నిమ్మజాతి

నిమ్మజాతి ఫ్లాటిడ్ ప్లాంట్ హాపర్ (మిడత)

Metcalfa pruinosa

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల యొక్క దిగువ భాగము, కొమ్మలు మరియు పండ్లపై తెలుపు, ఉన్నిమరియు మైనం లాంటి పదార్థం కనబడుతుంది.
  • ఎదిగిన పురుగులు గుంపులుగా ఉంటూ ఎప్పుడూ తింటూ అధిక చక్కెరను హనీ డ్యూ రూపములో బయటకు పంపుతుంటాయి.
  • దీనివలన సూటీ బూజు పెరగడానికి అనుకూలిస్తుంది.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఈ ప్లాంట్ హాపర్ యొక్క ఉనికి తరచుగా ఆకులు దిగువ భాగంలో, అలాగే కొమ్మలు మరియు పండ్ల మీద తెల్లటి, ఉన్ని మరియు మైనపు పదార్థం కనపడడం ద్వారా గోచరిస్తుంది. నింఫ్స్ వుత్పత్తి చేసిన అధిక చక్కెరను హనీ డ్యూ రూపములో బయటకు పంపుతుంటాయి. అది మసి బూజు పెరగడానికి అనుకూలిస్తుంది. కొన్నిసార్లు పిండి నల్లి బగ్స్ లేదా కాటనీ కుషన్ స్కేల్ తెగుళ్లను (మరింత నష్టపరిచే తెగుళ్లు) సమయంలో కనబడే వాటిగా పొరబడవచ్చు. సందేహం ఉంటే, వీటికి విరుద్ధంగా, చెదిరినప్పుడు ప్లాంట్ హాపర్ ఎగురుతుందని తెలుసుకోండి. ఎదిగిన పురుగులు మరియు చిన్న పురుగులు మొక్క కణజాలాన్ని చీల్చి కణద్రవ్యం పీల్చడం కోసం అనువుగా ఉండే నోటి భాగాలను కలిగి ఉంటాయి. ఈ పురుగులు అధిక సంఖ్యలో ఉంటే కొత్తగా మొలకలు రాకుండా చేయడం మరియు చెట్లను బలహీన పరుస్తుంది. ఇది నేరుగా లేక అవకాశవాద ఫంగస్ పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ తెగులును ఆతిధ్యము ఇచ్చే మొక్కలలో రంగు కోల్పోయి ( క్లోరోసిస్) కణజాలం నిర్జీవంగా మారడం, లేత కొమ్మల చివర్లు వాడి పోవడము మరియు విత్తనములు ముడుతలు పడటము మరియు వికృతమైన రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సిలో డ్రైనుస్ టైఫ్లోసైబే, డ్రయినిడ్ కుటుంబానికి చెందిన ఒక పరాన్నజీవి కందిరీగ, మెటాకాల్ఫా ప్రుయినోస నిమ్ఫ్ ల పైన తన గుడ్లను పెడుతుంది. ఆవిధంగా జనాభాను తగ్గిస్తుంది. సబ్బుతో కూడిన ద్రావణములు వాడడము వలన పురుగు యొక్క నిమఫ్స్ ఆకుల నుండి జారి భూమి మీదకు పడతాయి మరియు తెల్లటి జిగురు పదార్థము హనీ డ్యూ ఆకులపై వున్న దానిని కడిగి వేయటము కూడా ఒక సరైన పరిష్కారము ఎందుకంటే ఇవి తరువాత సూటి మోల్డ్ పై ఉండిపోతాయి. అయితే కీటక నాశినులను వాడకపోవడం వలన కీటకములు మళ్ళీ వస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎదిగిన పురుగులు ఎపుడు అటు ఇటు తిరుగుతూ ఉండడం వలన వీటిని నియంత్రణను చేయలేము. అధిక పురుగుల జనాభాను నియంత్రించడానికి ఒక మార్గంగా లార్వాను నియంత్రించడానికి కీటకాల మందులను చల్లవచ్చు. సూటి మోల్డ్ అధికముగా నష్టము కలిగించేవి కాబట్టి వీటిని నియంత్రించడం చాలా ఉపయోగకరం. ఆమోదము పొందిన డెల్టమేథ్రిన్, పిరత్రాయిడ్స్ లేదా డైమెథోయేట్ కలిగి ఉన్న ద్రావణములను పొలము అంచులలో పోయడం వలన ఈ కీటకాలను బాగా నియంత్రిస్తుంది.

దీనికి కారణమేమిటి?

మొక్కల మిడత మెటాకాఫా ప్యూరినోసా యొక్క ఎదిగినవి మరియు నింఫ్స్ ఈ లక్షణాలను కలిగిస్తాయి, వీటికి ఆతిధ్యము ఇచ్చే విస్తృతమైన మొక్కలు చాలా వున్నాయి వీటిలో నిమ్మజాతి ఒకటి. ఈ కీటకము అన్ని రకాల వాతావరణములలో అభివృద్ధి చెందుతుంది. అవి చాలా తక్కువ దూరం వరకు ఎగురుతాయి మరియు వెలుతురుకు చాలా ఆకర్షించబడతాయి. చెడు వ్యవసాయిక అభ్యాసాలు మరియు మానవ జోక్యం వలన కూడా సుదీర్ఘ దూరం వరకు వ్యాప్తి చెందడంలో కీలకమైన కారణం కావచ్చు. ఎదిగిన పురుగులు గోధుమ రంగు నుండి బూడిద రంగులో వుండి మరియు వీటి ప్రాముఖ్యమైన లక్షణాలు ప్రకాశవంతమైన నారింజ రంగు కళ్ళు మరియు రెక్కలు త్రిభుజాకారములో వుండి చెల్లాచెదురుగా తెల్లని మచ్చలు ఉంటాయి. వాటిని మొదటగా చూసినపుడు చిమ్మటలుగా పొరబడతాము. ఎదిగిన పురుగులు మరియు నిమ్ఫ్స్ సమృద్ధిగా వున్న నీలి తెల్లటి మైనముచే కప్పబడి తరువాత దట్టమైన తెల్లటి వెంట్రుకల పిలకలుగా మారతాయి. ఆడ పురుగులు శరత్కాలంలో సుమారు 100 గుడ్లను పెడతాయి. సాధారణంగా ఇవి కొమ్మల బెరడు మీద ముందస్తుగా ఉన్న మృదువైన బెరడు యొక్క త్రవ్విన రంధ్రాలపై గుడ్లను పెడతాయి. వసంత కాలంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఈ పురుగుల గుడ్లు పొదిగి మరియు నిమ్ప్స్ మొక్కల కణజాలంపై తినడం ప్రారంభిస్తాయి. ఇవి సాధారణంగా చాలా తక్కువ నష్టం చేస్తాయి. కానీ గతంలో గాయపడిన చెట్లకు ఇది సమస్య కావచ్చు, ఉదాహరణకు గడ్డకట్టడము.


నివారణా చర్యలు

  • కొన్ని దేశాలలో ఈ జాతులను నిర్భంధ నిబంధనలలో (క్వారంటైన్) ఉంచి వుండవచ్చు.
  • ఎదిగిన పురుగులను ఆకర్షించడానికి మరియు వీటి సంఖ్యను పర్యవేక్షించడానికి కాంతి వలలను వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి