ప్రత్తి

ప్రత్తిలో ఆకుతోలుచు పురుగు

Bucculatrix thurberiella

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • తొలిదశలో పిల్ల పురుగులు ఆకులను తొలుచుకొని తింటూ, తెల్లని లేదా గోదుమ రంగు రంధ్రాలను ఏర్పరుస్తాయి.
  • పురుగులు పెద్దవయ్యే కొద్ది రంధ్రాలలో ఉండి ఆకు యొక్క క్రింది లేదా పై పొరలను తింటాయి.
  • తద్వారా ఆకులు జల్లెడలాగా తయారై రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

మొక్కలపై మూడవ భాగంలో అధిక నష్టం జరగుతుంది. తొలిదశలో పిల్ల పురుగులు ఆకులను తొలుచుకొని తింటూ, తెల్లని లేదా గోదుమ రంగు రంద్రాలను ఏర్పరుస్తాయి. ఈ పురుగులు పెద్దవయ్యేకొద్దీ రంధ్రాలలో నుండి బయటకు వచ్చి ఆకు కొనల వద్ద క్రింది లేదా పై పొరలను తింటాయి. దీని వలన ఆకుల పైన జల్లెడ వంటి నిర్మాణాలు ఏర్పడి అవి ఎండిపోయి రాలిపోతాయి. కొన్ని సందర్భాలలో ఈ తెగులు తీవ్రత ఎక్కువైతే పక్వానికి రాకముందే కాయలు ముందుగా తెరుచుకోవడం, పింజలు రాలిపోవడం జరగవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఒరియస్ జాతుల యొక్క పిల్లపురుగులు, క్రైసోపా యొక్క లార్వాలు, కోలోప్స్ మరియు హిప్పోడమియా యొక్క లద్దె పురుగులను ఈ తెగులు నియంత్రణకు వాడవచ్చు. అదే విధంగా లేబరేటరీ నియంత్రణ పరిస్థితుల్లో జియోకోరిస్, సినియా మరియు జెలస్ యొక్క పెద్ద పురుగులు ఆకుతొలుచు లార్వాలను తింటూ ఉండటాన్ని గమనించవచ్చు. కావున అధిక మొత్తంలో కీటక నాశినులు వాడరాదు. సేంద్రియ పద్దతుల్లో సాగు చేసే ప్రత్తిలో స్పినోసాడ్ ను పిచికారీ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. లేత దశల్లో ఉండే లార్వాలు ఆకులోపల ఉంటాయి కావున కీటక నాశినులను అధిక వయసు కలిగినటువంటి లార్వాల పైన మాత్రమే ఉపయోగించాలి. ఆకు తొలుచు పురుగుకు నియంత్రణకు అనేక రకాల పద్దతులు వున్నాయి లార్వా దశలో అవి రంద్రాలలో వుండి రక్షించబడతాయి కనుక తర్వాత దశలోనే ట్రీట్మెంట్ ను లక్షంగా చేసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు లార్వా డీమిథైల్ పారాధీయాన్, మాలాధియాన్, డైమిధోయెట్ మరియు ఎండ్రిన్ యొక్క మిశ్రమాలను ఉపయోగించాలి.

దీనికి కారణమేమిటి?

బుక్కులాట్రిక్స థుర్బిరియెల్లా అనే లార్వా వలన ఈ లక్షణాలు కలుగును. ఈ కీటకం యొక్క రెక్కలు 7-9 మిల్లీమీటర్స్ పొడువు కలిగియుండి ముందు జతరెక్కలు తెల్లగా ఉంటాయి. రెక్క యొక్క క్రింది భాగం నుండి మధ్య భాగం వైపుకు నలుపు రంగు ఉంటుంది. వెనుక జత రెక్కలు పాలిపోయిన తెలుపు రంగులో ఉంటాయి. తుర్బెరియా తేస్పేసిఒడ్స్ వంటి అడవిజాతి మొక్కలపై మరియు ప్రత్తి ఆకులను లార్వా తింటుంది. లేత దశలో ఉండే లార్వాలు పసుపు నుండి కాషాయం రంగులో ఉండి ఆకును తొలచి ఆకుపై భాగంలో రంద్రాలను ఏర్పరుస్తాయి. పెద్ద లార్వాలు రంధ్రాల నుండి బయటకు వచ్చి ఆకు యొక్క క్రింది లేదా పై భాగంలో ఉన్న కణజాలాన్ని తింటాయి. ఈ విధంగా లార్వాలు తినడం ఆపివేసిన తరువాత ఆకు అడుగు భాగంలో చిన్నటి గుండ్రటి మెరుస్తూ ఉండే ఆవాసాలను ఎర్పరుచుకుంటాయి. సంక్రమణ ఎక్కువైనపుడు ఈనెలు మాత్రమే మిగిలి ఆకులన్నీ రాలిపోతాయి.


నివారణా చర్యలు

  • ఈ పురుగులను పట్టుకోవడానికి ఫెరామోన్ వలలను వాడాలి.
  • పై ఆకుల వద్ద లార్వాలు ఉన్నాయేమో తనిఖీ చేయండి.
  • రసాయనాలు సరైన మోతాదులో వాడడం వలన సహాయకారి కీటకాలు చనిపోకుండా వుంటాయి.
  • ఈ పురుగుల సంతతి పెరగక ముందే పంట కోత పూర్తిచేయాలి.
  • కోత కోసిన వెంటనే పొలాలను లోతుగా దున్నాలి.
  • ఇలా చేయడం వలన ఈ పురుగుల గుడ్లను సంతతిని నాశనం చేయవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి