ద్రాక్ష

ద్రాక్ష ఆకు ముడుత తెగులు

Sparganothis pilleriana

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • మొగ్గలు గుల్లగా మారతాయి.
  • ఆకులు, రెమ్మలు మరియు పువ్వులకు నష్టం కలుగుతుంది.
  • పట్టు దారాలతో ఆకులు లేదా బెర్రీలు కలపబడి ఉంటాయి.
  • పెద్ద చిమ్మటలు అడ్డంగా 3 ఎర్రటి గోధుమ రంగు పట్టీలతో గడ్డి పసుపు రంగు ముందరి రెక్కలు మరియు బూడిద రంగు వెనక రెక్కలు కలిగివుంటాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

ఎస్. పిల్లెరియానా యొక్క గొంగళి పురుగులు విస్తరణ సమయంలో మొగ్గలలోకి చొచ్చుకుపోతాయి, తద్వారా వాటిని గుల్లగా మారుస్తాయి. మొగ్గ ఏర్పడిన తర్వాత దాడి జరిగితే, అవి ఆకులు, రెమ్మలు మరియు పూలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని ఆకులు పట్టు దారాలతో కలిసి కలిసిపోతాయి మరియు ఈ నిర్మాణాలను వాటి గూళ్ళుగా ఉపయోగించుకుంటూ తినడానికి గూళ్ళ నుంచి బయటకి వస్తాయి. ఈ తెగులు తీవ్రంగా ఉంటే ఆకు దిగువ భాగంలో ఒక స్వాభావికమైన వెండి రంగును పొందుడమే కాక ఆకు కాడ ఎర్రటి రంగులోకి పాలిపోతుంది. దెబ్బతిన్న రెమ్మల కొనలు ఎండిపోయి చనిపోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఆకులు రాలిపోవచ్చు. పుష్పగుచ్ఛాలు కూడా దాడికి గురికావచ్చు. దీని ఫలితంగా బెర్రీలు పెద్ద సంఖ్యలో పట్టు దారాల ద్వారా ఒకదానితో మరొకటి కలిసిపోతాయి. గొంగళి పురుగులను చెదరగొట్టినట్లైతే ఉదా. ఆకు గూళ్ళను తెరిచినట్లైతే, అవి ముందుకు సాగి ఒక స్రవించబడిన దారం ద్వారా తమంతట తాము భూమి వైపుకు వేలాడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఎస్. పిల్లెరియానాను వేటాడే సహజ శత్రువుల్లో పరాన్నజీవి కందిరీగలు మరియు ఈగలు, లేడీబగ్స్ మరియు కొన్ని పక్షుల జాబితా ఉంది. విస్తృత-స్థాయి పురుగుమందులను ఉపయోగించడం ద్వారా ఈ జాతుల జీవన చక్రానికి భంగం కలగకుండా చూసుకోండి. స్పినోసాడ్ కలిగిన సేంద్రీయ పరిష్కారాలు కూడా సిఫార్స్ చేయబడ్డాయి. బవేరియా బ్యూవేరియా బస్సియానా అనే ఫంగస్ కలిగిన ద్రావణాల వలన కూడా ఈ లార్వా ప్రభావితమవుతుంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లోర్ఫెరిఫాస్ ఎమామెక్టిన్, ఇండోక్సాకార్బ్ లేదా మెటాక్సిఫెనోసిడ్ వంటి క్రియాశీల పదార్ధాలను కలిగిన ఉత్పత్తులను సమయానుసారం పిచికారీ చేసి వీటి జనాభాను నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

పొడవు మీసాల టోర్ట్రిక్స్, స్పర్గానోథిస్ పిల్లెరియానా యొక్క గొంగళి పురుగుల వలన వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి. పెద్ద చిమ్మటలు అడ్డంగా 3 ఎర్రటి గోధుమ రంగు పట్టీలతో గడ్డి పసుపు రంగు ముందరి రెక్కలు మరియు బూడిద రంగు వెనక రెక్కలు కలిగివుంటాయి. ఇది సంవత్సరంలో ఒక తరాన్ని కలిగి ఉండి ద్రాక్ష తోటలో తినే ఇతర చిమ్మటతో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రతలను ఇష్టపడుతుంది. ఆడ పురుగులు సాయం సమయంలో ఆకుల పైభాగం పైన గుడ్లను పెడతాయి. గొంగళి పురుగులు బూడిదరంగు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండి 20-30 మి.మీ పొడవు మరియు వెంట్రుకలతో కప్పబడిన శరీరంతో ఉంటాయి. ఇవి బెరడు క్రింద, సపోర్ట్ కర్రల్లో లేదా ప్రత్యామ్నాయ అతిధి మొక్కల ఆకుల క్రింద చిన్న పట్టు లాంటి గూళ్ళల్లో మనుగడ సాగిస్తాయి. ఇవి వసంత ఋతువు మధ్యలో బైటకి వచ్చిన తర్వాత 40-55 రోజుల పాటూ తింటాయి. తర్వాత ఇవి పట్టు దారాలతో నేసిన ఆకుల గూడులో ప్యూపా దశకు చేరతాయి. 2-3 వారాల తరువాత, వేసవి మధ్య కాలంలో, ఇది పొదుగుతుంది. ఎస్. పిల్లెరియానా 100 వేర్వేరు అతిధి మొక్కలను హోస్ట్‌లను ప్రభావితం చేయవచ్చు, ఉదా. బ్లాక్ బెర్రీ, చెస్ట్ నట్, స్టోన్ ఫ్రూట్ జాతులు, క్విన్స్ మరియు బ్లాక్ ఎల్డర్.


నివారణా చర్యలు

  • వసంత ఋతువు నుండి ఎస్.
  • పిల్లెరియానా లక్షణాల కోసం పండ్ల తోటను గమనిస్తూ వుండండి.
  • కాండం మరియు ఎండిన బెరడు కొమ్మలను తొలగించడం, ట్రెల్లిస్ వాడకం, ద్రాక్షతోటల చుట్టూ అటవీ బెల్టులను తొలగించడం మరియు తగ్గించడం, కలుపు నియంత్రణ, సహజ శత్రువులకు మద్దతుగా నెక్టారిఫెరస్ మొక్కలను నాటడం సాగు చర్యలలో భాగంగా ఉంటాయి.
  • వీటి జనాభాను లెక్కపెట్టడానికి మరియు వీటి సంభోగ ప్రవర్తనలకు భంగం కలిగించడానికి లింగాకర్షక బుట్టలను కూడా ఉపయోగించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి