గోధుమ

టేక్ ఆల్

Gaeumannomyces graminis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • నల్లబడిన వేర్లు, కాండము మరియు పాలిపోయిన పసుపు రంగులోకి మారిన (క్లోరోటిక్) క్రింది ఆకులు, పొలంలో సరైన పోషకహారము లేని మొక్కల యొక్క తెల్లని మచ్చలు దీని లక్షణాలు.
  • గింజలు ఒత్తిడికి గురిఅవుతాయి.
  • మొక్కలను భూమిలో నుండి సులభంగా పెకిలించవచ్చు.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
బార్లీ
గోధుమ

గోధుమ

లక్షణాలు

టేక్ ఆల్ వ్యాధి జి.గ్రామినిస్ బూజు తెగులు ద్వారా వస్తుంది. ప్రారంభములో నల్లబడిన వేర్లు, కాండము మరియు ప్రత్యేకంగా క్రింది ఆకులు ఆకుపచ్చగా మారడం సంభవిస్తుంది. ఈ పరిస్థితులలో మొక్కలు బతకగలిగితే అవి బలహీనంగా పెరుగుతాయి లేదా అసలు ఎదగవు. మరియు వేర్లలో నల్లటి గాయాలు కనబడతాయి తర్వాత ఇవి పై కణజాలముల వైపు విస్తరిస్తాయి. వేర్ల కణజాలాల వెంట చిక్కటి బూజు తెగులు గోచరిస్తుంది. అధిక వర్షపాతం వుండే ప్రాంతాల్లో మరియు నీటి పారుదల సౌకర్యం వున్న పొలాల్లో ఈ తెగులు వలన పెద్ద మచ్చలు గల అనేక తెల్లని తలలు గల గోధుమ మొక్కలు తయారవుతాయి. మొక్కలను సులభంగా భూమి నుండి పెకిలించవచ్చు, ఎందుకంటే ఈ సమయానికే వేర్లు నల్లబడి తీవ్రంగా కుళ్ళిపోయి వుంటాయి. ఈ తెగులు సోకిన మొక్కలు పంట కోయడానికి కూడా పనికిరాని చితికిన గింజలను ఉత్పత్తి చేస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

వివిధ బ్యాక్టీరియా యొక్క సూడోమోనాస్ కుటుంబం యాంటీబయాటిక్స్ ఉత్పత్తి ద్వారా మరియు ఐరన్ లాంటి అవసర పోషకాల కొరకు పోటీ పడడం ద్వారా దీనిని అణచి వేయడానికి వీలు పడుతుంది. బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఫెనాజైన్ లేదా 2,4- డైఎసిటైల్ ఫ్లోరాగ్లుసినిల్ టేక్ ఆల్ తెగులును వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. విరుద్ధమైన శిలీంధ్రాల జాతులు కూడా వాడవచ్చు ఉదాహరణకు తెగులు కారకాలు కాని గైమన్నొమైసిన్ గ్రామినిస్. గ్రామినిస్ గోధుమ విత్తనములను ఇది కప్పి ఉంచి మొక్కలు ఈ తెగులును నిరవదిక పెంచుకోవడంలో సహాయపడుతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సిల్థియోఫామ్ మరియు ఫ్లక్వికోనజోల్ కలిగిన శిలీంద్ర నాశినులను జి. గ్రమినిన్ తుడిచి పెట్టుకొని పోయేలా చేయడానికి ఉపయోగించవచ్చు. స్టేరోల్ ను నియంత్రించే శీలీంద్ర నాశినిలు మరియు స్త్రోబిలుర్రీన్ వాడడం వలన టేక్ ఆల్ తెగులు లక్షణాలను ప్రభావవంతంగా అణచి వేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ పంట లక్షణాలు గాయుమనోమైసిస్ గ్రామినిస్ అనే బూజు తెగులుచే కలిగించబడుతుంది. ఇది సీజన్ల మధ్య పంట వ్యర్థములు లేదా మట్టిలో జీవించి వున్న వాటితో కలుగుతుంది. ఇది బ్రతికి వున్న అతిధి మొక్కల వేర్లకు సంక్రమిస్తుంది అందువలన వేరు చనిపోతుంది. ఇది మరణిస్తున్న కణజాలాలపై ఉండి వాటిని తింటూ జీవిస్తుంది. బీజాంశములు గాలి, నీరు, జంతువులు మరియు వ్యవసాయ పనిముట్లు లేదా యంత్రాల ద్వారా రవాణా చేయబడతాయి. ఇవి మట్టిలో వుండే ఇతర సూక్ష్మ క్రిములతో కలసి సహజీవనము చేయలేవు. ఇవి వేడి తీవ్రతను తట్టుకోలేవు.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలు నాటండి.
  • వెచ్చని, తడి శీతోష్ణస్దితులలో పొలంలో గోధుమ పంటను ఒక సంవత్సరం తరువాత వేయండి.
  • చల్లని వాతావరణంలో ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి వేయండి.
  • ప్రతి రెండవ సంవత్సరం వరి పంట వేసి నీరు నిలువ చేయడము ద్వారా ఈ తెగులు కారకాలను చంపవచ్చు.
  • ముందు పంటకోత తరువాత గోధుమ పంట యొక్క విత్తనమును వేయడం రెండు వారాల వరకు ఆలస్యము చేయండి.
  • ఇతర జీవుల నుండి సూక్ష్మజీవుల ఒత్తిడి పెంచడానికి మట్టిని బాగా దున్నండి.
  • ఎరువును, ప్రత్యేకంగా భాస్వరం, మాంగనీస్, జింక్ మరియు నత్రజని వున్న ఎరువును చాలినంతగా వేయండి.
  • పొలంలో నీటి పారుదల సరిగా ఉండేలా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి