ఇతరములు

అగ్గి ఎండు తెగులు

Erwinia amylovora

బ్యాక్టీరియా

5 mins to read

క్లుప్తంగా

  • చెట్ల మీద ఎర్రటి, నీటిలో నానినట్టు వున్న గాయాలు బెరడుపై వృద్ధి అవుతాయి.
  • ఆకులు మరియు రెమ్మల కొనలు వేగంగా వాలిపోతాయి మరియు గోధుమ లేదా నలుపురంగులోకి మారుతాయి.
  • ఆకులు చనిపోతాయి కాని రాలిపోవు.
  • అగ్గి ఎండు తెగులు వికసించిన పుష్పాలను చంపుతుంది.
  • రెమ్మలు, కొమ్మలు మరియు కొన్నిసార్లు మొత్తం చెట్టును చంపుతుంది.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
ఆపిల్
పియర్

ఇతరములు

లక్షణాలు

అగ్గి ఎండు తెగులు ఆకులు పండ్లు మరియు రెమ్మలపై అనేక లక్షణాలను కలుగచేస్తుంది. ఆకులు మరియు వికసించిన పుష్పాలు వాడిపోయి ఆకుపచ్చ బూడిదరంగు మరియు తరువాత గోధుమ లేదా నలుపు రంగులోకి చాలా త్వరగా మారుతతాయి. సీజన్ అంతా అవి కొమ్మలకు అంటుకునే ఉంటాయి. పెరుగుతున్న రెమ్మలు కూడా ఆకుపచ్చ బూడిదరంగులోకి మారి వాడిపోయి, వంగిపోయి మరియు ‘ ‘గొర్రెల కాపరి కొక్కెం’ రూపంలోకి మారతాయి. తెగులు పెరిగేకొద్దీ, ఎక్కువ రెమ్మలు కుచించుకుపోయి చనిపోతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్లలో, చెట్లు అగ్గితో కాలిపోయినట్లు కనిపిస్తాయి. దీనివల్లనే ఈ వ్యాధికి ఈ పేరు వచ్చింది. కొమ్మలపై క్యాంకర్లు కనిపిస్తాయి మరియు నొక్కుకుపోయిన మరియు పగిలిన బెరడుతో వాటికి ముదురు రంగును ఇస్తాయి. చనిపోయిన బెరడు కింద చెక్క ఎర్రటి గోధుమ రంగులోకి మారుతుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో తెగులు సోకిన మొక్కల భాగాల నుండి సన్నని తెల్లటి ద్రవం వెలువడుతుంది. చికిత్స చేయకపోతే, సంక్రమణ వేర్లకు చేరి, మొత్తం చెట్లు చనిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వికసించే కాలంలో అనేక సార్లు బోర్డియాక్స్ మిశ్రమం లేదా ఇతర రాగి ఉత్పత్తులు (సుమారు 0.5%) ద్రావణాలను వాడటం వలన కొత్త అంటువ్యాధులను తగ్గిస్తుంది. వాతావరణ పరిస్థితులను అనుసరించి సకాలంలో వీటి వాడకం సిఫారసు చేయబడింది. అధిక తేమ ఉన్న కాలంలో నాలుగు నుండి ఐదు రోజుల వ్యవధిలో వాడండి. కొన్ని రాగి ఉత్పత్తులు పండ్ల ఉపరితలంపై మచ్చలు కలిగిస్తాయని తెలుసుకోండి. స్ట్రెప్టోమైసెస్ లిడికస్ కలిగిన ఉత్పత్తులు బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అగ్గి ఎండు తెగులును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పువ్వులు వికసించే కాలంలో రాగి ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అనేకసార్లు వీటిని వాడినప్పటికీ తగిన నియంత్రణను ఇవ్వవు. కత్తిరింపు చేసేటప్పుడు ఉపకరణాలను 10% బ్లీచ్ ద్రావణం లేదా యాంటీ బాక్టీరియల్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.

దీనికి కారణమేమిటి?

అగ్గి ఎండు తెగులు ఎర్వినియా అమిలోవోరా అనే బాక్టీరియం వలన సంభవిస్తుంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన ఆపిల్, పీర్స్ మరియు అలంకార మొక్కలకు సంక్రమిస్తుంది. ప్లమ్స్, చెర్రీలు, పీచ్ పండ్లు మరియు నెక్టరైన్స్ వంటివి ఈ వ్యాధి బారిన పడవు. వసంతఋతువు నుండి శరదృతువు వరకు నష్టం కలుగుతుంది. శీతాకాలంలో రెమ్మలు, కొమ్మలు లేదా కాండం క్యాంకర్లలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. వసంతకాలంలో అనుకూలమైన పరిస్థితులలో, ఇది లోపలి కణజాలాలలో పెరుగుదలను తిరిగి ప్రారంభిస్తుంది. వాటికి గోధుమ రంగును ఇస్తుంది. ఇది నీరు మరియు పోషకాల రవాణాకు ఆటంకం కలిగిస్తుంది మరియు రెమ్మల కొనలు ఎండిపోవడానికి దారితీస్తుంది, చివరికి ఇది క్రిందికి వంగి పోతుంది. వర్షపు తుంపర్లు లేదా కీటకాలు బ్యాక్టీరియాను సమీపంలోని తెరుచుకున్న పువ్వులకు లేదా వేగంగా పెరుగుతున్న రెమ్మలకు వ్యాపిస్తాయి. అధిక భూసారం మరియు నేలలోని తేమ కూడా నష్టం యొక్క తీవ్రతను పెంచుతాయి. వెచ్చని వాతావరణం లేదా గాయాలు సంక్రమణకు అనుకూలంగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలను వాడండి.
  • ఎరువులకు అంతగా స్పందించని నెమ్మదిగా ఎదిగే రకాలను ఎంచుకోండి.
  • వ్యాధి సంకేతాల కోసం తోటలను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • శీతాకాలం చివరినాటికి తెగులు సోకిన కొమ్మలను కత్తిరించండి మరియు వాటిని కాల్చివేయండి.
  • కోతలకు వాడే పరికరాలను వాడిన తరువాత క్రిమి సంహారక మందుతో జాగ్రత్తగా శుభ్రం చేయండి.
  • పొలంలో పనిచేసేటప్పుడు చెట్లను గాయపరచకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • సరైన కత్తిరింపు చేసి చెట్టు పందిరి తెరిచి వుండేటట్టు చూడండి.
  • చెట్లకు అదనపు నత్రజనిని వాడవద్దు.
  • తోట చుట్టూ ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను నాటకండి.
  • తీవ్రమైన సంక్రమణ కేసులలో, కర్రలతో సహా మొత్తం చెట్టును తొలగించండి.
  • పువ్వులు వికసించే కాలంలో చెట్లకు నీరుపెట్టకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి