. దండేలియోన్స్ మొక్కలను మీ పంటకు దగ్గరలో వేయడం వలన అది మీ పొలంలో వున్న మొక్కలకు ఇనుము లభ్యత పెంచడంలో నహాయం చేస్తుంది.

రసాయన నియంత్రణ

  • ఇనుప ధాతువు కలిగిన ఎరువులు వాడండి (ఉదాహరణకు: ఫెర్రస్ సల్ఫేట్ (Fe19%)).
  • మీ నేల మరియు పంటకు ఉత్తమమైన ఉత్పత్తి మరియు మోతాదును తెలుసుకోవడానికి మీ వ్యవసాయ సలహాదారుని సంప్రదించండి.

 మరిన్ని సిఫార్సులు:

  • మీ పంట దిగుబడిని పెంచుకోవడానికి పంట సీజన్ ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష చేయమని సిఫార్సు చేయబడింది.

దీనికి కారణమేమిటి?

ఇనుప ధాతు లోపం నీరు పారే ఉష్ణమండల నేలల్లో లేదా డ్రైనేజి సరిగా లేని నేలల్లో, ముఖ్యంగా చల్లని, తేమ సమయాల్లో ఇది ఒక తీవ్రమైన సమస్య కావచ్చు. జొన్న, మొక్క జొన్న, బంగాళదుంప, చిక్కుడు ఈ లోపానికి ఎక్కువగా ప్రభావితం అయ్యే రకాలు కాని గోధుమ, అల్ఫాల్ఫా పంటలు ఈ లోపాన్ని తట్టుకుంటాయి. సున్నపురాయి నుండి పొందిన కాల్కెరియస్, ఆల్కలీన్ నేలలు (పి హెచ్ 7.5 లేదా అంతకంటే ఎక్కువ) మొక్కలను ముఖ్యంగా ఇనుము లోపానికి గురి చేస్తాయి. క్షార నేలల్లో, ఆమ్ల నెలల్లో (పి హెచ్ 7.5 కన్నా ఎక్కువ) ఈ లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియకు మరియు వేరు బుడిపెలు ఏర్పడటానికి ఇనుప ధాతువు చాలా అవసరం కాబట్టి ఈ లోపం వలన బుడిపెల సంఖ్య తగ్గి, నత్రజని స్థిరీకరణ తగ్గుతుంది. పొలానికి అవసరమైన ఇనుము ఒక కిలో మొక్క పొడి కణజాలాన్ని 2.5 మిల్లీగ్రాములు అవసరం ఉంటుంది. ఇనుప ధాతు లోపం వలన కాడ్మియం యొక్క వినియోగం మరియు నిల్వలు మొక్కలలో పెరుగుతాయి.


నివారణా చర్యలు

  • ఈ లోపానికి తక్కువగా గురయ్యే రకాలను ఎంచుకోండి.
  • సాగు చేస్తున్న మొక్కలకు దగ్గరగా డెండాలియన్ మొక్కలను నాటండి.
  • ఇనుప ధాతువు కలిగివున్న పోషకాలు సిఫార్స్ చేయబడ్డాయి.
  • వాడండి.
  • ట్రేస్ ఎలిమెంట్స్‌గా ఇనుము కలిగి ఉన్న ఎరువులు సిఫార్సు చేయబడ్డాయి.
  • వీలైతే, సున్నపు, క్షార నేలలలో పంట సాగు చేయకుండా ఉండండి.
  • పొలంలో డ్రైనేజ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసుకోండి.
  • పొలంలో అధిక మొత్తంలో నీరు పెట్టకండి.
  • సున్నం వేయవద్దు.
  • ఎందుకంటే ఇది నేల యొక్క పి హెచ్ ను పెంచుతుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి