అరటి

అరటిలో నల్ల అకుమచ్చ తెగులు

Deightoniella torulosa

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • గుండ్రటి, సన్నటి, నల్ల మచ్చలు మొదట ఆకుల అంచుల వద్ద కనబడతాయి.
  • ఇవి తరువాత ఆకు కొనల వద్దకు వ్యాపించి 'V' ఆకారంలో కనబడతాయి.
  • కాయలపైన నల్లటి భాగాలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

గుండ్రని, పిన్ పాయింట్, నల్ల మచ్చలు ఆకు అంచుకు సమీపంలో లేమినా యొక్క ప్రధాన ఈనె వెంబడి కనిపిస్తాయి. క్రమంగా, ఈ మచ్చలు పరిమాణం పెరుగుతాయి మరియు దగ్గర దగ్గరగా పసుపు అంచులను అభివృద్ధి చేస్తాయి.పెద్ద మచ్చలు మధ్యలో ఎండిపోయి లేత గోధుమ భాగాలు పసుపు పచ్చ మార్జిన్స్ దాటి ఆకు ఈనెల మధ్య భాగం వరకు వ్యాపిస్తాయి. ఈ మచ్చలు 'V' ఆకారంలో కనబడుతాయి. మొదట కాయల కొనల వద్ద, నల్ల రంగు పాలిపోయిన మచ్చలు క్రమరహితంగా కొన్నిసార్లు పసుపుపచ్చ మార్జిన్స్ తో కనిపించి తరవాత కాయ వెంబడి విస్తరిస్తాయి. కొన్ని రకాలలో, గుండ్రటి ఎర్రటి గోధుమ రంగు మచ్చలు లేదా నల్లటి చుక్కలు మరియు ముదురు ఆకుపచ్చ, ఉబ్బి మెరిసినట్లుండే మచ్చలు కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు నియంత్రణకు జీవసంబంధ నియంత్రణ లేదు. ఈ తెగులు తీవ్రమైన సందర్భాలలో, ఉదాహరణకు, ఆర్గానిక్ రాగి సమ్మేళనాలు, 1% బోర్డియక్స్ మిశ్రమాన్ని స్ప్రే చేయవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు తీవ్రమైన సందర్భాల్లో 0.4% మోకోజేబ్ లేదా చమురు ఆధారిత ఫార్ములాలైన కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.2-0.4% వాడండి. క్లోరోథలోనిల్ లేదా మాంకోజెబ్ మరియు ఒక జీవ నియంత్రణ శిలీంద్ర నాశినులు వంటి ఫంగిసైడ్స్ ను ఉపయోగించండి. ఉదా. టేబుకనజోల్ లేదా ప్రోపికోనజోల్ సిఫారసు చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

శిలీంధ్రం డెయిటోనిఎల్ల టోర్లొసా అనేది ఈ తెగులుకు కారణమైన జీవి. ఇది చనిపోయిన అరటి ఆకులలో వుండి వర్షం మరియు మంచు కాలాల్లో కొత్త మచ్చలను ఉత్పత్తి చేస్తుంది. తేమ క్షీణించే కొద్ది, ఈ కీటకాలు తీవ్రంగా తెగులును వ్యాప్తి చేసి చివరకు గాలిలోనికి ఎగిరిపోతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు దీని వలన తెగులు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఫంగస్ మొక్క కణజాలం నాశనానికి కారణమవుతుంది, దీనివలన కిరణజన్య సంయోగక్రియ గణనీయంగా తగ్గి దిగుబడిని తగ్గిస్తుంది.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్లయితే తెగులు నిరోధక విత్తన రకాలను ఉపయోగించండి (మార్కెట్లో చాలా ఉన్నాయి).
  • నీడ పడకుండా ఉండడానికి మరియు ఆకులు ఒక దానితో ఒకటి తాకకుండా నివారించడానికి సరైన ఎడంతో మొక్కలను నాటండి.
  • వేయబోయే క్రొత్త తోటలకు సరైన దూరంలో వ్యాధిగ్రస్తమైన తోటలు వుండేటట్టు చూసుకోండి.
  • గాలిలో తేమను తగ్గించడానికి తుంపర సేద్యాన్ని ఉపయోగించవద్దు.
  • బిందు సేద్యం అనుకూలం.
  • సమతుల్య ఎరువుల వాడకం అభినందనీయం అలాగే అధిక నత్రజని ఆధారిత ఎరువుల వినియోగం తగ్గించాలి.
  • ఈ తెగులు బారిన పడ్డ ఆకులను కాల్చివేయండి.
  • పొలాన్ని శుభ్రంగా ఉంచుతూ వ్రేలాడిన, ఎండిన ఆకులను తెంచివేయండి.
  • తెగులు ప్రభావిత ఆకు భాగాలను మరియు కాయలను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి