నిమ్మజాతి

నిమ్మలో ఆకు మచ్చ తెగులు

Pseudocercospora angolensis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల మీద, తేలిక గోధుమ నుండి బూడిద వృత్తాకార మచ్చలు ముదురు గోధుమ అంచులతో మరియు పసుపు వలయంతో వుంటాయి.
  • ఎదిగిన పండ్లపైన పైకి లేచినట్టువున్న కణితి లాంటి ఎదుగుదల చుట్టూ పసుపు వలయంతో ఉంటాయి.
  • పాత పండ్ల గాయాలు కొన్నిసార్లు ముదురు గోధుమ కేంద్రాన్ని చూపుతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

వృత్తాకారంలో, ఎక్కువగా ఒంటరిగా వున్న మచ్చలు ఆకులపై కనిపిస్తాయి మరియు పరిమాణంలో ఇవి 10 మి.మీ వ్యాసము వరకు ఉంటాయి. అవి ఒక తేలిక గోధుమ లేక బూడిద రంగు కేంద్రము కలిగి మరియు పొడి వాతావరణములో ఎరుపు అంచుతో ఒక పసుపు వలయమును కలిగి వుంటాయి. వర్షాలు ప్రారంభమైన తరువాత ఇవి నల్లగా మారి మరియు బీజాంశాలతో కప్పబడి ఆకుల దిగువ భాగంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ తెగులు విస్తరించినప్పుడు మచ్చలు ఏర్పడి ఆకులు రంగు కోల్పోయి రాలిపోవచ్చు. అప్పుడప్పుడు, మచ్చలు రాలి పడిపోవచ్చు. అక్కడ రంధ్రాలు ఏర్పడవచ్చు. ఆకుపచ్చ పండ్లలో ఈ మచ్చలు గుండ్రంగా ఉండి సక్రమంగా వేరుగా కానీ లేదా కలిసిపోయి కానీ వుండి తరచుగా చుట్టూ పసుపు రంగు వలయంతో ఉంటాయి. ఈ తెగులు అధికంగా సోకితే నల్లని కొంచెం ఉబ్బెత్తుగా వున్న కణితులవంటి పెరుగుదల కనపడుతుంది. తరువాత మధ్యలో కణ నాశనము జరిగి పడిపోతాయి. మ్రుగ్గిన పండ్లపైన వివిధ పరిమాణాలలో ఈ మచ్చలు ఉంటాయి. కానీ ఈ మచ్చలు చదునుగా ఉంటాయి. కొన్నిసార్లు ఈ మచ్చలు కొద్దిగా నొక్కుకుపోయినట్లు ఉంటాయి. అప్పుడప్పుడు కాండం మీద గాయాలు ఏర్పడతాయి. ఇవి ఆకు కాడ నుండి విస్తరించి వుంటాయి. ఇలాంటి అనేక గాయాల వలన మొక్కలు పైనుండి క్రిందకు చనిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సిట్రస్ లాటిఫోలియా మరియు సిట్రస్ లిమోన్ నుండి తీయబడిన సహజ నూనెలు ఈ తెగులు కారకాలను నియంత్రిస్తాయి. నిమ్మ ఆకు నుండి తీయబడిన మరియు సిట్రస్ ఔరంటిఫోలియా నూనెలు మరియు బాటిల్ బ్రష్ మొక్కలు (కళ్లిస్టమోన్ సిట్రినస్ మరియు కళ్లిస్టమోన్ రిగిడస్) రోగకారక క్రిములను నిరోధిస్తాయి. ఇప్పటివరకు ప్రయోగశాలలలో నియంత్రిత పరిస్థితిలో మాత్రమే వీటి పనితీరు పరిశీలించబడ్డాయి. రాగి ఆధారిత శిలీంధ్రాలు కూడా ఉపయోగించవచ్చును.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ట్రైఫ్లొక్సోస్ట్రోబిన్ లేదా మాంకోజెబ్ మరియు బెనోమిల్ ఆధారిత శీలింద్ర నాశినులను మినిరల్ స్ప్రే ఆయిల్ తో కలిసి వాడడం వలన ఈ ఫంగస్ ను నిర్మూలించడంలో మంచి ఫలితాలు చూపాయి. క్లోరోతలొనిల్, రాగి మరియు వాటి మిశ్రమాల ఆధారాలు కూడా ఈ తెగులుకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతాయి. వర్షం పడిన తర్వాత వీటి వాడడం సిఫార్స్ చేయబడింది. ఎందుకంటే వర్షం బీజాంశాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు ఫంగస్ స్యుడోసెర్కోస్పోరా అంగోలెన్సిస్ వలన సంభవిస్తాయి. చాలావరకు ఇది తెగులు సోకిన మొక్కల పదార్థాల గాయాల పైన పరిస్థితులు బీజాంశం ఉత్పత్తికి అనుకూలమైనంత వరకు నిద్రాణ స్థితిలో ఉంటుంది. సుదీర్ఘ తడి వాతావరణ పరిస్థితులు ఆ తరువాత వచ్చే పొడి వాతావరణం మరియు 22-26°C యొక్క మధ్యస్థ చల్లని ఉష్ణోగ్రతలపై దీని జీవిత చక్రం ఆధారపడుతుంది. ఆకులు ఈ తెగులు వ్యాప్తికి ప్రధాన మూలంగా ఉంటాయి. ఎందుకంటే వాటి పైన మచ్చలు పండ్ల పైన మచ్చల కంటే అధికంగా బీజంశాలను ఉత్పత్తి చేస్తాయి. గాలి వలన ఈ ఫంగస్ బీజాంశాలు సుదూర ప్రాంతాలవరకు వ్యాపిస్తాయి. అయితే వర్షపు తుంపరల వలన వాన చినుకుల ద్వారా పొలం చుట్టుప్రక్కల ఈ తెగులు వ్యాపిస్తుంది. తెగులు మొక్కలను ఇతర పొలాలకు లేదా ప్రాంతాలకు రవాణా చేయడం ద్వారా కూడా మనుషులు ఈ తెగులును వ్యాపింపచేస్తారు


నివారణా చర్యలు

  • అందుబాటులో వుంటే నిరోధక లేదా తట్టుకోగలిగిన రకాలను నాటండి.
  • పడి పోయిన పండ్లను మరియు ఆకులను వెంటనే తొలగించి నాశనము చేయండి ఉదాహరణకు వాటిని కాల్చడము లేదా పూడ్చిపెట్టడం చేయండి.
  • తోటల మీదికి వచ్చే కాలుష్యాన్ని నివారించడానికి తోటల చుట్టూ గాలికి అడ్డంగా తెరలు కట్టండి.
  • చెట్ల మధ్య తగినంత ఎడంను వుంచండి తరువాత తోటలోని చెట్ల మధ్యలో గాలి, వెలుతురును పెంచండి.
  • ప్రత్యామ్నాయ అతిధి చెట్ల మధ్య సంపర్కాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా కత్తిరించండి.
  • నీటిపారుదల మరియు పండ్లు తయారయ్యే సమయాన్ని సింక్రొనైజ్ చేయడానికి ప్రయత్నించండి.
  • ఈ తెగులుతో కలుషితమైన ప్రాంతాల నుండి తెగులు సోకిన మొక్కలు, చెట్లు లేదా పండ్లు రవాణా చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి