మినుములు మరియు పెసలు

మినుము పంటలో పక్షి కన్ను తెగులు

Colletotrichum lindemuthianum

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • కాండం, ఆకులు, కాడలు మరియు కాయలపై చిన్నగా, అపసవ్యంగా పసుపు నుండి గోధుమ రంగు నీటితో ఉన్నటువంటి మచ్చలు ఉంటాయి.
  • మచ్చలు అంచుల వెంబడి ఉండి పసుపు వర్ణంలో గాని నారింజ పండు వర్ణంలో గాని కాంతివంతమైన ఎరుపు అంచులతో కనిపిస్తాయి.
  • కాండం మరియు ఆకు కాడలపై కాంకర్స్ కనిపిస్తాయి.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మినుములు మరియు పెసలు

లక్షణాలు

ఈ తెగులు మొక్కల ఏ దశలో అయినా ఆశించవచ్చు. ఈ తెగులు ముఖ్యంగా ఆకులు, కాండాలు, కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఉన్న విత్తనాల్ని పొలంలో చల్లటం ద్వారా అంకురోత్పత్తి జరిగి కన్ను ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి. పెద్ద మొక్కలలో ఈ మచ్చలు చిన్నగా, సక్రమంగా లేకుండా , నల్లని రంగులో నీటిలో నానినట్టు కనిపిస్తాయి. మాములుగా ఇవి ఆకు కింది భాగం లేదా కాండంపై ఏర్పడుతాయి. ఆకు అంచుల వెంబడి లేదా పై భాగాన పసుపు నారింజ పండు వర్ణంలో మచ్చలు ఏర్పడుతాయి. కాయలు తుప్పు రంగు మచ్చలు కలిగి ముడుచుకు పోయి మరియు ఎండి పోయే అవకాశం ఉంది. కాండం మరియు ఆకు కాడలపై కాంకర్స్ కనిపిస్తాయి. ఆకులు రాలిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జీవ సంబంధ ఏజెంట్లను ఉపయోగించడం వలన వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. జీవ శిలీంధ్ర నాశని అయిన ట్రైకోడెర్మా హర్జియానమ్ మరియు బాక్టీరియా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ వంటి వాటిని విత్తనాల చికిత్సకు వాడాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వాతావరణ పరిస్థితులను బట్టి రసాయనాలు ఉపయోగించడం వలన ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం వుంది. సరైన శీలింద్ర నాశినులతో విత్తనాలను శుద్ధి చేయండి. పద్ధతుల్ని అవసరాన్ని బట్టి లేదా వ్యాధి తీవ్రతని బట్టి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ప్రతి ఒక లీటరు నీటికి 2 గ్రాముల థిరం 80% WP లేదా ఒకలీటరు నీటికి 2.5 గ్రాములు కప్తాన్ 75 WP. ఫోల్పేట్, మాంకోజెబ్, థియోఫానేట్ మిథైల్ (0.1%) కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటరు నీటిలో 3 గ్రాముల చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపయోగించాలి.

దీనికి కారణమేమిటి?

"కొలెటోట్రికం లిండేముతియనమ్" అనే శీలింధ్రం మట్టిలో, విత్తనాలలో మరియు మొక్కల అవశేషాలపై జీవిస్తుంది. ఇతర పదార్ధాలపై కూడా ఇది నిద్రావస్థలో ఉండి జీవిస్తుంది. వర్షం పడినప్పుడు లేదా తడిగా ఉన్న పొలంలో పని చేసినప్పుడు ఇది వ్యాపిస్తుంది. మంచు, తడి సమయాల్లో పొలాల్లో ఎటువంటి పని చేయకపోవటం (పనివాళ్ళు, ట్రీట్మెంట్స్) మంచిది. చల్లగా ఉండే ప్రాంతాల్లో(13-21°C ఉష్ణోగ్రతలు) మరియు తరుచుగా వర్షాలు పడే సమయంలో ఈ తెగులు తొందరగా వ్యాపిస్తుంది. ఈ సమయాల్లో వ్యాధి తొందరగా సోకే అవకాశాలు ఉంటాయి.


నివారణా చర్యలు

  • సూక్ష్మ క్రిములు లేని ధృవీకరించబడిన విత్తనాలనే పంట పొలాల్లో వాడండి.
  • మొక్కలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా పంటని సంరక్షించండి.
  • ఎక్కువగా కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోండి.
  • పొలంలో ఉపయోగించే పరికరాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ వుండండి.
  • ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి విధానాన్ని అనుసరించండి.
  • వ్యాధి సోకిన మొక్కలను పొలం నుండి తొలగించి కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి