ఇతరములు

పండ్లపై బాక్టీరియల్ పొక్కులు

Acidovorax citrulli

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • నీటిలో నానినట్లు వున్న మచ్చలు మొలకెత్తబోతున్న విత్తనాల క్రింద ఏర్పడతాయి.
  • ముదురు లేదా ఎర్రటి గోధుమ రంగు కోణాకారపు మచ్చలు ఆకుల ఈనెల వెంబడి ఏర్పడతాయి.
  • పండ్లపైన ఆలివ్ రంగులో మచ్చలు కలిసిపోయి ముదురు గోధుమ రంగులో పొక్కుల వలె మారతాయి.
  • జిగురు రంగు ద్రవం కణజాలం నుండి స్రవిస్తుంది.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
కాకరకాయ
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

మొక్కలు నాటిన 5 నుండి 8 రోజుల వ్యవధిలోనే ఈ తెగులు లక్షణాలు గమనించవచ్చు. నీటిలో నానినట్టు వున్నమచ్చలు విత్తనాల నుండి విడివడిన ఆకుల (కోటిలేడోన్స్) క్రింది భాగంలో ఏర్పడతాయి. కొన్నిసార్లు మొలకలు వాడిపోవచ్చు. ఎదిగిన మొక్కలలో ముదురు లేదా ఎర్రని గోధుమ రంగు కోణాకారపు మచ్చలు ఆకుల ఈనెల వెంబడి ఏర్పడతాయి. సరిగ్గా పండే సమయానికి ఈ మచ్చలు పండ్లపైన ఏర్పడతాయి. ఇవి ముందుగా పండ్లపైన చిన్న పరిమాణంలో, ఆలివ్ రంగులో ఏర్పడతాయి. ఈ మచ్చలు చాలా త్వరగా వ్యాపించి ఒకదానితో ఇంకొకటి కలిసి ముదురు గోధుమ రంగు పొక్కులవలె మారతాయి.ఈ తెగులు వ్యాప్తిచెందే కొలదీ ఈ మచ్చలు వున్న ప్రాంతంలో పగుళ్లు ఏర్పడతాయి. జిగురు రంగు ద్రవం వీటి నుండి స్రవిస్తుంది. అవకాశవాద సూక్ష్మ క్రిములు ఈ దెబ్బతిన్న కణజాలాన్ని వాటి నివాసంగా చేసుకోవడం వలన పండు లోపల నుండి కుళ్లిపోతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వేడి గాలి చికిత్స( డ్రై హీట్) ద్వారా విత్తనాలను శుద్ధి చేయడం ద్వారా ఈ సూక్ష్మ క్రిములను కొంత వరకు తొలగించవచ్చు. 85° ఉష్ణోగ్రత వద్ద 3–5 రోజులు విత్తనాలను శుద్ధి చేయడం ద్వారా ఈ సూక్ష్మ క్రిములను తొలగించవచ్చు. కాపర్ ఆధారిత ఫార్ములేషన్లు వాడి ఈ తెగులు వ్యాప్తి వేగాన్ని తగ్గించి పండ్లను ఈ తెగులు నుండి కాపాడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పొలంలో ఈ తెగులును గమనించిన వెంటనే క్యూప్రిక్ హైడ్రాక్సైడ్, కాపర్ హైడ్రోక్సోసల్ఫేట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ వంటి కాపర్ ఆధారిత బాక్టీరిసైడ్స్ ను ఉపయోగించడం వలన ఈ తెగులు వ్యాప్తిని నివారించి పండ్లకు తెగులు సంక్రమించకుండా కాపాడవచ్చు. పుష్పించే దశకు ముందు మొదలుపెట్టి పండ్లు పక్వానికి వచ్చే వరకు వీటిని వాడాలి.

దీనికి కారణమేమిటి?

యసిడోఒరాక్స్ సిట్రి అనే బాక్టీరియమ్ వలన ఈ తెగులు సంక్రమిస్తుంది. కలుషితమైన పండ్ల విత్తనాలలో, మట్టిలో వున్న పంట అవశేషాలపై మరియు ఇతర ప్రత్యామ్న్యాయ అతిథేయ మొక్కలపై మరియు కుకుర్బిట్ జాతికి చెందిన కలుపు మొక్కలపై ఇది జీవిస్తుంది. అన్ని దోసజాతి మొక్కలకు కొంతవరకు ఈ తెగులు సంక్రమిస్తుంది. కానీ లక్షణాల తీవ్రతలో తేడాలు ఉంటాయి. కలుషితమైన విత్తనాలు ఈ తెగులు వ్యాపించడానికి ప్రధానమైన కారణంగా ఉంటాయి. నీరు చిందడం ద్వారా (వర్షం, లేదా పైనుండి మొక్కలకు నీరు పెట్టడం), పనివల్ల చేతులు, బట్టలు వలన మరియు పనిముట్లవలన ఇది ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత (32°c కన్నా ఎక్కువ) ఈ తెగులు వ్యాపించడానికి అనుకూలంగా ఉంటుంది. ఫలదీకరణ ద్వారా మరియు పుష్పించిన 2 నుండి మూడు వారాలలోపు పండ్లకు ఈ తెగులు సంక్రమిస్తుంది. కానీ పండ్లు పెద్దవి అయ్యేకొలది వీటిపైన ఒక మైనపు పొర ఏర్పడి తెగులు సంక్రమించకుండా నిరోధిస్తుంది.


నివారణా చర్యలు

  • మీ దేశంలో వున్న క్వారంటైన్ నిబంధలను తెలుసుకోండి.
  • ధ్రువీకరించిన డీలర్ల నుండి విత్తనాలను కొనుగోలు చేయండి.
  • పంట కాలం మొత్తం పొలంలో అత్యుత్తమ శుభ్రతను పాటించండి.ఈ తెగులు లక్షణాలకు పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను వెంటనే నాశనం చేయండి.
  • కుకుర్బిట్ జాతికి చెందిన కలుపు మొక్కలను మరియు ఇతర ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలను నివారించండి.
  • కోత తరవాత పంట అవశేషాలు మట్టిలో కలయునట్లు పొలాన్ని లోతుగా దున్నండి.
  • ఈ బాక్టీరియమ్ వ్యాపించకుండా నివారించడానికి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
  • కలుషితమైన పొలంలో వాడిన పనిముట్లను శుభ్రం చేసిన తర్వాతనే వేరొక పొలంలో వినియోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి