అరటి

కాండం తొలిచే ముక్కు పురుగు

Odoiporus longicollis

కీటకం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న రంధ్రాలు మరియు జెల్లీ గమ్ విసర్జనలు ఆకు తొడుగుల కింద లేదా లేత మొక్కల కాండాల పైన కనబడతాయి.
  • లార్వా కాండాలలోకి చొచ్చుకొని వెళ్తాయి.
  • ఆకులు పసుపురంగు లోకి మారి ఎదుగుదల తగ్గిపోతుంది.
  • కాండాలు బలహీన పడటం వల్ల మొక్కలు గాలి బాగా వీస్తున్న సమయంలో విరిగి పడిపోతాయి.
  • పండ్లు, పండ్ల గుత్తులు సరిగా తయారవ్వవు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

చిన్న రంధ్రాలు మరియు జెల్లీ గమ్ విసర్జనలు ఆకు తొడుగులు కింద లేదా లేత మొక్కల కాండాలపై కనబడతాయి. లార్వా కాండాల్లోకి చొచ్చుకొని వెళ్లి నష్ఠాన్ని కలిగిస్తాయి. మొక్కలో నీరు మరియు పోషకాల రవాణాకు అంతరాయం కూడా కలిగిస్తాయి. ఆకులు పసుపు రంగు లోకి మారి ఎదుగుదల తగ్గిపోతుంది. కాండాలు బలహీన పడటం వల్ల మొక్కలు గాలి బాగా వీసినపుడు విరిగి పడిపోతాయి. పండ్లు మరియు పండ్ల గుత్తులు సరిగా తయారవ్వవు. గాయాలలోని సూక్ష్మజీవులు వల్ల కణజాలాలు త్వరగా రంగు కోల్పోతాయి మరియు కుళ్ళు వాసన వెదజల్లుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

స్టెయిన్ర్నెమా కార్పొకాప్సె లేదా కొన్ని రకాల ఆర్థ్రోపోడ్స్ వంటి నెమటోడ్ రకాలు వాడటం కూడా మంచు ఫలితాలను పొందవచ్చు. మేతర్హిజియం అనిసోప్లై లాంటి ఫంగి ను ఈ బీటిల్స్ పైన వుపయోగించి కూడా దీనిని నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఆర్గానోఫాస్ఫరస్ కలిగిన కీటక నాశినులను (ఉదాహరణకు మోనోక్రోటోఫాస్) కాండాల్లోకి ఇంజక్షన్ చేయడంద్వారా ఈ లార్వాను చంపవచ్చు. కోత అనంతరం తెగులు సోకిన కాండాలను తొలగించి కార్బరిల్ (2గ్రాములు/లీటరుకు) వంటి కీటక నాశినులను ఉపయోగించడంవలన గుడ్లు పెట్టె పురుగులు నాశనం అవుతాయి.

దీనికి కారణమేమిటి?

పెద్ద పురుగులు నల్లటి రంగులో దాదాపుగా 30 మిల్లీమీటర్స్ పొడవు, ఒక కొనలాగా వున్న తలతో మెరుపు తొడుగు కలిగి ఉంటాయి. ఇవి సహజంగా రాత్రి వేళల్లో సంచరిస్తాయి కానీ కొన్ని సార్లు పగలుపూట కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో మరియు ఆకాశము మేఘావృతం అయినప్పుడు ఆడ పురుగులు తెల్లటి గుండ్రటి గుడ్లు ఆకు తొడుగులలో పెడతాయి. ఒక 5-8 రోజుల తరువాత కళ్ళు లేని పసుపు రంగు లార్వా బయటకి వస్తాయి మరియు ఆకు కణజాలాన్ని తినటం మొదలు పెడతాయి. ఇవి దాదాపుగా 8-10 సెంటీమీటర్స్ పొడవు ఉండే సొరంగాలను కాండాలు మరియు వేర్లలో ఏర్పరుస్తాయి.పెద్ద పురుగులు బలంగా ఎగరగలవు.ఇవి ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు ఈ తెగులును వ్యాపింప జేస్తాయి.


నివారణా చర్యలు

  • ద్రువీకరించబడిన తెగులు రహిత విత్తనాలను వాడాలి.
  • విరిగిపోయిన మొక్కలను లేదా కుళ్లిపోయిన మొక్కలను తొలగించి కాల్చి వేయాలి.
  • నిలువుగా చీలిన కాండాలను నేలపై పరిచి వలలుగా వాడినట్లైతే ఈ కత్తిరించిన భాగాలు పెద్ద ఆడ పురుగులును ఆకర్షిస్తాయి.
  • ఇవి వాటిమీద గుడ్లు పెడతాయి.ఏ కత్తిరించిన కాండాలు ఎండిపోయి లార్వా డిహైడ్రేషన్ కు లోనయ్యి చనిపోతాయి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి