ద్రాక్ష

ద్రాక్షలో ఆకుముడత

GLD

వైరస్

5 mins to read

క్లుప్తంగా

  • ఎర్ర ద్రాక్షలో ఈనెల మధ్య ఆకు కణజాలం ముదురు ఎరుపు రంగులోకి మరియు తెల్ల ద్రాక్షలో పసుపు రంగులోకి మారుతుంది.
  • కిందకి చుట్టుకుపోవడం మరియు అంచులు కప్పు లాంటి ఆకారంలోకి మారడం స్పష్టంగా కనిపిస్తాయి.
  • ఈనెల ఎదుగుదల తగ్గడం, పొట్టి గెడలు మరియు మొక్క మరుగుజ్జుగా ఉండవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

వైరస్ కు వున్న వివిధ రకాల ద్రాక్ష యొక్క సెన్సిబిలిటీని బట్టి లక్షణాలు విస్తృతంగా మారుతుంటాయి మరియు వేసవి చివరిలో లేదా శరదృతువులో వీటిని బాగా గమనించవచ్చు. ఎర్రటి చర్మం గల ద్రాక్ష రకాల్లో, ఈనెల మధ్య ఆకు కణజాలం ముదురు ఎరుపు నుండి ఊదా రంగులోకి మారుతుంది మరియు ఆకు అంచులు క్రిందికి చుట్టుకుపోయి లేదా కప్పు లాంటి ఆకారంలోకి మారతాయి. తెలుపు ద్రాక్ష రకాల్లో, ఆకు కణజాలం చుట్టుకుపోవడం లేదా ఆకు అంచులు పసుపు రంగులోకి మారడం కనబడుతుంది. ప్రధాన ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉండవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో రంగు పాలిపోవటం మొత్తం ఆకు కణజాలంపై ప్రభావం చూపుతుంది. ఈనెల ఎదుగుదల తగ్గడం, పొట్టి గెడలు మరియు మొక్క మరుగుజ్జు రూపాన్ని కలిగి ఉండవచ్చు. సంవత్సరాలు గడిచే కొద్దీ, పండ్లు ఆలస్యంగా పండడం లేదా ఒకే విధంగా పండకపోవడం, చక్కెర శాతం తగ్గడం, ద్రాక్ష రంగు పాలిపోవడం మరియు ఆమ్లత్వం పెరగడం వంటి వాటికి కారణం కావచ్చు. ద్రాక్ష తోట క్షీణత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తెగులు సోకిన ద్రాక్ష తోటల జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష తోటలో ఇది చాలా తీవ్రమైన వ్యాధి, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, ద్రాక్షలో ఆకు ముడత తెగులును వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ తెగులుతో పోరాడటానికి సహాయపడే చికిత్స ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వైరల్ వ్యాధులను రసాయన సమ్మేళనాలతో చికిత్స చేయడం వీలుకాదు. బిందు సేద్యం సౌకర్యం ఉన్న ద్రాక్షతోటలలో, కొన్ని పురుగుమందులను సీజన్‌లో ఎప్పుడైనా పిండి నల్లికి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. బిందు సేద్యం చేయని ద్రాక్ష తోటలలోని కాండం మరియు ప్రధాన శాఖలపై ఎసిటామిప్రిడ్ కలిగిన ఉత్పత్తులతో కూడిన ఆకు పిచికారీలను ఉపయోగించవచ్చు. పిండి నల్లి మరియు పులుసు పురుగులను నియంత్రించడానికి ఇతర సాగు మరియు జీవ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.

దీనికి కారణమేమిటి?

ద్రాక్ష ఆకు ముడత లీఫ్‌రోల్ వ్యాధి లక్షణాలు పది వేర్వేరు వైరస్ల సమూహం వల్ల సంభవిస్తుంది. వీటిని సమిష్టిగా ద్రాక్ష ఆకు ముడత అనుబంధ వైరస్సులుగా సూచిస్తారు. ఒకే మొక్కతో అంటు కట్టడం, తెగులు సోకిన మొక్కల పదార్థాల రవాణా మరియు అంటుకట్టడం, ఈ వ్యాధిని సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేసే అత్యంత సాధారణ మార్గాలు. అంతేకాకుండా, రెండు క్రిమి వాహకాలు, పిండి నల్లి మరియు మెత్తని పొలుసు పురుగులు కూడా మొక్కల మధ్య మరియు కొన్నిసార్లు ద్రాక్షతోటల మధ్య స్థానికంగా వ్యాప్తి చేయగలవు. ఈ వైరస్లు యాంత్రికంగా ప్రసారం చేయబడవు, ఉదాహరణకు కత్తిరింపు పరికరాలు లేదా హార్వెస్టర్స్ ద్వారా, లేదా విత్తనాల ద్వారా సంక్రమించవు. భాస్వరం మరియు పొటాషియం లోపాల లక్షణాలు ద్రాక్ష ఆకు ముడత వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అందువలన, చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు సంక్రమణను నిర్ధారించాల్సిన అవసరం ఉంది.


నివారణా చర్యలు

  • మీ దేశంలో వర్తిస్తే క్వారంటైన్ నిబంధనలను పరిశీలించండి.
  • ఆకు ముడత వైరస్ లేని ధృవీకరించబడిన మొక్కలను ఎంచుకోండి.
  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఎంచుకోండి.
  • వ్యాధి లక్షణాల కోసం ద్రాక్షతోటను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • ధృవీకరించబడిన ద్రాక్ష ఆకు ముడత తెగులుతో ద్రాక్షతోటలలో పిండి నల్లి మరియు మెత్తని పొలుసు పురుగుల ఉనికిని తనిఖీ చేయండి.
  • సందేహం ఉంటే, మీ మొక్కలను వైరస్ కోసం ప్రయోగశాలలో పరీక్ష చేయించండి.
  • వైరస్ సోకిన మొక్కలను వేరు వ్యవస్థతో సహా తొలగించి నాశనం చేయండి.
  • వేర్లకు తెగులు సోకే అవకాశం ఉన్నందున, పై అంటుకట్టు పద్దతిని నివారించండి.
  • తెగులు సోకిన మొక్క పదార్థాలను ఇతర ద్రాక్షతోటలకు రవాణా చేయవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి