ప్రత్తి

ప్రత్తి కాయ ముక్కు పురుగు

Anthonomus grandis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • పూమొగ్గల పైన చిన్న చిన్న గాట్లు ఎర్పడుతాయి.
  • పువ్వులు పసుపు రంగులోకి మారి త్వరగా రాలిపోతాయి.
  • ప్రతి కాయలు సరిగ్గా వృద్ధి చెందక పోవడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

పెద్ద పురుగులు ముఖ్యంగా పూలు మరియు కాయలను ఎక్కువగా తింటూ అప్పుడపుడు ఆకులను కూడా తింటూ ఉంటాయి. పూమొగ్గల యొక్క ఒక ప్రక్క భాగాలలో చిన్న చిన్న గాట్లు ఉండి చిన్న కణితి లాంటి భాగాలను గమనించవచ్చు. ఈ పురుగులు పూమొగ్గలను ఆశించడం వలన రంగు కోల్పోయి త్వరగా రాలిపోతాయి. గాట్లు పెద్దవిగా ఉన్నపుడు వాటి ద్వారా మరిన్ని సూక్ష్మ జీవులు లోపలికి వెళ్లి కాయ కుళ్ళిపోయే ఆస్కారం ఉన్నది. పెద్ద పురుగులు ఆకుల కాడలను తినడం వలన ఆకులు వళ్ళిపోయి కొమ్మను అంటిపెట్టుకుని ఉండడం వలన అవి చూడడానికి నల్లటి జెండాల వలె కనిపిస్తూ ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కాటోలాకస్ గ్రాండిస్ అనే పరాన్న జీవిని ఈ పురుగులకు విరుద్ధంగా ఉపోయోగించవచ్చు. ఇదే విధంగా బివేరియా బాసియానా అనే శీలింద్రాన్ని, బాసిల్లస్ తురింగెన్సిస్ అనే బాక్టీరియాను లేదా చైలో ఇరిడేసేంట్ (CIV) అనే వైరస్ ను జీవ నియంత్రకాలుగా ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సింధటిక్ పెరిత్రాయిడ్లు మరియు డెల్టామేత్రిన్, ఫిప్రోనిల్ వంటి కీటక నాశినులను వాడవచ్చు. తేమ అధికంగా వున్నప్పుడు ఈ పురుగుల మందుల పనితీరు మరింత మెరుగవుతుంది. ఫెరొమోన్ ట్రాప్స్ ను కూడా ఈ పురుగులను గమనించడానికి మరియు నివారణకు ( కీటక నాశినులు మరియు జీవ ఏజెంట్లతో కలిపి) ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

అంతోనోమస్ గ్రాండిస్ అనే మొక్కపురుగు వలన ఈ నష్టం సంభవిస్తుంది. పెంకుపురుగులు 6 మిల్లీమీటర్ల పోడవైన ముక్కు కలిగి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఎక్కువ నీరు నిలువ వున్న ప్రదేశాలలో మరియు ప్రత్తి పొలాలకు దగ్గరలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. తరువాత అక్కడినుండి ఇవి శీతాకాలంలో ప్రత్తి పొలాలను ముఖ్యంగా కాయ ఏర్పడే దశలో ఆశిస్తాయి. పెరుగుతున్నటువంటి ప్రత్తి కాయలపై ఆడపురుగు గుడ్లను పెడతాయి. తెల్లని కాళ్లులేని ‘C’ ఆకారంలో ఉండే లార్వా పింజలోపల 10 రోజులు తిని అక్కడే కోశస్దదశలోనికి వెళ్ళిపోతుంది. వేసవిలో ఈ పురుగు యొక్క జీవితకాలం 3 వారాలు మరియు సంవత్సరానికి 8-10 తరాలను ఉత్పత్తి చేయగలవు.


నివారణా చర్యలు

  • దేశంలో అమలులో ఉన్నటువంటి క్వారంటైన్ నియమాలను అనుసరించాలి.
  • తీవ్రమైన పురుగు దాడిని నివారించడానికి విత్తనాలను ఆలస్యంగా విత్తుకోవాలి.
  • ఈ తెగులును తట్టుకునే విత్తన రకాలను ఎన్నుకోవాలి.
  • పొలాన్ని తరుచు గమనిస్తూవుండాలి.
  • ఎరువులు అధికమొత్తంలో వేయరాదు మరియు ఎక్కువ నీటిని ఉపయోగించరాదు.
  • సరిగ్గా ఎదగని పత్తి ముక్కు పురుగు వేడి మరియు ఉష్ణానికి సున్నితంగా ఉంటాయి.
  • కోత తర్వాత పొలంలో వున్న పంట వ్యర్థాలను నేలలోనికి కలియదున్నవద్దు.
  • వాటిని పొలంలోనుండి తొలగించి నాశనం చేయాలి.
  • ఈ పురుగు ఆశించినటువంటి మొక్కలను మరియు మొక్క భాగాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు మార్చరాదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి