ప్రత్తి

ప్రత్తిలో వేరు కుళ్ళు తెగులు

Macrophomina phaseolina

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • మొక్క వాలిపోతుంది మరియు ఆకులు రాలిపోతాయి.
  • మొక్కలు ఒక ప్రక్కకు పడిపోవచ్చు.
  • వేరు బెరడు పసుపు రంగు లోకి మారుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ప్రత్తి

లక్షణాలు

పత్తి మొక్కలు ఎండిపోవటం ఈ తెగులు యొక్క కనిపించే మొదటి లక్షణం మరియు తీవ్రమైన సందర్భాల్లో మొక్క పూర్తిగా పడిపోవడం లేదా ఆకులు రాలిపోవడం జరగవచ్చు. అర్ధాంతరంగా మొక్క పూర్తిగా ఎండిపోవటం ఈ తెగులు యొక్క ముఖ్య లక్షణం. వాడిపోవడం అనే లక్షణాలు వివిధ రకాలుగా వుంటాయి. ప్రారంభంలో కొన్ని మొక్కలు మాత్రమే ప్రభావితమవుతాయి. కానీ సమయం గడిచేకొద్దీ తెగులు సోకిన మొక్కలు పొలంలో గుంపులు గుంపులుగా చనిపోతాయి. నేల పైనుండి మొక్క ఎండిపోవటం ఈ తెగులు యొక్క మెల్లగా కనిపించే లక్షణం. మొక్క పైభాగాలకు నీరు, పోషకాలు చేరవు. మొత్తానికి ప్రభావితమైన మొక్కలు స్థిరత్వాన్నికోల్పోయి గాలి కి సులువుగా పక్కకి పడిపోతాయి లేదా భూమిలో నుండి తేలికగా పీకివేయవచ్చు. ఆరోగ్యంగా వున్న మొక్కలతో పోలిస్తే, వేరు పైబెరడు పసుపు రంగు లోకి మారతాయి మరియు తరచుగా ముక్కలైపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు ఈ ప్రత్తిలో వేరు కుళ్ళు తెగులు నివారణకు జీవ నియంత్రం పద్ధతులు లేవు. ట్రైకోడెర్మా అనే ఫంగస్ యొక్క కొన్ని జాతులు మంచి ఫలితాలను చూపించాయి, వీటితో చికిత్స చేసిన పత్తి మొలకల మనుగడను గణనీయంగా పెంచాయి మరియు వీటిని వాణిజ్య పరంగా తయారుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జింక్ సల్ఫేట్ యొక్క కొన్ని సేంద్రీయ సూత్రీకరణలు దీని వ్యాప్తిని పరిమితం చేయడానికి పిచికారీ చేయవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. థైరామ్, థియోఫనేట్ మిథైల్, జింక్ సల్ఫేట్ మరియు కప్టాన్ వంటి శిలీంద్ర నాశినులు కలిగి ఉన్న వివిధ సూత్రీకరణలతో విత్తనం లేదా మట్టి చికిత్సలు, వేరు కుళ్ళును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

దీనికి కారణమేమిటి?

మాక్రోఫోమినా ఫసియోలినా అనే శిలీద్రం వలన ఈ తెగులు కలుగుతుంది. ఇది పత్తి యొక్క, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ముఖ్యమైన వ్యాధి. పండు మిరప, పుచ్చ లేదా దోస వంటి పంటలతో సహా, ఇది సుమారు 300 వేర్వేరు పంటల యొక్క విస్తృత శ్రేణిని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికారక నేలల్లో మనుగడ సాగిస్తుంది మరియు ముఖ్యంగా ఎదిగే దశ చివర్లో, పత్తి యొక్క వేర్లలో దీన్ని సులభంగా వేరుచేయవచ్చు. మొక్కలు కరువు బారిన పడినప్పుడు ఈ శిలీంధ్రం భూమిలో నివసిస్తుంది. ఈ తెగులు వేసవి మధ్యలో చాలా తరచుగా వస్తుంది మరియు శరదృతువులో తగ్గిపోతుంది. మొక్క ఒత్తిడికి గురైనపుడు, 15-20% తేమ కలిగిన పొడి నేలలు, ఉష్ణోగ్రతలు 35-39°C వున్నప్పుడు ఈ తెగులు వెంటనే వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • తెగుళ్లను లేదా కరువును తట్టుకునే విత్తన రకాలను పెంచండి.
  • బలమైన కాడలతో వుండే రకాలను ఎంచుకుంటే, పడిపోకుండా ఉంటుంది.
  • పుష్పించే దశలో పొడి వాతావరణం ఉండకుండా విత్తే తేదీని సర్దుబాటు చేయండి.
  • మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉంచండి. ముఖ్యంగా పుష్పించే దశ తర్వాత, సరిగా నీరు పెట్టడం ద్వారా మట్టిలో మంచి తేమ ఉండేలా చూడండి.
  • సమతుల్య ఎరువులు వాడండి మరియు అధిక నత్రజని వాడకాన్ని నివారించండి.
  • దిగుబడి నష్టాలను నివారించడానికి త్వరగా కోతలు పూర్తిచేయండి.
  • పంట కోత తర్వాత పొలాన్ని లోతుగా దున్ని పంట అవశేషాలను పూడ్చిపెట్టండి.
  • పొలాన్ని దున్నిన తర్వాత మట్టిని సూర్య రష్మికి బహిర్గతం చేయడం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
  • ఈ తెగులుకు అతిధులు కాని చిన్న గోధుమలు, వోట్స్, వరి, బార్లీ మరియు రై వంటి పంటలతో మూడు సంవత్సరాల వరకు పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి