మొక్కజొన్న

బీన్ లీఫ్ వెబ్బర్

Hedylepta indicata

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులను బయటి వైపు తినడం వలన ఆకు అస్తిపంజరం లాగ మారుతుంది.
  • ఫలితంగా సిల్క్ దారం వంటి పదార్థంతో ఆకులు ముడుచుకపోతాయి లేదా ముడుచుకపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

ఈ గొంగళి పురుగులు ప్రధానంగా (విస్తృతంగా కాదు) కాయధాన్యాల కుటుంబానికి చెందిన మొక్కలపై దాడి చేస్తాయి. ఆకుపచ్చ లార్వాలు చుట్టు చుట్టుకున్న ఆకులు లేదా రెండు ఆకులు దారాల లాంటి సిల్క్ పదార్థం సహాయంతో అతుక్కొని పోయిన వాటిలో నివసిస్తాయి. తరువాత దశల్లో, అవి పాక్షికంగా తినబడిన ఆకులను చుట్టచుట్టి ఒక ముద్దలాగా తయారుచేస్తాయి. అవి ఆకు ఈనెల మధ్యన మెత్తని కణజాలాన్ని తినడం వలన ఆకుల బాహ్య చర్మం పలచబడి గోధుమ రంగులోనికి మారి చనిపోతాయి. నివారణా చర్యలు తీసుకోకపోతే కీటకాలు ఈనెల వరకు తిని గట్టి బాగాన్ని వదిలివేస్తాయి. తెగులు తీవ్రంగా ఉన్న సందర్భంలో ఆకు భాగం క్షీణించి కాయల పరిమాణం తగ్గిపోవడమే కాక దిగుబడి మీద ప్రభావం చూపుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తెగులు సోకిన తర్వాత త్రికోగ్రమ్మ జాతికి చెందిన పరాన్న జీవులను జీవ నియంత్రణకు ఉపయోగించవచ్చు. ఇతర లార్వాల పరాన్న జాతులైన బ్రైకెమెరియా ఓవాటా, గ్రోటియుస్ఓమియా నిగ్రీకన్స్, స్టుర్మియా అల్బున్సిసా, నేమోరిల్ల మాకులొసా మరియు అపాంటేలేస్ మరియు టాక్సిఫోరాయ్ద్స్ జాతులను ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. 0,02% సైపర్ మైత్రిన్ కలిగి ఉన్న ఫార్ములేషన్స్ లేదా 0,02% డెకామేత్రిన్ ను 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

హిడీలెప్టా ఇండికేట లార్వాలు ఈ నస్టానికి కారణం అవుతాయి. పెద్ద కీటకాలు పాలిపోయిన గోధుమ రంగులో 20 మిల్లీమీటర్ల పొడవైన రెక్కలతో ఉంటాయి. వాటికి బంగారు లేదా పసుపుపచ్చ గోధుమ రంగు ముందర రెక్కలు మూడు ముదురు రంగు సొట్ట గీతలతో మరియు ముదురు రంగులో కొద్దిపాటి మచ్చలతో ఉంటాయి. వెనుక రెక్కల మీద రెండు గీతలు ఉంటాయి. ఆడ పురుగులు అతిధి మొక్క యొక్క లేత ఆకుల మీద లేదా రెమ్మల మీద విడి విడిగా గుడ్లను పెడుతాయి. గొంగళి పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి లేత గోధుమ రంగు తలను కలిగి ఉంటాయి. ఇవి చుట్ట చుట్టుకున్న ఆకులలో నివసిస్తూ అక్కడే ఆహారాన్ని తింటూ జీవిస్తాయి. నేలపైన ఉండే చెత్త ఉపరితలంపైన పట్టుకాయ లాంటి వాటిలో ప్యూపాలు ఏర్పడుతాయి. చిక్కుడు జాతి, ఎర్ర దుంప మరియు మొక్కజొన్న వంటి చాలా రకాల అతిధేయి మొక్కల మీద ఈ బీన్ లీఫ్ వెబ్బర్ జీవిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన తెగులుగా పరిగణించబడదు కనుక దీనికి చికిత్స అవసరం లేదు.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలను నాటండి.
  • మొక్కలను జాగ్రత్తగా పరిశీలించండి మరియు అధిక సంఖ్యలో మొక్కలపై ఈ తెగులు లక్షణాలు కనిపిస్తే నియంత్రణా చర్యలను అమలు చేయండి.
  • పంట మార్పిడి చేయండి.
  • పొలంలో కలుపు లేకుండా చూడండి.
  • తెగులు కలిగించే కీటకాల యొక్క సహజ శత్రువులను ఆకర్షించుటకు మకరందాన్ని ఉత్పత్తి చేసే మొక్కలను మీ పొలం చుట్టూ నాటండి.
  • వాటి సంఖ్యను గుర్తించడానికి మరియు సంభోగం ప్రక్రియలను అడ్డుకోవడానికి ఫెరామోన్ వలలు ఉపయోగించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి